పోరాటాల పురిటిగ‌డ్డ‌..వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ

రేపు వైయ‌స్ఆర్‌సీపీ 9వ అవిర్భావ దినోత్స‌వం
 

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు, ఆశ‌ల‌కు, ఓ మ‌హానాయ‌కుడి ఆశ‌యాల‌కూ ప్ర‌తిరూపం 

 విలువ‌ల‌కు చిరునామా

విశ్వ‌స‌నీయ‌త‌కు నిద‌ర్శ‌నం

ఎక్క‌డ చీక‌టి ఉంటుందో అక్క‌డ వెలుగు అవ‌స‌రం అవుతుంది. ఎక్క‌డ అధికారం వెర్రిత‌ల‌లు వేస్తుందో. అక్క‌డ ప్ర‌జాగ‌ళం వినిపించాల్సిన అవ‌స‌రం ముఖ్య‌మౌతుంది. ఎక్క‌డ అవినీతి, అక్ర‌మాలు వ్య‌వ‌స్థీకృతం అవుతాయో అక్క‌డ పోరాటానికి నాందీ ప్ర‌స్తావ‌న జ‌రుగుతుంది. అలాంటి సంద‌ర్భ‌మే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి పునాది అయ్యింది. ప్ర‌జా ఉద్య‌మానికి వేదిక‌య్యింది. 
యువ‌జ‌న శ్రామిక రైతు పార్టీ. ప్ర‌జ‌ల కోసం ప్ర‌జ‌ల మ‌నిషి ప్ర‌జామోదంతో ప్రారంభించిన పార్టీ. ఇది కేవ‌లం రాజ‌కీయ పార్టీ కాదు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లుకు, ఆశ‌ల‌కు, ఓ మ‌హానాయ‌కుడి ఆశ‌యాల‌కూ ప్ర‌తిరూపం. నాయ‌కుడంటే అధికారం అందుకునే వాడే కాద‌ని, అంద‌రివాడిగా మారి అనుక్ష‌ణం కాపాడేవాడ‌ని నిరూపించిన వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న ఓ సువ‌ర్ణ‌యుగం. త‌ర‌త‌రాల పాల‌న‌నూ ప్ర‌జ‌లు వైయ‌స్ పాల‌న‌తో పోల్చి చూసుకున్నారు. గ‌తంలో ఎప్పుడూ దొర‌క‌ని భ‌రోసా ఆ నాయ‌కుడి పాల‌న‌లో వారికి దొరికింది. ఆయ‌న చిరున‌వ్వులో కొండ‌త అండ వారికి క‌నిపించింది. ఆయ‌న ఆశ‌యాలు పేద బతుకుల బాగుకోసం. ఆయ‌న సంక‌ల్పం రాష్ట్ర ప్ర‌జ‌ల సంతోషం. ముఖ్య‌మంత్రిగా కాదు ప్ర‌తి ఇంటికీ ముఖ్య‌మైన మ‌నిషిగా మారిన ఆ నాయ‌కుడి హ‌ఠాత్మ‌ర‌ణం రాష్ట్రాన్నికుదిపేసింది. గ‌డ‌ప‌గ‌డ‌ప‌నూ శోక సంద్రంలో ముంచెత్తేసింది. గొప్ప నాయ‌కుడు దూర‌మ‌య్యాడు. పాల‌న ప‌డ‌కేసింది. ప్ర‌జ‌ల‌ను ఓట్లుగా మాత్ర‌మే చూసే పార్టీలు, ఆ పార్టీలో ప‌ద‌వులు, వాటి ద్వారా అధికారాలూ త‌ప్ప మ‌రేమీ ముఖ్యం కాద‌నుకునే నాయ‌కులూ త‌యార‌య్యారు. ఆ నాయ‌కుడి సంక్షేమ ప‌థ‌కాల‌కు తూట్లు పొడిచారు. మ‌హానేత ఆశ‌యాల‌ను స‌మాధి చేయాల‌ని చూసారు. అస‌లు వైయ‌స్ పేరే చ‌రిత్ర‌లో తుడిచేయాల‌ని ప్ర‌య‌త్నం చేసారు. రాతి మీద రాసిన‌వైనా నాశ‌నం అవుతాయోమో కానీ ప్ర‌జ‌ల గుండెల్లో రాసుకున్న రాత‌లు చెరిగిపోతాయా? వైయ‌స్ఆర్ ను వ్య‌క్తిగా కాదు శ‌క్తిగా, దేవుడిగా కొలిచే ప్ర‌జ‌లు ఆ మ‌హానేత అడుగుజాడ‌ల కోసం వెతికారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రూపంలో ఆ మ‌హానేత మ‌న‌కోసం ఉన్నాడ‌ని న‌మ్మారు. ఆశ‌యం ఆ నాయ‌కుడిదైతే ఆచ‌ర‌ణ ఈ యువ‌నేత కాగ‌ల‌డ‌ని విశ్వ‌సించారు. ఆ న‌మ్మ‌కానికి రూపంగా, ఆ విశ్వాసానికి పునాదిగా నిల‌బ‌డేందుకు, ప్ర‌జ‌ల వెన్నంటి నిలిచేందుకు, భ‌విష్య‌త్తులో వారిని ఒక్క‌టిగా న‌డిపించేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన పేరే వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ. 
