బొక్కబోర్లా పడ్డ ఎల్లో మీడియా

ఎల్లో మీడియా అత్యుత్సాహం

ఎరక్కపోయి మొదలెట్టి ఇరుక్కుపోయారు

బాబు నేర్పిన విద్యేనా ఇది

జగన్ తమ కులానికే ప్రాధాన్యత ఇస్తాడంటూ తొలుత విష ప్రచారం చేసింది టీడీపీ. కానీ పదవుల పంపకాల్లో, అధికారుల నియామకాల్లో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం లభించడంతో ఆ గోల్ సెల్ఫ్ గోల్ అయ్యింది. బీసీలకు అన్యాయం అంటూ అరవబోయారు. బీసీ డిక్లరేషన్ తోపాటు 50శాతం నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులు రిజర్వేషన్ ప్రకారం అందించడంతో నోరు టీడీపీ నేతలకు గొంతులో పచ్చివెలక్కాయి పడింది. రాయలసీమ రౌడీలు, పులివెందుల పంచాయితీలు అంటూ ఆ ప్రాంతాన్ని కించపరుస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని పచ్చ పార్టీ పథకాలు వేసి ప్రచారం చేసింది. కానీ ఎలాంటి అవాంచనీయఘటనలూ జరగకపోవడంతో కొత్త ఎత్తులు వేసింది. ఇందంతా చంద్రబాబు చేసే కుట్రల్లో భాగమే.
అలజడులు సృష్టించాలనే కుట్ర
ఎల్లో మీడియా విషప్రచారం ఎంతదూరం వెళ్లిందంటే అబద్ధాలు, ఫేక్ న్యూస్ లతో మత విద్వేషాలు రెచ్చగొట్టేంతగా తయారయ్యింది. టీడీపీ దాని ఆస్థాన మీడియా కలిసి తిరుమల వెంకన్ననూ వదలకుండా విచ్చలవిడి పోస్టులతో ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. టీటీడీలో క్రైస్తవులను నియమిస్తున్నారంటూ బాకా మీడియాతో ఫేక్ న్యూసులు మొదలెట్టింది. క్రైస్తవ మతానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రచారం చేయించింది. ప్రభుత్వ పథకాలకు మతానికి ముడిపెట్టాలని చూసింది. మత వాదాలను రెచ్చగొడుతూ డిబేట్లు చేయించింది. టీటీడీ ఛైర్మన్ గా నియమించిన వైవీ సుబ్బారెడ్డి క్రైస్తవుడని, డీఈఓగా ముఖ్యమంత్రి బంధువు క్రిస్టోఫర్ ను నియమిస్తున్నారని తప్పుడు కథనాలు ప్రసారం చేసింది తెలుగుదేశం అనుకూల మీడియా. సోషల్ మీడియా వేదికగా అవన్నీ ఫేక్ అని బయటపడింది. దాంతో ఖంగుతిన్న ఎల్లో మీడియా తోక ముడిచి వెంటనే క్షమాపణలు చెప్పింది. చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేయబోయి ఇలా బొక్కబోర్లా పడుతోంది ఎల్లో మీడియా.    

ప్రభుత్వంపై బురదచల్లేందుకే
ఈ తరహా అబద్ధ ప్రచారాల వల్ల కులాల మధ్య గొడవలు, మత సంఘర్షణలు తలెత్తితే ఇది ప్రభుత్వ వైఫల్యంగానూ, జగన్ అసమర్థతగానూ ప్రచారం చేయాలనుకుంది తెలుగుదేశం. అందుకే రాయలసీమ వాసులను రెచ్చగొట్టేలా చంద్రబాబు, ఆ పార్టీ నేతలు రకరకాలుగా వాఖ్యలు చేసారు. దీనివల్ల గొడవలు జరిగితే మేం ముందే చెప్పాం ఇది ఫాక్షనిజం, రౌడీ ఇజం అని ముద్రవేసేయాలని అనుకున్నారు. కానీ చంద్రబాబు ఆశించనవేమీ జరగలేదు. వారి ఫేక్ ప్రచారాలను అటు వైఎస్ జగన్ ప్రభుత్వమే కాదు ఇటు సోషల్ మీడియా కూడా సమర్థవంతంగా తిప్పి కొట్టింది. దాంతో తెలుగుదేశం నీచ రాజకీయాలపై వెన్నువిరిగే దెబ్బపడ్డట్టైంది. ప్రజలు ఒకప్పటిలా చంద్రబాబు చెప్పిన ప్రతిదీ నమ్మరని, టీడీపీ ఆడే నాటకాలకు మోసపోరని రుజువౌతోంది. ఇది ప్రజల్లో కలిగిన చైతన్యానికి నిదర్శనం. దీనికి కారణం ఖచ్చితంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డే. బాబు నిజస్వరూపాన్ని ప్రజలముందుంచి, టీడీపీ దుర్గార్గాలను కళ్లకు కట్టేలా చేసారు. ప్రభుత్వ అవినీతిని, బాబు అసమర్థతను బట్టబయలు చేసారు. ప్రజలే విజ్ఞతతో నిర్ణయం తీసుకునేలా వారిని ఉత్తేజపరిచారు. అందుకే నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు బాబు పప్పులు ఉడకడం లేదు. 
 

Back to Top