దేశ‌వ్యాప్తంగా ‘వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా‘

రైతులకు ఏడాదికి  రూ. ఆరువేల ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన కేంద్రం

ఇప్ప‌టికే తెలంగాణ‌లో రైతు బంధు ప‌థ‌కం అమ‌లు

రైతులకు ఆర్థిక‌సాయం ప‌థ‌కం అలోచ‌న వైయ‌స్ జ‌గ‌న్‌దే 

మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాల కన్నా ఎంతోముందే వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా

 హైదరాబాద్‌ : కరువు కాటలతో ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలను, ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టిన డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి వారి కష్టాలను చూసి చలించి పోయారు. అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని చూసి చలించిపోయారు. ఈ నేపథ్యంలో  2004 ఎన్నికలకు ముందు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను తప్పకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. ఆ సంతకం చిరస్థాయిగా మిగిలిపోయింది. తర్వాత  సాగు భారమై అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నల ఆశలకు కొత్త ఊపిరులూదారు. వ్యవసాయ రుణాల మాఫీతో రైతుకు ఉపశమనం కలిగించారు. 

రాష్ట్రంలో ఎడారిగా మారిన పంట పొలాలను సస్యశ్యామలం చేశారు దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి. జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులను చేపట్టి లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చారు. పోలవరం, చేవెళ్ల–ప్రాణహిత వంటి భారీ నీటి  పథకాలతో అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని లక్షల  ఎకరాల్లో మూడు పంటలు పండించుకునేలా నీరు అందించారు. దీంతో కొన్ని ఏళ్ల నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులకు కొత్త శక్తిని ఇచ్చారు. ఎడారిగా ఉన్న భూములను సైతం సాగులోకి తేవడంతో రైతులంతా రాజన్నను దేవుడి మాదిరి కొలిచారు.

దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌హానేత మ‌న మ‌ధ్య నుంచి వెళ్లిపోవ‌డం, రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం అస‌మ‌ర్ధుడు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావ‌డంతో ఆయ‌న వెంటే క‌రువు వ‌చ్చింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌హానేత త‌న‌యుడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ రైతుల‌కు తోడుగా ఉంటాన‌ని ముందుకు వ‌చ్చారు. రైతుకు అండ‌గా ఉండేందుకు ముందుగానే పెట్టుబ‌డి కింద ఏడాదికి రూ.125000 ప్ర‌తి ఏడాది మే నెల‌లోనే అంద‌జేస్తామ‌ని 2017 జులై 9న గుంటూరులో నిర్వ‌హించిన పార్టీ ప్లీన‌రీలో ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా అమ‌లు కానుంది. కేంద్రం ఇవాళ రైతుల‌కు ఏటా రూ.6  వేల ఆర్థిక‌సాయం అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో దేశ‌వ్యాప్తంగా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా ప‌థ‌కం గుర్తుకు చేసుకుంటున్నారు.

సంక్షోభంలో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు నేరుగా ఆర్థిక సాయం అందజేసే పథకాలు తెరపైకి రావడంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందజేయడానికి వారి ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తూ.. రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టగా.. తాజాగా కేంద్రంలోని మోదీ సర్కారు కూడా ఇదే పథకాన్ని ప్రకటించింది. రైతులకు ఏడాదికి నేరుగా రూ. ఆరువేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ పథకం మొదట ప్రకటించింది ఎవరు? ఈ పథకాన్ని మొదట రూపొందించిన దార్శనికత ఎవరిది అన్న చర్చ ఊపందుకుంది.

అసలు రైతులకు నేరుగా పెట్టుబడి సాయం అందజేయాలన్న ఆలోచన చేసిన తొలి వ్యక్తి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి. మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాల కన్నా ఎంతోముందే.. జూలై 9, 2017లోనే రైతులకు నేరుగా పెట్టుబడి సాయం అందజేస్తానని వైయ‌స్‌ జగన్‌ ప్రకటించారు. గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా అన్నదాతలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘వైయ‌స్ఆర్‌ రైతు భరోసా’  పథకం ద్వారా నేరుగా ఆర్థిక సాయం అందజేస్తామని, ఏడాదికి రూ. 12,500 చొప్పున రైతులకు ఇస్తామని ప్రకటించారు. 

‘‘అధికారంలోకి రాగానే నేను చేపట్టబోయే తొలి పథకం వైయ‌స్ఆర్‌ రైతు భరోసా.. 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ రూ. 50 వేల రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తాను. ఏటా రూ. 12,500ను ఒకేసారి మే నెలలో ఇస్తాం. మే నెలనే ఎందుకంటే వ్యవసాయానికి రైతు సన్నద్దం అయ్యే విధంగా.. నేరుగా రైతుల చేతికే ఇస్తాం. మొత్తం నాలుగు విడతల్లో అందజేస్తాం’’-  9 జూలై 2017న గుంటూరులో జరిగిన వైయ‌స్ఆర్‌సీపీ ప్లీనరీలో వైయ‌స్‌ జగన్
 
 

Back to Top