పోరాటాల పురిటిగ‌డ్డ‌
ప్ర‌జ‌ల కోసం పుట్టిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ. అడుగ‌డుగునా వారికి అండ‌గా నిలిచి, ప్ర‌జావ్య‌తిరేక చ‌ర్య‌ల‌కుపాల్ప‌డే ప్ర‌భుత్వాన్ని నిప్పులతో క‌డుగుతోంది. 2011 మార్చి 12న ప్రారంభ‌మైన నాటి నుంచి ప్ర‌జా ఉద్య‌మాల‌కు ఊపిరిపోసింది. రైతుల కోసం, శ్రామికుల కోసం, మ‌హిళ‌ల కోసం, నిరుద్యోగ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం, సాగునీటి కోసం, ప్రాజెక్టుల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం నిరంత‌రం పోరాడిన ఏకైక పార్టీ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ. ప్ర‌భుత్వం ప్రజ‌ల హ‌క్కుల‌ను కాల‌రాసిన‌ప్పుడు, రాజ్యాంగ వ్య‌తిరేక‌నిర్ణ‌యాల‌కు పూనుకున్న‌ప్పుడు, ప్ర‌జాస్వామ్యానికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించిన‌ప్పుడు, ప్ర‌జాప్ర‌తినిధులు త‌న విధుల‌ను మ‌రిచిన‌ప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాలో ప్ర‌జ‌ల త‌ర‌ఫున నిలిచి పోరాటం చేసింది వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్. కాంగ్రెస్ కుట్ర‌లు కుతంత్రాల‌ను ఎండ‌గ‌డుతూ ప్ర‌జాక్షేత్రంలో అడుగుపెట్టిన  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ  ప్ర‌తి అడుగూ పోరాటాల బాట‌లోనే సాగుతోంది. 
వైయ‌స్ జ‌గ‌న్ దీక్ష‌లు
తండ్రి ఆశ‌యాలే త‌న పార్టీ సిద్ధాంతాల‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు యువ‌నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఎంపీగా భారీ మెజారిటీతో సంచ‌ల‌నం సృష్టించినా ఆ తండ్రి వార‌స‌త్వంగా పెద్ద కుటుంబాన్ని సంపాదించుకోవ‌డ‌మే ఆస్తి అని చెప్పే ఉన్న‌త వ్య‌క్తిత్వం అత‌డి సొంతం. ప్ర‌జా ప్ర‌స్థానంతో వైయ‌స్ఆర్ ప్ర‌జ‌ల మ‌నిషైతే, ప్రజా సంక‌ల్పం తో వైయ‌స్ జ‌గ‌న్ అంద‌రివాడ‌య్యాడు. తొమ్మిదేళ్ల రాజ‌కీయ జీవితంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. జాతీయ పార్టీల బెదిరింపుల‌కు త‌లొంచ‌లేదు. కుట్ర‌లు, కుతంత్రాల‌ను ఛేదించుకుంటూ ప్ర‌జ‌లే న్యాయ నిర్ణేత‌ల‌ని న‌మ్మి ప్ర‌జా జీవితంలోనే త‌న ప్ర‌తి క్ష‌ణాన్నీ వెచ్చిస్తున్నారు వైయ‌స్ జ‌గ‌న్. అధికారం కాదు ప్ర‌జాభిమాన‌మే పెద్ద ప‌ద‌వి అని న‌మ్మాడు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను గుర్తించి వారికోసం పోరాడ‌ట‌మే త‌న క‌ర్త‌వ్యం, పార్టీ ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నాడు. రైతుల‌కు మ‌ద్ద‌తుధ‌ర కోరుతూ రైతు దీక్ష‌, ప్రాజెక్టులను పూర్తి చేయాల‌ని డిమాండ్ చేస్తూ జ‌ల దీక్ష‌, ఫీజ్ రీయంబ‌ర్స్ మెంట్ ప‌థ‌కాన్ని నీరుగార్చ‌కూడ‌ద‌ని ఫీజు పోరు, ప్ర‌త్యేక హోదా కోసం నిర‌వ‌ధిక నిరాహార‌దీక్ష‌, హోదా పై యువ‌త‌ను చైత‌న్య ప‌రుస్తూ యువ‌భేరీ...