అసెంబ్లీలో వైయ‌స్ఆర్ ఆఖ‌రి స్పీచ్‌

మేము చేసిన మేలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి చెందారు

సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాం. మాట తప్పం. మడమ తిప్పం.’’

సేద్యపు నీటి రంగానికి ప్రాధాన్యం ఈసారి కొనసాగిస్తాం.

ఐదేళ్ల పరిపాలన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌.వై.యస్‌.రాజశేఖరరెడ్డి శాసనసభా సమావేశాల్లో ప్రసంగించారు. గత ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, వచ్చే ఐదేళ్లలో ప్రాధాన్యతాంశాలను ఆయన సభకు తెలిపారు. శాసనసభలో ఆయన చివరి ప్రసంగపాఠం ఇది.
’’గడచిన ఐదు సంవత్సరాలలో మేము చేసిన మేలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తి చెందారు. కాబట్టే...ఒకే..గో ఎహెడ్‌’ అన్నారే కానీ వెరీగుడ్‌ అనలేదు’. అయినా మేం ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తాం. మాట తప్పం. మడమ తిప్పం.’’
’’ఈ అయిదు సంవత్సరాలలో ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి మేలు జరగాలి. మంచి మేలు జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మంచి చట్టాలు తీసుకురావాలి. ప్రజా సమస్యలు ఈ సభ ద్వారా ప్రస్తావించబడాలి. ప్రభుత్వం దానికి స్పందించి తగు విధమైన జవాబు ఇవ్వాలి. గత ఐదేళ్లలో మేం ప్రజలకిచ్చిన మేలు కానీ, అభివృద్ది కానీ బాగా ఉన్నాయా?లేదా..? వారికి సంతృప్తికరమైన స్థాయిలో ఉన్నాయా..? లేదా వారిచ్చిన అధికారాన్ని, అధికారంలో ఉన్న ప్రభుత్వం దుర్వినియోగం చేసింది...? అన్న విషయాల్ని ప్రజలు చాలా నిశితంగా విమర్శిస్తారు. విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఏ ఒక్కరోజూ ఏ ఒక్కరైనా ప్రజలను  WE JUST CAN`T TAKE THEM GRANTED వారేదో చూడలేదులే, వారు గమనించలేదులే అని చెప్పి అనుకుని ఏదైనా చిన్నా, పెద్దా పొరపాటు చేస్తే, తగు విధమైన జవాబు చెప్పే అవకాశం వారికి కేవలం ఈ అయిదు సంవత్సరాలప్పుడే వస్తుంది. నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక అత్యంత గొప్ప విషయం ఏమిటంటే, సామాన్య ప్రజలందరికీ కూడా, సమాజంలో ఉన్న అత్యంత పేదవాడికి కూడా, అత్యంత ధనవంతుడికీ కూడా ఏ విధంగా ఒక ఓటు ఉందో, చదువుకున్న వాడికీ, చదువులేని వాడికీ కూడా అదే విధంగా ఓటు బలం ఉంది.
గడిచిన ఐదేళ్లలో మా పరిపాలనలో చిన్నాపెద్దా లోటుపాట్లు ఏ ఒక్కచోట ఉన్నా చాలా జాగ్రత్తగా పరిశీలించి, పరీక్షించి మరింత మేలైన ప్రభుత్వం ఇవ్వమని, మాకు ఇవాళ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. 
అభివృద్ధి ఓకే చేశారు. బాగానే చేశారు. సంక్షేమం కూడా బాగానే చేశారు. కానీ మరింత వేగవంతంగా జరగాలి. మరింత ఎక్కువగా సంక్షేమం జరగాలి. ఏ ఒక్కచోటా కూడా డెలివరీ సిస్టమ్‌లో ఏ చిన్న పొరపాటూ జరగకూడదు. ట్రాన్స్‌పరెంట్‌గా ప్రభుత్వం ఉండాలి. ఎక్కడ, ఏ లెవల్‌లో అవినీతి జరిగినా అది తప్పవుతుంది.
సాచ్యురేషన్‌ కాన్సెఫ్ట్‌ తీసుకున్నాం. రేషన్‌కార్డుల్లో కానివ్వండి. ఇల్లులేని ఏ ఒక్కరికీ ఇల్లు ఇవ్వడంలో కానివ్వండి. తెల్లరేషన్‌ కార్డు ఏ ఒక్కరికైనా కూడా వారికి అదే అర్హతగా గుర్తించి, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకూ అందేటట్టు చేశాం. ప్రతిదీ సాచ్యురేషన్‌ కాన్సెఫ్ట్‌లో మేలైన  డెలివరీ సిస్టమ్‌ ఏర్పాటు చేశాం.
