మ‌రోసారి మాట నిల‌బెట్టుకుంటూ..

నేడు రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ

 పంటలు నష్టపోయిన రైతన్నలకు రూ.542.06 కోట్లు

మొత్తం 5,97,311 మందికి లబ్ధి

 యంత్ర సేవా పథకం కింద మరో రూ.29.51 కోట్లు

1,220 రైతు గ్రూపులకు మేలు

మొత్తంగా రైతులకు రూ.571.57 కోట్ల మేర ప్రయోజనం

నేడు రైతన్నల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైయ‌స్ జగన్

అమ‌రావ‌తి:  ప్ర‌కృతి వైఫ‌రిత్యాల వ‌ల్ల న‌ష్ట‌పోయిన ప్ర‌తి రైతుకు పూర్తి ప‌రిహారం అందాలి. అదీ స‌కాలంలో అందాలి. ఏ సీజ‌న్ లో జ‌రిగిన పంట నష్టానికి ఆ సీజ‌న్ ముగిసే లోపుగానే న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌న్న మాట మారోసారి నిల‌బెట్టుకుంటూ.. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి నేడు రైతుల‌కు ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేస్తున్నారు. 

గతేడాది నవంబర్ లో భారీ వర్గాలు. వరదలతో పంట నష్టపోయిన రైతన్నల  ఖాతాల్లో ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేయనుంది. వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 597,311 మంది రైతన్నలకు దీనివల్ల లబ్ది చేకూరనుంది. మొత్తం రూ.542.06 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మంగళవారం నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేస్తారు. 

అలాగే 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైయ‌స్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను కూడా జమ చేయనున్నారు. ఇలా మొత్తం 571.57 కోట్లను గుంటూరు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేస్తారు.

 వైయ‌స్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇట్ సబ్సిడీ అక్షరాల రూ.1.612.62 కోట్లు కావడం గమనార్హం. సకాలంలో పూర్తి పరిహారం

ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకూ పూర్తి పరిహారాన్ని ప్రభుత్వం సకాలంలో అందజేస్తోంది. ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోపే నష్టపరిహారం చెల్లిస్తామనే మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు ఇన్పుట్ సబ్సిడీని జమ చేస్తున్నారు. 

అంతేకాకుండా రబీలో విత్తనాలు వేసి. వర్షాల వల్ల మొలక శాతం దెబ్బతిన్న రైతులకు మళ్లీ విత్తుకోవడానికి వీలుగా 80 శాతం రాయితీతో 1.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఆ రోజే అప్పటికప్పుడే ప్రభుత్వం పంపిణీ చేసింది.

గత ప్రభుత్వ హయాంలో రిక్త హస్తం...

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా పంట నష్టాలను అంచనా వేసేవారు. వారికి కావాల్సినవారికే పరిహారం దక్కేది. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక శాస్త్రీయంగా, అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ-క్రాప్ ఆధారంగా పంట నష్టాలను అంచనా వేస్తోంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శిస్తోంది.

తాజా ఫోటోలు

Back to Top