వైయ‌స్ జగన్‌ లక్ష్యం ’మనందరి ప్రభుత్వం’

వైయ‌స్ జగన్‌ సంకల్పం నుంచి ఆవిర్భవించిన వైయ‌స్ఆర్‌ సీపీ

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశయాలే పార్టీ ఎజెండా

అమ‌రావ‌తి: యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌(వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌) పార్టీ ఆవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తవుతోంది. ఇవాళ్టికి తొమ్మిదవ వసంతంలోకి  పార్టీ అడుగుపెట్టింది. గడచిన ఎనిమిదేళ్లలో పార్టీ నేతలు ఏనాడూ ప్రజాక్షేత్రాన్ని వీడలేదు. అధికారపార్టీ నుంచి ఎదువుతున్న అనేక ఇబ్బందులను, కష్టనష్టాలను ఓర్చుకుంటూ జనం సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ ప్రజల మధ్యనే గడిపారు. మ‌నంద‌రి ప్ర‌భుత్వ‌మే ల‌క్ష్యంగా ప్ర‌జ‌ల కోసం ఎందాకైనా అంటూ వైయ‌స్ జ‌గ‌న్ నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. ల‌క్ష్యం నెర‌వేరే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయి.  మార్చి11, 2019... తూర్పు గోదావరిలో వైయ‌స్ జ‌గ‌న్‌ ఎన్నికల నగారా మోగించారు.  మే 23,2019...వైయ‌స్‌ జగనే ’ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి’ అని ప్రజాతీర్పు తేల్చేస్తుంది.   నవవసంతంలోకి అడుగుపెట్టిన మా వైయ‌స్ఆర్‌ సీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యం.

సంక్షేమం, అభివృద్ది పథకాలతో ఏపీలో కొత్తవసంతం వస్తుంది. ప్రజలందరి మొహాల్లో చిరునవ్వులు పూస్తాయి .ఎనిమిదేళ్లపాటు వైయ‌స్ఆర్‌ సీపీని వైయ‌స్‌ జగన్‌ నడిపిన తీరుకు హేట్సాఫ్‌. అతని ఆలోచనలెప్పుడూ ప్రజాసమస్యల చుట్టూనే తిరుగుతుంటాయి. ప్రజాహితమే లక్ష్యంగా నడుస్తుంటాడు. వైయ‌స్ జగన్‌ లక్ష్యం ’మనందరి ప్రభుత్వం’. ప్రజాస్వామిక ప్రభుత్వం. సాధించితీరుతాడు జననేత వైయ‌స్ జగన్‌.
 దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పేరే పార్టీ పేరు. ఆయన ఆశయాలే పార్టీ ఎజెండా. వైయ‌స్ జగన్‌ సంకల్పం నుంచి ఆవిర్భవించిన వైయ‌స్ఆర్‌ సీపీ ఎనిమిదేళ్ల గమనం ఆషామాషీగా సాగలేదు. ఎన్నెన్ని ఆటుపోట్లు. ఎన్నెన్ని కుట్రలు, కుతంత్రాలు. అన్నింటినీ తట్టుకుని ప్రజలతో మమేకమై రాజకీయ యాత్ర చేసిన పార్టీ...తొమ్మిదో ఏట అడుగులు వేసింది. అది జైత్రయాత్రే అవుతుంది.

 స్పష్టమైన లక్ష్యాలు, ఆలోచనల్లో స్పష్టత, విలువలు, విశ్వసనీయతలే పార్టీ సిద్దాంతాలు. వైయ‌స్ఆర్‌ సీపీ...రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు...దేశరాజకీయాల్లోనూ కీలకపాత్ర వహించే రోజులు అట్టే దూరంలో లేవు. వైయ‌స్ జగన్‌కు ఆ శక్తి, సామర్ద్యాలున్నాయి. అంతకు మించి ప్రజలకోసం ఎందాకైనా...నడిచే మనస్తత్వం వుంది. 

Back to Top