వైయ‌స్ జగన్ ఈజ్ ఏ టార్చ్ బేరర్....

నేడు వై.య‌స్‌. జగన్‌మోహన్‌ రెడ్డి జన్మదినం

ప్రభుత్వ విద్యావ్యవస్థ బాగు కోసం ఐదేళ్లపాటు వైయ‌స్​ జగన్‌ అహర్నిశలు కృషి చేశారు. పిల్లల్ని గ్లోబల్‌ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు శ్రమించారు.

‘ప్రతి 30 సంవత్సరాలకు బతుకు తాలూకా ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్‌ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్‌ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్‌ అంటారు. కానీ ప్రతి జనరేషన్‌లో ఆ కొత్త థాట్‌ను ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడినే టార్చ్‌ బేరర్‌ అంటారు.’ ఇది ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలోని ఓ డైలాగ్‌. నిజ జీవితంలో ఇలాంటివారు అరుదుగా ఉంటారు. 2019 – 24 మధ్య ఏపీలో జరిగిన పాలనను చూస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని టార్చ్‌ బేరర్‌గా చెప్పొచ్చు. ఆ ఐదేళ్లలో ఆయన చేసిన సంస్కరణలు అలాంటివి.

Image

ఎంపీగా మొదలైన వైయ‌స్ జగన్‌ ప్రస్థానం ఏపీ రాజకీయాలను కొత్త దారిలో నడిపించే స్థాయికి చేరుకుంది. ప్రజలకు మంచి చేసిన నాయ కుడిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. జగన్‌ మొదటి నుంచీ ప్రజల్లోనే ఉన్నారు. ఆయన పాదయాత్ర చేస్తే పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కాలు కదిపాయి. కోట్ల మంది ఓన్‌ చేసుకున్న లీడర్‌!

Image

జగన్‌ దేశంలో ఏ నాయకుడూ సాహసం చేయని పనులకు శ్రీకారం చుట్టారు.  వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో సంక్షేమం, అభివృద్ధి కాగితాలకు పరిమితం కాలేదు. క్షేత్రస్థాయిలో కనిపించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెమ్మలకు డీబీటీ, నాన్‌ డీబీటీ కింద రూ. 2,83,866 కోట్లు అందించారు. ఆయన పాలనే విప్లవాత్మక నిర్ణయాలతో మొదలైంది. సీఎం అయిన ఆరు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 1.34 లక్షల ఉద్యోగాలిచ్చారు. 58 వేలమంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశారు. 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి రాజకీయ పార్టీలు, కులమతాలకు అతీతంగా పథకాలను అందించారు.

Image

చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారు. కార్పొరేట్‌ను పెంచి పోషించారు. కానీ విద్యావ్యవస్థ బాగు కోసం ఐదేళ్లపాటు జగన్‌ అహర్నిశలు కృషి చేశారు. పిల్లల్ని గ్లోబల్‌ సిటిజన్లుగా మార్చేందుకు కష్టపడ్డారు. ఏపీలోని పల్లెల బిడ్డలు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడతారని ఏనాడైనా అనుకున్నామా? ‘నాడు – నేడు’తో బడికి కొత్త కళ వచ్చింది. ఏపీలో విద్యారంగ సంస్కరణల కోసం గత ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాలా రూ. 73 వేల కోట్లు. అభివృద్ధి, సంక్షేమాన్ని చంద్రబాబు గ్రాఫిక్స్‌లో చూపిస్తే జగన్‌ క్షేత్ర స్థాయిలో కనిపించేలా చేశారు. 17 మెడికల్‌ కాలేజీలు, నాలుగు పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, పేదలందరికీ ఇళ్ల నిర్మాణం... ఇలా ఆయన చేపట్టినవి ఎన్నో!

Image

దేశ చరిత్రలో ఏ నాయకుడిపై జరగనంత వ్యక్తిత్వ హననం జగన్‌పై జరుగుతోంది. వైయ‌స్ జగన్‌ వీటిని చిరునవ్వుతోనే ఎదుర్కొంటున్నారు తప్ప ఎక్కడా మాట తూలలేదు. చంద్రబాబు పెంచి పోషిస్తున్న సోషల్‌ మీడియా సైకోలు జగన్‌పై నిత్యం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్‌లలో దుష్ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. వైయ‌స్ జగన్‌ కూర్చొన్నా, మాట్లాడినా, నవ్వినా, చూసినా పిచ్చిపిచ్చి రాతలతో పోస్టులు, రీల్స్‌ పెడుతున్న వారి కుటుంబాల్లో ఎంతోమంది గత ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉంటారు!

వైయ‌స్ జగన్‌కు పడటం కొత్త కాదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందు కెళ్లే వ్యక్తికి ఎలా లేచి నిలబడాలో బాగా తెలుసు. ఏదో మేజిక్‌ వల్ల గెలిచిన కూటమి పెద్దలు ఆయన పని అయిపోయిందని ఇప్పుడు సంబర పడుతూ ఉండొచ్చు. ఏపీలో అధికా రంలోకి వచ్చిన కొన్ని నెలలకే చంద్రబాబు అంతులేని వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఒకప్పటిలా సంక్షేమం అందకపోవడంతో జనం నిరాశలో కూరుకుపోతున్నారు. ప్రజల బాగు కోసం పనిచేసే నాయకుడు ఎప్పటికీ ఫెయిల్‌ కాడు. ఎందుకంటే వారి సంకల్ప బలం చాలా గొప్పది.

Image

నిజమైన జననేతకు జన్మదిన శుభాకాంక్షలు!
– వెంకట్‌ 

Back to Top