స‌మ‌స్య ఉన్న ప్ర‌తిచోటా వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌రం సాగింది. ప్ర‌భుత్వాన్ని క‌దిలించేలా రాష్ట్రం న‌లుదిక్కులా అత‌డి స్వ‌రం ప్ర‌తిధ్వ‌నించింది. ప్ర‌భుత్వ అవినీతి, పాల‌కుల నిర్ల‌క్ష్యం, అధికారుల వైఖరీ ... ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా ఉన్న దేనిపైనైనా ఆ యువ‌నేత నిప్పులు కురిపించాడు. పోల‌వ‌రం కోసం, అగ్రిగోల్డు బాధితుల కోసం, విభ‌జ‌న హామీల కోసం అత‌డి పోరాటం నిరంత‌రంగా సాగుతోంది. 
హోదాకోసం ఎందాకైనా
రాష్ట్రానికి హోదా సంజీవ‌ని అని చెప్పి, ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తేవ‌డ‌మే కాదు యువ‌త‌ను ఆ దిశ‌గా న‌డిపించారు వైయ‌స్ జ‌గ‌న్. హోదా ఉద్య‌మాన్ని నిల‌బెట్టేందుకు పోరాడారు. హోదా వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌న్న ముఖ్య‌మంత్రి నోటితో హోదాకు జై కొట్టించారు. హోదా కోసం కేంద్రాన్ని నిల‌దీసేలా ప్ర‌భుత్వం మెడ‌లు వంచారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు కోరుతూ పార్ల‌మెంట్ లో ఐదుగురు ఎంపీల‌తో ప్రొటెస్టులు జ‌రిపారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టి, ఎంపీల‌తో నిరాహార‌దీక్ష‌ల‌కు పూనుకున్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేసారు. ఓ పోరాటంలో నిబ‌ద్ధ‌త ఇది. ఓ నాయ‌కుడి యుద్ధ తంత్రం ఇది. ఓ రాజ‌కీయ పార్టీ త‌న సిద్ధాంతానికి క‌ట్టుబ‌డిఉండే త‌త్వం ఇది. 
అందుకే నేడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెబితే రాష్ట్రం ఓ ఉప్పెన‌లా ఉత్సాహ‌ప‌డుతోంది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పేరు చెబితే రాబోయే ప్ర‌భుత్వం అని సంబ‌ర ప‌డుతోంది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని విలువ‌ల‌కు చిరునామాగా చూపెడుతోంది. న‌మ్మ‌కాన్ని, ఆశ‌ల‌ను నిల‌బెట్టే నిలువెత్తు జెండా ఇద‌ని గ‌ర్వ‌ప‌డుతోంది. ప్ర‌జ‌ల‌కోసం ప్ర‌జ‌లే త‌యారు చేసుకునే మేనిఫెస్టో ఈ పార్టీ అందిస్తోంది. ప్ర‌జ‌ల కోసం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉండే నాయ‌కుణ్ణి ఈ పార్టీ అందిస్తోంది. ప్ర‌జ‌లు త‌ప్ప మ‌రేదీ అంతిమ విజ‌యం కాద‌ని న‌మ్మే ఓ యువ ఆలోచ‌న‌కు ఈ పార్టీ ప్రాణం పోస్తోంది. 
 

Back to Top