ఏం మాట్లాడుతున్నారు? ఏం చెబుతున్నారు?

 

2019 ఎన్నికల ప్రచారసభల్లో చంద్రబాబుగారు ఏం మాట్లాడుతున్నారు? ఏం చెబుతున్నారు?

ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా చేసి, చేసింది చెప్పుకోక, జగనూ మోడీ, జగనూ కెసీఆర్‌ అంటూ ఏదేదో వాగేస్తున్నాడు. తాను ఐదేళ్లపాటు ప్రజలకు వెలగబెట్టింది ఏమీ లేదనుకోవాలా? ప్రజల్లో లేనిపోని భయాలు పుట్టించి, తను గట్టెక్కేయాలన్న తాపత్రయం కొద్దీ ఈ వాగుడా? ఏమను కోవాలి బాబూ ...? నిన్నేమనుకోవాలి బాబూ? నిన్నెలా అర్థం చేసుకోవాలి? అని సీరియస్‌గా తలలు కొట్టుకున్నారు అటు ప్రజలు. ఇటు రాజకీయాలను తిని,తాగి, పడుకునే బాపతు జనం.

ప్రతి ప్రచారసభలోనూ చంద్రబాబు పాడిందే పాడరా...అన్న తరహాలో చెప్పిందే చెబుతున్నాడు. ఢిల్లీలో మోడీని, పక్క రాష్ట్రంలో కేసీఆర్‌ను కలనైనా మరవకుండా పలవరిస్తున్నారు. ఆ ఇద్దరితో జగన్‌ దోస్తీ అంటూ ...ముందుకు పోతున్నాడు. నిజంగా చంద్రబాబుగారు ప్రచారం చేస్తున్నదాంట్లో నిజమెంత? కాస్త బుర్రపెట్టి ఆలోచించేవారికెవరికైనా చంద్రబాబు చిమ్ముతున్న విషం అర్థమైపోతుంది. 

ఫస్ట్‌వన్‌. ఢిల్లీలో మోడీకి భయపడుతుంది తనైతే... జగన్‌ భయపడుతున్నాడు అంటాడు.  కేసులు ఎక్కడ పెడతారో...తవ్వుతారో అని జగన్‌ మోడీ చెప్పినదానికల్లా తల వూపుతున్నాడట! ఎక్కడ బాబు...ఎక్కడ అని ఎవరైనా అడిగితే...లోటస్‌పాండ్లోనే. ఫోన్లోనే అని చెప్పేస్తున్నాడు. జగన్‌ తను రాజకీయాల్లోకి వచ్చింది మొదలు భయమన్నది తెలియకుండానే ముందుకు పోతున్నాడు. ఆయన ధిక్కరించింది అప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్‌ మీదనే. అవునుమరి, తన ఓదార్పు యాత్రను వద్దన్నారు. మాట ఇచ్చాను. మాట తప్పలేను అని కాంగ్రెస్‌తోనే ఢీకొట్టాడు. తను నమ్మిన సిద్దాంతమది. మడమ తిప్పలేదు. అలాంటి వ్యక్తి, అన్ని కష్టాలు పడ్డా రాజీపడని వ్యక్తి...ఇప్పుడు భయపడుతున్నాడని బాబు చెబుతుంటే...జనం నమ్మాలా? ఎలా నమ్మించాలని చూస్తున్నారో...బాబుగారికే తెలియాలి.

సెకండ్‌వన్‌. జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు ఓటేసినట్టేనట. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టు ఒకటేమిటి...జలవనరులన్నీ కేసీఆర్‌ తెలంగాణాకు తరలించుకుపోతాడట (బాబుగారి తనయుడు లోకేష్‌బాబు... మచిలీపట్నం పోర్టు కూడా ఎత్తుకెళ్లిపోతాడని చెప్పాడుగా మరి!).

పాపం జగన్‌ చేతులు కట్టుకుని..అన్నీ పట్టుకెళ్లు సామీ...అని చెబుతాడట. వాహ్‌ బాబు...నీకు మాత్రమే తెలిసిన మాటలివి. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇవాళ ఒక ధైర్యం, ఒక ఆశాజ్యోతిలా జగన్‌ కనిపిస్తుంటే...బాబుకు పచ్చకామెర్లు వచ్చినట్టుగా అంతా రివర్స్‌లో కనిపిస్తున్నట్టుంది. తన రాష్ట్రప్రయోజనాలను పణంగా పెట్టేంత స్థాయికి జగన్‌ దిగజారతాడని చెప్పడం..చంద్రబాబుగారి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. అప్పుడు, ఇప్పుడు తను రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు అన్న విషయంలో జగన్‌కు స్పష్టమైన లక్ష్యం వుంది. స్వంత ప్రయోజనాలకోసం వెంపర్లాడే తత్వం కాదు. రాష్ట్రప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి, బాబులాగా పబ్బం గడుపుకునే వ్యవహారం కాదతనిది. 

