త్వరలో కొత్త అధ్యాయానికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ శ్రీకారం 

రెండు వారాల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ 14వ సంవత్సరంలోకి అడుగుబెట్టబోతోంది!

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రెండు వారాల్లో 14వ సంవత్సరంలో అడుగుబెట్టబోతోంది. 2011 మార్చి 12న పురుడుపోసుకున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీకి 2024 అత్యంత కీలక సంవత్సరంగా చరిత్రలో నిలవబోతోంది. 2019 మే ఆఖరులో ఆధికారంలోకి వచ్చిన  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ గడచిన దాదాపు ఐదు ఏండ్లలో మున్నెన్నడూ కనీవినీ ఎరగని సంక్షేమ రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించి, దాన్ని బలోపేతం చేస్తోంది. ఏప్రిల్‌–మే మాసాల్లో 18వ లోక్‌ సభతోపాటు జరిగే ఏపీ 16వ శాసనసభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి తెలుగునాట రాజన్న రాజ్యంలో పేదలు, బలహీనవర్గాలకు ఎలాంటి సాధికారత లభిస్తుందో దేశ ప్రజలకు చూపించడానికి సిద్ధమౌతోంది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలో గత పుష్కరకాలంగా తెలుగు జనంలో చైతన్యం నింపుతూ, ప్రగతికి కొత్త నిర్వచనం చెబుతోంది  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ. ఈ యువ రాజకీయపక్షం తాను పుట్టిన ఏడాదికే అంటే 2012 వేసవిలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో 90 శాతానికి పైగా సీట్లు కైవసం చేసుకోవడం తెలుగు రాష్ట్రం చరిత్రలో నూతనాధ్యాయానికి తెరలేపింది. తర్వాత రెండేళ్లకు 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కొద్ది శాతం ఓట్ల తేడాతో విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే అవకాశం కోల్పోయినాగాని మొక్కవోని దీక్షతో 2014–2019 మధ్య ఐదేళ్ల కాలంలో నాటì  దుర్మార్గ పాలకపక్షం తెలుగుదేశం దుర్మార్గ పరిపాలనపై అలుపెరగని పోరాటం సాగించింది. జగన్‌ గారి ప్రజా సంకల్ప యాత్రతోపాటు పార్టీ నేతలు, శ్రేణుల అలుపెరగని ఉద్యమాల ఆసరాతో ఈ నూతన రాజకీయపక్షం తెలుగునాట అధికారంలోకి వచ్చింది.

2019 రికార్డును అధిగమించే శక్తి ఒక్క  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకే ఉంది! 
కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సాధించిన మెజారిటీ రికార్డు (మొత్తం 175కుగాను 151 సీట్లు) మరే ఇతర పార్టీ పగలగొట్టలేనంత ఎక్కువ.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తన రికార్డును తానే అధిగమించేంత బలాన్ని గడచిన ఐదు సంవత్సరాల్లో  సంపాదించింది. తన మొదటి పదవీకాలంలో ప్రజలకు చేసిన మేలు, రాష్ట్రానికి సాధించిపెట్టిన అభివృద్ధే రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని గెలిపించి, అధికార పీఠంపై మరో ఐదు సంవత్సరాలు కూర్చోబెట్టబోతున్నాయి.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి అధికారం అనేది అలక్ష్యానికి గురైన ఆంధ్రులకు సేవచేసే సాధనమేగాని రాజదండం కాదు అని ఐదున్నర కోట్ల ఏపీ ప్రజలు ఇప్పటికే గ్రహించారు. మరోసారి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమించే అవకాశాన్ని వైయ‌స్ జగన్‌ గారి పార్టీకి ప్రజలు ఇవ్వబోతున్నారు. ఈ విషయం ఎన్నికల విశ్లేషకులు, రాజకీయ పండితులకే కాదు టీడీపీ సహా అన్ని ప్రతిపక్షాలకూ తెలిసిన నిజం.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తన పదమూడు సంవత్సరాల ప్రయాణం పూర్తవుతున్న సమయంలో ఎదురయ్యే ఎన్నికల పరీక్షలో ప్రజల మద్దతుతో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత సాధించడానికి సమాయత్తమౌతోంది.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తన 14వ ఏట మరెన్నో విజయాలు సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Back to Top