బాబుఇజం మైనస్ జర్నలిజం = ఎల్లోయిజం

ఎండ మండుతోంది గానీ వేడిమాత్రం లేదయ్యా అంటే ఎలా ఉంటుంది?
మంచుకురుస్తోంది గానీ చలికాలం రాలేదని చెబితే మీరేమంటారు?
ఏమిటీ ఈ అడ్డగోలు మాటలు అంటారా!! అంతే అంతే. అక్షరాలా అంతే.కానీ ఆంధ్రజ్యోతి ఆర్కే నాయుడు మాత్రం అలా అడ్డదిడ్డంగానే అంటాడు.పొరుగు రాష్ట్రం తెలంగాణాలో కంటే ఏపీలో కేసులు తక్కువగా ఉన్నా సరే...కరోనా నిర్థారణా పరీక్షల్లో ఏపీ టాప్ -5లో ఉన్నాసరే..రోజుకు 90 టెస్టుల నుంచి 3000 టెస్టులు చేసే సామర్థ్యం పెంచుకున్నా సరే...భారతదేశం మొత్తంలో జరుగుతున్న వైరస్ పరీక్షల సగటు 198 కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో 331 పరీక్షలు జరుగుతున్నా సరే..'పరీక్ష'లో ఫెయిల్ అనే అడ్డగోలు హెడ్డింగుతో తన ఎల్లోయిజాన్ని పేపర్లో ప్రింటు చేస్తూనే ఉంటాడు.వాస్తవాలు కాకుండా ఇలా అవాకులూ, చెవాకులూ రాయడాన్ని జర్నలిజం అంటారా అంటే ముమ్మాటికీ కాదు.
బాబుఇజాన్ని ప్రచారం చేసుకుంటూ జర్నలిజం నుంచి ఎప్పుడో మైనస్ అయిపోయిన ఈ బోటివారు చేసేదాన్ని ఎల్లోయిజం అనక మరేమంటాం?? 70 మిలియన్ జనాభా ఉన్న రాజస్థాన్ మిలియన్‌ కు 549 టెస్టులు చేస్తూ అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ముందువరసలో ఉంది. ఆ తర్వాత కేరళ, మహారాష్ట్రా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏపీ 50 మిలియన్ జనాభా కాగా ఒక మిలియన్ కు 331 టెస్టులతో నాలుగో స్థానంలో నిలిచింది.
ఇక కోవిడ్ నియంత్రణా చర్యల్లో ఏపీ అనుసరిస్తున్న మార్గాలు అనుసరణీయం అని కేంద్ర పంచాయితీరాజ్‌ శాఖ చేసిన ఒక ప్రకటనలో చెప్పింది. జిల్లా, గ్రామీణ స్థాయిలో చేస్తున్న పారిశుద్ధ్య పనులు, క్వారంటైన్ కేంద్రాల నిర్వహణ, వలసకూలీలు, పేదలకు రక్షణ శిబిరాలు, అందిస్తున్న ఆర్థిక సాయం, ఉచిత రేషన్, భౌతిక దూరం, లాక్‌డౌన్ పాటించడం పై గట్టి పర్యవేక్షణ, అవగాహనా కార్యక్రమాలు వంటివన్నీ ఉత్తమంగా ఉన్నాయని కితాబిచ్చింది. కానీ ఇవేమీ ఈ ఎల్లోయిస్టుకు కనిపించవు.
చంద్రబాబు ఆశయాలకోసం పనిచేస్తూ, జర్నలిజాన్ని మినాహాయించేసుకుని అవాస్తవాలతో అక్షరాలను అమ్మేసుకునే ఆంధ్రజ్యోతి...సారీ బాబుజ్యోతిని పత్రిక అనాలా లేక అబద్ధాలకు పుట్టిన విషపుత్రిక అనాలో తెలుగు ప్రజలే నిర్థారించుకుంటారు. 

Back to Top