జ‌య‌హో‌ జ‌గ‌న‌న్న‌

10 రోజుల పాటు దిగ్విజ‌యంగా సాగిన ‘ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు’  కార్యక్రమాలు

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌ల సంఘీభావ పాదయాత్రలకు బ్ర‌హ్మ‌ర‌థం

అమ‌రావ‌తి‌: వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా  పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి చేప‌ట్టిన  సంఘీభావ పాదయాత్రలు సోమ‌వారం ముగిశాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ నేతలు ప్రజాచైతన్య యాత్రల్లో పాల్గొన్నారు. ఏ గ్రామం వెళ్లినా సంక్షేమ ప‌థ‌కాలే క‌నిపించాయి. ఏ ఒక్క‌రూ కూడా త‌మ‌కు ఫ‌లాని ప‌థ‌కం అంద‌లేద‌ని ఫిర్యాదులే నేత‌ల‌కు రాలేదు. జ‌య‌హో జ‌గ‌న‌న్న అంటూ నిన‌దాల‌తో ద‌ద్ద‌రిల్లింది. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూనే ప్ర‌జా చైత‌న్య కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ప‌శ్చిమ  గోదావరి జిల్లాలో మంత్రులు ఆళ్ల‌నాని, తానేటి వ‌నిత,చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వ‌ర్యంలో ‘ప్రజల్లో నాడు – ప్రజల కోసం నేడు’ పేరిట సాగిన కార్యక్రమంలో వేలాదిగా జ‌నం పాల్గొన్నారు.  గుంటూరు జిల్లాలో మంత్రి మేక‌తోటి సుచ‌రిత పాద‌యాత్ర చేప‌ట్టారు. ప్రకాశం జిల్లా లో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజలు నీరాజనం పలికారు.  మంత్రి ఇంటింటికీ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వైయ‌స్ఆర్ జిల్లాలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆధ్వ‌ర్యంలో సంఘీభావ యాత్ర చేప‌ట్టారు.   తూర్పుగోదావరి జిల్లా లో మంత్రి కన్నబాబు, పినిపే విశ్వరూప్ ఆధ్వ‌ర్యంలో పాద‌యాత్ర‌లు చేశారు. శ్రీకాకుళం జిల్లా  లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పాదయాత్ర నిర్వహించారు.  క‌ర్నూలు జిల్లాలో మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం, ఎమ్మెల్యేలు హాఫీజ్ ఖాన్‌, శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి, శ్రీ‌దేవి, ఆర్థ‌ర్ పాద‌యాత్ర‌లు చేశారు. అనంతపురం జిల్లాలో మంత్రి శంకర నారాయణ పాదయాత్ర నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎంపీ బీశెట్టి సత్యవతిల ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్రలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, సమన్వయకర్త కేకే రాజు పాల్గొన్నారు.   కృష్ణా, కర్నూలు, చిత్తూరు, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతల ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్రలు, ర్యాలీలు కొనసాగాయి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకొని..కొన్నింటిని అక్క‌డిక్క‌డే ప‌రిష్క‌రించ‌గా ..మ‌రికొన్ని స‌మ‌స్య‌ల‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై ఆరా తీస్తూ పాద‌యాత్ర‌లు కొన‌సాగించారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రోసారి ప్ర‌జ‌లు గుర్తుకు తెచ్చుకుంటూ..నాయ‌కుడంటే జ‌గ‌న‌న్న‌లా ఉండాల‌ని కొనియాడారు. 
 

Back to Top