తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో పార్టీ శ్రేణులు ఉద్యమ బాట పట్టాయి. నిన్న రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతకు అండగా నిర్వహించిన కార్యక్రమం సూపర్ సక్సెస్‌కావడంతో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నాయి. ఈ ఊపులోనే.. పరిపాలన పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ శ్రేణులకు వైయస్ జగన్ పిలుపు ఇస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక.. ‘‘వాళ్లు ప్రస్తుతం హానీమూన్‌లో మునిగి తేలుతున్నారని, అది ముగిసేదాకా అయ్యేదాకా వేచిచూద్దామని.. ఆ తర్వాత వాళ్ల సంగతి తేలుద్దామని’’ వైయస్ జగన్, వైయస్ఆర్‌సీపీ శ్రేణులకు సూచించారు. ఆయన చెప్పినట్లుగానే ఆర్నెల్ల టైం ముగిసింది. ఎన్నికల టైంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఓ ఒక్కటీని పరిపూర్ణంగా అమలు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. పైగా.. పైగా అన్నివర్గాలను బాబు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోంది. ఈ మోసం తారాస్థాయికి చేరడం, పరిపాలన గాడి తప్పడంతో ఇక ఉపేక్షించకూడదని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. తొలి విడతగా రైతులు, కరెంట్ ఛార్జీలు, స్కూల్ ఫీజుల బకాయిలు లాంటి ప్రధాన సమస్యలపై పోరాడేందుకు పిలుపు ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరుబాట పేరిట వైయస్ఆర్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజలు, రైతుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందజేశారు. చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని వైయస్ఆర్‌సీపీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. ఈ క్రమంలో.. ప్రజల తరఫున కూటమి సర్కార్‌పై మరిన్ని పోరాటాలు చేయాలని.. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ పోరాటాల ఎజెండాగా ఉండాలని పార్టీ నేతలకు వైయస్ జగన్ సూచించారు. దీంతో.. ఇక నుంచి పోరుబాటలో మరింత దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాలకు వైయస్ఆర్‌సీపీ పిలుపు ఈ నెల 27న కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలు ప్రజలపై రూ.15,500 కోట్ల కరెంట్ భారం వేసిన చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదలకు మరో పోరాటం జనవరి 3న వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ధర్నాలు తొలిపోరు విజయవంతం అన్నదాతను దగా చేస్తున్న కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ శుక్రవారం చేపట్టిన రైతు పోరును అడ్డుకునేందుకు చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని నాయకులు, రైతులపై బెదిరింపులు.. హౌస్ అరెస్టులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా తమ డిమాండ్లు వినిపించడంపై పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో వైయస్ఆర్‌సీపీ శుక్రవారం రైతులతో కలసి భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించింది. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పేర్కొంటూ అన్నదాతలతో కలసి వైఎస్సార్‌సీపీ నేతలు కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందజేశారు. కూటమి సర్కార్ దగాను నిరసిస్తూ చేపట్టిన తొలి పోరాటం గ్రాండ్ సక్సెస్ కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను అభినందిస్తూ ‘ఎక్స్’ వేదికగా తన ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. » దగా పాలనపై రైతన్నల తొలిపోరాటం విజయవంతం అయింది. చంద్రబాబు చేస్తున్న మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. రైతులకు తోడుగా నిలిచిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ అభినందనలు. ఆరు నెలల కాలంలోనే చంద్రబాబుపై వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతకు ఇవాళ్టి కార్యక్రమం అద్దం పట్టింది. దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. » చంద్రబాబూ..! ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్‌ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20 వేలు ఎందుకు ఇవ్వడం లేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా? ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యంచేసి, ఈ–క్రాప్‌ను గాలికి వదిలేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహించి, ధాన్యం కొనుగోళ్లను మధ్యవర్తులకు, మిల్లర్లకు అప్పగించడంవల్ల ఇవాళ ప్రతి బస్తాకు రూ.300–400లు నష్టపోతున్నామని రైతులు నిలదీయడం తప్పా? తమకు కనీస మద్దతు ధర ఇవ్వమని అడగడం నేరమా? » దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకొస్తే.. ఆ ఉచిత పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి తమపై అదనపు భారం వేస్తున్నారని రైతులంతా నిలదీయడం తప్పా? ఈ అంశాలపై కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందించకూడదా? తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో రైతులు ఇది కూడా చేయకూడదని అడ్డు పడటం చంద్రబాబు రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. » మరోవైపు నీటి సంఘాల ఎన్నికల్లో పోలీసులతో కలసి చంద్రబాబు చేస్తున్నవి దుర్మార్గాలు కావా? నో డ్యూ సరి్టఫికెట్లను వీఆర్వోలు గ్రామ సచివాలయాల్లోనే ఇవ్వాల్సి ఉండగా వాటిని ఇవ్వనీయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? తహశీల్దార్ కార్యాలయాలకు రమ్మని చెప్పి అక్కడ పోలీసుల సమక్షంలోనే టీడీపీ వారితో దాడులు చేయించడం న్యాయమేనా? నో డ్యూ సర్టిఫికెట్లు గ్రామస్థాయిలో ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడం నేరం కాదా? ఈ దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్టులపైనా దాడులు చేయడం మీ అరాచక పాలనకు నిదర్శనం కాదా?