వైయస్ఆర్ ఫించన్ - పేదలకు కలిగే మేలు ఇదీ!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని టీడీపీకి జరిగిన భారీ అవమానాన్నీ తట్టుకోలేక విపరీత పోకడలకు దిగుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికారం చేపట్టి పట్టుమని పదిరోజులు కాకుండానే పరిపాలన మీద పూటకో తీరుగా వాదనలు చేస్తున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ అలజడులు సృష్టిస్తున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచీ చేసిన ప్రతి పనినీ వక్రీకరిస్తున్న వారికి ఇవే సమాధానాలు.

పింఛను పెంపుపై కూడా ఎల్లో పెయిడ్ మీడియా విమర్శలు చవకబారుగా ఉంటున్నాయి. నిజానికి వృద్ధులకు 2000 రూపాయిల పింఛన్ పథకం వైఎస్ జగన్ గారి నవరత్నాల్లో ఒకటి. చంద్రబాబు దీన్ని కాపీ కొడతాడన్న విషయాన్ని కూడా నాడు జగన్ గారు ప్రజా ముఖంగా తెలియజేసారు కూడా. అలా జరిగే మీ పింఛను రూ.3000 వరకూ పెంచుకుంటూ వెళతాను అని కూడా హామీ ఇచ్చారు. ఒకేసారి 3000 పింఛన్ ఇస్తానని ప్రతిపక్షంలో ఉండగా వైఎస్ జగన్ ఎప్పుడూ చెప్పలేదు.  కానీ టీడీపీ దిగజారుడు ప్రచారకర్తలు జగన్ హామీని విస్మరించాడంటూ కారుకూతలు కూస్తున్నారు.  ఏడాదికి 250 చొప్పున పింఛన్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఒక్కసారి ఈ పింఛన్ లెక్కలను జాగ్రత్తగా గమనిస్తే - 

చంద్రబాబు పాలనలో నెలకు 1000 చొప్పున  56 నెలలకు రూ. 56,000
ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీ హామీని కాపీ కొట్టి రూ. 2000 ఇచ్చింది 4 నెలలు అంటే రూ.8000
మొత్తంగా ఐదేళ్లలో చంద్రబాబు ఇచ్చింది రూ.64000

వైస్ జగన్ మోహన్ రెడ్డిగారి పాలనలో పింఛన్ లెక్కలు ఇలా ఉన్నాయి.
రాబోయే ఏడు నెలల కాలంలో రూ.2250 చొప్పున ఇస్తుండటంతో ఆ మొత్తం రూ.15,750
తరువాతి సంవత్సరం మరో రూ.250 పెరిగడంతో రూ.2500 అవుతుంది. 12 నెలలకు దాని మొత్తం రూ.30,000
మరుసటి ఏడాది రూ.2750 చొప్పున 12 నెలలకు కలిపి రూ.33,000
నాలుగో ఏడాది రూ. 3000 చొప్పున 12 మాసాలకూ కలిపి రూ.36,000
ఐదే ఏడాది రూ.3000 కొనసాగడం వల్ల 12 నెలలకూ కలిపి మరో రూ.36000
ఎన్నికల ముందు ఏడాదిలో మరో 5 నెలలు ఉంటాయి కనుక వాటి మొత్తం మరో రూ.15000
ఈ మొత్తం కలిపితే అక్షరాలా రూ. 1,65,750
చంద్రబాబు ఐదేళ్లకు 64,000 మాత్రమే ఇస్తే వైఎస్ జగన్ గారి హయాంలో 1,65,000 పైగా లబ్ది దొరుకుతోంది. 
ఇదిగాక వికలాంగులకు పింఛను రూ.3000 చేసారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10,000 పింఛను అమల్లోకి తెస్తున్నారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రూ.2000 పెంచి రూ.3000 చేసారు.
ఆశా వర్కర్లు రూ.6000 జీతం కోసం చంద్రబాబు ప్రభుత్వంతో ఎన్నో ఏళ్లు పోరాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వారి వేతనాలను రూ. 10,000 చేసారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 

Back to Top