వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న బస్సుయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఒకేసారి బస్సుయాత్ర ప్రారంభం కాబోతోంది. డిసెంబరు నెలాఖరు వరకు జరిగే ఈ యాత్రకు సామాజిక సాధికార యాత్ర అనే పేరు పెట్టారు. 175 నియోజకవర్గాల్లోనూ గెలుపు లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకు పోతోంది. ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ పరమైన కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ కార్యాచరణ సిద్ధం చేశారు. గతేడాది మే నెలలో ప్రారంభమైన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ పరమైన కార్యక్రమాలను కూడా మరింత వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 26 అంటే బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లోనూ ఒకేసారి బస్సుయాత్రలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు బస్సులను రెడీ చేశారు. బస్సుల ముందు భాగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాను ప్రముఖంగా కనిపించేలా స్టిక్కరింగ్ చేశారు. పైభాగాన సామాజిక సాధికార యాత్ర పేరు కనపడేలా చేశారు. ఇక మిగతా మూడు వైపులా మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో స్టిక్కర్లు, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రమఖుల చిత్రాలను కూడా బస్సు మీద ఏర్పాటు చేశారు. ఇక బస్సు యాత్రలు తొలిరోజు అంటే ఈ నెల 26న ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం, కోస్తాంధ్రలో తెనాలి, రాయలసీమలో సింగనమల నియోజకవర్గాలలో ప్రారంభం కాబోతున్నాయి. తొలి విడతలో నవంబర్ తొమ్మిదో తేదీ వరకు యాత్రలకు సంబంధించిన వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దాని ప్రకారం ఉత్తరాంధ్రలో తొలుత ఇచ్చాపురంలో 26వ తేదీన బస్ యాత్ర ప్రారంభం కానుండగా, 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాలవలస, నవంబర్ 1న పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 4న శృంగవరపుకోట, 6న గాజువాక, 7న రాజాం, 8న సాలూరు, 9న అనకాపల్లె నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరుగుతుంది. ఇక కోస్తాంధ్రలో ఈనెల 26న తెనాలిలో ప్రారంభమయ్యే బస్సుయాత్ర 27న నరసాపురం, 28న చీరాల, 30న దెందులూరు, 31న నందిగామ, నవరంబరు 1న కొత్తపేట, 2న అవనిగడ్డ, 3న కాకినాడ రూరల్, 4న గుంటూరు తూర్పు నియోజకవర్గం, 6న రాజమండ్రి రూరల్, 7న వినుకొండ, 8న పాలకొల్లు, 9న పామర్రు నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఇక రాయలసీమ విషయానికొస్తే.. తొలుత ఈనెల 26న సింగనమల నియోజకవర్గంలో బస్సుయాత్ర ప్రారంభై 27న తిరుపతి, 28న ప్రొద్దుటూరు, 30న ఉదయగిరి, 31న ఆదోని, నవంబర్ 1న కనిగిరి, 2న చిత్తూరు, 3న శ్రీకాళహస్తి, 4న ధర్మవరం, 6న మార్కాపురం, 7న ఆళ్లగడ్డ, 8న నెల్లూరు రూరల్, 9న తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గడిచిన నాలుగున్నరేళ్లలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ చేసిన అభివ్రుద్ది, సంక్షేమ పథకాల గురించి వివరిస్తారని ఈనెల 9న విజయవాడలో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధినేత వైయస్ జగన్ చెప్పారు. ప్రతి బస్సు యాత్రను ఒకటీమ్ గా భావిస్తే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన లీడర్లు స్పీకర్లుగా ఉంటారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. వైనాట్ 175 అనేది ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ నినాదం. ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే పలు వేదికల మీద ప్రకటించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మ్యానిఫెస్టోలో ఇప్పటికే 98.5 శాతానికి పైగా అమలు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్‌దే. గత ప్రభుత్వాలన్నీ ఇచ్చిన హామాలను తుంగలో తొక్కేస్తే జగన్ మాత్రం మ్యానిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా పవిత్రంగా భావిస్తూ అందులోని హామీలను అమలు చేసేందుకు ఎక్కడా వెనక్కు తగ్గలేదు. అంతేకాదు.. మంత్రివర్గంలో కూడా బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికే 77 శాతం పదవులను కట్టబెట్టారు. స్థానిక పదవుల్లోనైతే మహిళలకు యాభై శాతాకిపైగా కేటాయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ, అభివ్రుద్ది కార్యక్రమాలను వారికి పూర్తిస్థాయిలో కల్పించారు. అందుకే వైయస్ జగన్‌ను ఆ వర్గాలన్నీ తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నాయి. రాబోయే ఎన్నికలను మరో కురుక్షేత్ర యుద్దంగా భావిస్తున్న నేపథ్యంలో పేదలు, పెత్తందార్ల మధ్యనే పోటీ జరగబోతున్నదని ఇప్పటికే పేద వర్గాలన్నీ భావిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా నిలిచింది. అందుకే వారంతా తమ జెండా, ఎజెండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని బాహాటంగానే చెప్తున్నారు. మొత్తమ్మీద బస్సు యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ క్యాడర్ మొత్తం ఈ యాత్రలో పాల్గొనబోతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావారణం కనిపిస్తోంది.