ఊరూరా ప్ర‌జా చైత‌న్య యాత్ర‌లు

కొన‌సాగుతున్న‌‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ కార్యక్రమాలు

రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, పాదయాత్రల జోరు

 అమ‌రావ‌తి‌: జన నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రమంతటా పాదయాత్రలు, ర్యాలీల జోరు కొనసాగింది. ‘ప్రజల్లో నాడు.. ప్రజల కోసం నేడు’ కార్యక్రమాల్లో భాగంగా   వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వివిధ వర్గాల ప్రజలు, మహిళలు, రైతులు జేజేలు పలికారు. వైఎస్సార్‌ జిల్లా లింగాలలో ఎంపీ అవినాష్ రెడ్డి 23 కి.మీ మేర పాదయాత్ర చేశారు. చిత్తూరు జిల్లా పాలసముద్రంలో జరిగిన పాదయాత్రలో ఉప ముఖ్యమంత్రి  నారాయణస్వామి పాల్గొన్నారు.  

అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోమంత్రి శంకర్‌నారాయణ పాదయాత్ర అనంతరం రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా అంతటా వివిధ కార్యక్రమాలు జరిగాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలు జోరుగా సాగాయి. ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పుట్టగుంటలో మంత్రి కొడాలి నాని పాదయాత్ర నిర్వహించారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి గొట్టిపాడు వరకు హోం మంత్రి సుచరిత పాదయాత్ర నిర్వహించారు. తెనాలిలో జరిగిన బీసీ గర్జనలో ఎంపీలు మోపిదేవి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నెల్లూరులో మంత్రి అనిల్‌కుమార్‌ పాదయాత్ర చేశారు. విశాఖ జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పాదయాత్రలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో మంత్రి వనిత, ఆచంటలో  మంత్రి శ్రీరంగనాథ«రాజు పాదయాత్ర చేశారు. కర్నూలు జిల్లా అంతటా ప్రజా చైతన్య యాత్రలు కొనసాగాయి. 

Back to Top