విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి అడుగులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణపై రెగ్యులేటరీ కమీషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, కేబినెట్ ను ఏర్పరిచిన వెంటనే అమలులోకి తెస్తున్నారు. ఒక్కసారి మాటిస్తే వెనుతిరిగి చూసేది లేదని నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టే నేడు వైఎస్ జగన్ గారు కూడా పాటించి చూపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్న యువ ముఖ్యమంత్రి విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.

విద్యా వ్యవస్థలో ప్రైవేటు దోపిడీ
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రైవేటు స్కూళ్ల వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను మూతపెట్టారు. నాటి ప్రభుత్వం సొంత పార్టీ నేతలకు చెందిన ప్రైవేటు విద్యా సంస్థలకు విద్యారంగాన్ని రాసిచ్చేసింది. లక్షల్లో ఫీజులు పిల్లల తల్లితండ్రులకు మోయలేని భారంగా మారాయి. ప్రభుత్వ బడులు అందుబాటులో లేకుండా చేసి, ప్రైవేటు స్కూళ్లు తప్ప గత్యంతరం లేని విధంగా పరిస్థితులను కల్పించింది చంద్రబాబు ప్రభుత్వం. అగ్గిపెట్టెల్లాంటి గదులు, లక్షల్లో ఫీజులు, అర్హతలేని ఉపాధ్యాయులు, వికాసానికి నోచుకోని చదువులు, పిల్లల్లో విపరీతమైన ఒత్తిడీ...వెరసి విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించేసారు. ఎల్ కే జీ కే లక్ష రూపాయిలు కట్టాల్సిన పరిస్థితిలో సామాన్యులు, పేదలు తమ పిల్లలను చదివించుకోలేక నానా అవస్థలూ పడుతున్నారు. 
నియంత్రణ కరువు
నిన్నటి వరకూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులపై ఎలాంటి నియంత్రణా లేదు. యూనిఫారం నుంచి పుస్తకాలతో దాకా తాము ఇచ్చినవే, చెప్పిన ధరకే కొనాలని షరతులు పెడుతున్నాయి ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు. విధిలేని పరిస్థితుల్లో విధ్యార్థుల తల్లితండ్రులు వారు అడిగినంత చెల్లిస్తున్నారు. 100 పేజీల నోట్ బుక్ బయట సుమారు రూ.45 ఉంటే చైతన్య వంటి స్కూళ్లలో రూ.100 ఉంటోంది. ప్రాధమిక తరగతుల విద్యార్థులు ఫీజు, పుస్తకాలు, ఇతర యాక్టివిటీ ఖర్చులు కలిపి ఏడాదికి రూ.100000 పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక కార్పొరేట్ స్కూళ్లు అయితే ఈ మొత్తం మూడింతలు ఉంటోందని అంచనా. ప్రైవటు స్కూళ్లను తనిఖీలు జరిపి, నియబంధనలకు లోబడి ఉన్నాయో లేదో గుర్తించే వ్యవస్థే ఏపీలో అందుబాటులో లేదు. నియంత్రణే లేకపోవడంతో ప్రైవేటు సంస్థల ఇష్టారాజ్యంగా మారిపోయింది ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థ. 
ఇకపై ఇష్టారాజ్యంగా దొంగల దోపిడీగా సాగుతున్న ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలకు కళ్లెం వేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఎడ్యుకేషన్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఫీజులతో విద్యార్థుల తల్లితండ్రులను పీల్చి పిప్పిచేస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ కాబోతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతోనే విద్యాసంస్థలు నడపాలి. కాదని అధిక ఫీజులు వసూలు చేస్తే ఆయా సంస్థలకు తాళాలు పడతాయి. ఇప్పిటికే నోబ్యాగ్ డే ద్వారా విద్యార్థుల భుజాలపై భారాన్ని కొంత మేర తగ్గించిన యువ ముఖ్యమంత్రి త్వరలో నిర్ణయాత్మకంగా ఫీజుల నియంత్రణను అమలు పరచనున్నారు. మూతపడ్డ ప్రభుత్వ పాఠశాలలను తెరవడమే కాదు, ప్రతి బడిలోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ ను  సౌకర్యాలు, పూర్తి స్థాయి టీచర్లతో అభివృద్ధి పరుస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా వాటిని తయారు చేయడం ద్వారా ప్రైవేటు భాగస్వామ్యాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నారు. అధికారులతో చర్చలు, వేగంగా నిర్ణయాలు, త్వరితంగా అమలు ఇదీ నేటి యువ ముఖ్యమంత్రి పనితీరు. మరి కొద్ది రోజుల్లోనే స్కూళ్లు తెరవనున్న నేపధ్యంలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ చర్యలు వేగవంతం అయ్యాయి. నేడు రాష్ట్ర ప్రజానీకానికి ఇది నిజమైన శుభవార్త. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top