పేదవాడు ఓటు వేసినా, వేయకపోయినా, పేదవాడికో పార్టీ అంటగట్టి, పార్టీ పేరుతో తనకు కావాల్సిన మేలు ఇవ్వకుండా పోతే పాపమవుతుంది. ఈ విధమైన పరిస్థితి ఉండకూడదనే ఆలోచన చేసే సాచ్యురేషన్‌ కాన్సెఫ్ట్‌ తీసుకువచ్చాం. ఇల్లు లేని వాడికి ఇల్లు వస్తే సంతోషిస్తారు.  దేశవ్యాప్తంగా అమలవుతున్న జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న కూలీరేటును ఇటీవల 100 రూపాయలు చేశాం. నూట ఇరవై రూపాయలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. 
జాతీయ ఉపాధి హామీ పథకంలో బాధ్యత ఉండేలా జాగ్రత్త తీసుకున్నాం. గ్రామ స్థాయిలో కూడా బాధ్యత ఉండేటట్టుగా సోషల్‌ ఆడిట్‌ ఏర్పాటు చేశాం. ఎంత చిన్న ఫిర్యాదు వచ్చినా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల వాళ్లు మన రాష్ట్రానికి వచ్చి మనల్ని మోడల్‌గా తీసుకుంటున్నారు. 
గడచిన ఐదేళ్లలో యూనివర్శిటీలు తెచ్చాం. మెడికల్‌ కాలేజీలు పెట్టాం. రాజీవ్‌ ట్రిపుల్‌ ఐటీ పెట్టాం. ప్రత్యేకంగా గ్రామాల్లో ఉన్న పేద విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అవకాశాలు రాకుండా పోతున్నాయి. సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఎంసెట్‌ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. గ్రామీణ పిల్లలకూ కార్పొరేట్‌ విద్యనందించాలని భావించే రాష్ట్రంలో మూడు చోట్ల ట్రిపుల్‌ ఐటీలో ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం ఒక్కో ట్రిపుల్‌ ఐటీలో 2200 మంది పిల్లలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు పైగా ఖర్చు పెట్టి విద్య నేర్పుతున్నాం. రాష్ట్రంలో ’ట్రిపుల్‌ ఐటీలో 2200 మంది పిల్లలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు పైగా ఖర్చు పెట్టి విద్య నేర్పుతున్నాం. రాష్ట్రంలో ’రాజీవ్‌ ట్రిపుల్‌ ఐటీ’ల్లో ఏటా 6600 మంది విద్యార్థులు చదువుతున్నారు. 
వ్యవసాయరంగంలో మరిన్ని వేగవంతమైన ఫలితాలు సాధించాలి. ఇందుకు అనుగుణంగా సహకార వ్యవసాయ విధానాన్ని తీసుకువస్తాం. చైనా, ఇజ్రాయిల్‌లో సహకార వ్యవసాయ విధానం చేపట్టి విజయాలు సాధించారు. మనం కూడా వాటి ద్వారా సత్ఫలితాలు పొందాలి. ప్రయోగాత్మకంగా 40 నుంచి 50 గ్రామాల్లో సహకార వ్యవసాయ విధానం అమలు చేస్తాం. ఈ ప్రైవేఃట్‌ ప్రాజెక్టుల్లో భాగంగా ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఐదు నుంచి పదికోట్ల రూపాయలు సాయం అందజేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ అమలుపై అన్ని పార్టీలతో చర్చిస్తాం.
సేద్యపు నీటి రంగానికి ప్రాధాన్యం ఈసారి కొనసాగిస్తాం. 1.76 లక్షల కోట్ల వ్యయంతో 81 ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించాం. ఈసారి కూడా భగవంతుడు కరుణిస్తాడు.
సత్యమేవ జయతే...అంటే సత్యం ఒకటే జయిస్తుందనికాదు. ఇంకొంచెం గట్టిగా ఆలోచిస్తే సత్యం మటుకే జయిస్తుందని అనుకోవాలి.
 ULTIMATELY TRUTH PREVAILS ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా TRUTH PREVAILS.

p.s:
అంతా చదివారు కదా! దటీజ్‌ వైయస్సార్‌!!
ముగుస్తున్న తన ఐదేళ్ల పాలనపై చంద్రబాబు నిజాలే మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఎలా మాట్లాడతారు? think it over....it`s upto you.
 

Back to Top