ఇకపోతే. థర్డ్‌వన్ః

ఓవైపు జగన్‌ వస్తే, మోడీ, కేసీఆర్‌లు వచ్చేసినట్టే అంటున్నాడు బాబు. ఎక్కడికో మరి!! ఆయన ఢిల్లీ, ఈయన హైదరాబాద్‌ వదిలేసి అమరావతికి వచ్చి తిష్టవేస్తారా...ఏంటో...అంతా బాబుగారి తిక్క. ఆ తిక్కమాటల్ని వదిలేస్తే..ఇక బాబు ప్రచారంలో, వికృతపార్శ్వం మరొకటి వుంది. గతంలో వైయస్సార్‌ను ఫ్యాక్షనిస్టు అని ప్రచారం చేసీచేసీ బోల్తాపడ్డాడు బాబు. 2004–2009లో వైఎస్‌ పాలనను చూసిన ప్రజలకు బాబుగారి దుర్మార్గం పూర్తిగా అర్థమయిపోయింది. ఆ పాలనా కాలంలో సంక్షేమం విషయంలోగానీ, అభివృద్ది విషయంలో గానీ...శాంతిభద్రతల విషయంలోగానీ, దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఏపీనే ఆదర్శమైంది. ది బెస్ట్‌ స్టేట్‌గా నిలిచింది. అయినా, చంద్రబాబుకు బుద్ది వచ్చినట్టులేదు. మళ్లీ అదే రెండునాల్కల మాటలు మాట్లాడుతున్నాడు. జగన్‌ సీఎం అయితే, రాష్ట్రం రౌడీ రాజ్యం అవుతుందట.  మీ పిల్లల్ని ఎత్తుకుపోతారు...అనే స్థాయికి కూడా దిగజారిపోయి మాట్లాడుతున్నాడు బాబు. దాదాపు ఏడాదిన్నరగా ప్రజల మధ్యనే నడుచుకుంటూ సాగిన జగన్‌... ఎలాంటి వాడో ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయింది. ఇక బాబుగారు...అసత్యప్రచారాలను నమ్మేదెవరు? 

ఇంకా ఇంకా ...ఎన్నెన్ని తప్పుడు ప్రచారాలు చేస్తాడో చంద్రబాబు.  వారం రోజుల్లో ఎన్నికలు... ఇంకెంత విషం చిమ్ముతాడో? ఇంకెన్ని కుట్రలు చేస్తాడో? అవేవీ చేయకుండా మాత్రం బాబు వుండడన్నది రాష్ట్రప్రజలందరు అనుకుంటున్నమాట. . 

అందుకేనేమో...ఏపీలో ఏ ఇద్దరు కలిసినా, ఆఖరురోజుల్లో బాబు ఏం చేస్తాడోనన్న దానిమీదనే మాట్లాడుకుంటున్నారు.  ఇక తను చస్తాడనుకున్నప్పుడు...సినిమాల్లో విలన్‌ హీరో చేతులు పట్టేసుకుంటాడుగా. ఆ తర్వాత హీరోగారు వదిలేశాక... వెనుక నుంచి దాడి చేస్తాడుగా. అలాంటి..సినిమా విలనే నయమనిపించేలా, ఎన్నికల ఆఖరు గడియల్లోనైనా  చంద్రబాబు రాజకీయ కుట్రలు, కుతంత్రాలకు తెరలేపుతాడు.  

ఇది ప్రజల మనసులో మాట. అంత నమ్మకం సాధించుకున్నాడు మరి చంద్రబాబు. ఇంటిపేరు నారా.............

పి.యస్ః

గతంలో ఎప్పుడూ చూడని రీతిలో నిన్నటి ఓ ప్రచారసభలో చంద్రబాబు ప్రజలకు వంగివంగి దండాలు పెట్టాడు. శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అన్నాడు. తనకు రక్షణగా వుండాలన్నాడు. ఓరి బాబో!! అందితే జుట్టు...అందకపోతే కాళ్లు పట్టుకునే రాజకీయం చంద్రబాబుది. ఈ విషయం చంద్రబాబు వెన్నుపోటుకు బలైన  ఎన్టీయార్‌ గారు ఎప్పుడో చెప్పారుగా!

 

Back to Top