అమరావతి: తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం కోమరగిరిపట్నంలో ఒక గంటలోనే లబ్ధిదారులకు రేషన్ కార్డు మంజూరు చేసిన సచివాలయ అధికారులు..అలాగే తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి పంచాయతీ సచివాలయం–2 పరిధిలో నివాసం ఉంటున్న కుడిపూడి ఆంజనేయులు, వరలక్ష్మి దంపతులకు ఒక్క రోజులోనే రేషన్ కార్డును మంజూరు చేశారు. గతంలో ఎన్నోసార్లు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. దీంతో గ్రామ వాలంటీర్‌ను సెప్టెంబర్ 17, 2020న కలవగా.. గ్రామ సచివాలయానికి తీసుకెళ్లి వివరాలు నమోదు చేయించాడు. దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా తహసీల్దార్ సమర్పించగా.. ఆయన వెంటనే లబ్ధిదారుని అర్హతల్ని గుర్తించి రేషన్ కార్డు మంజూరు చేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన పిల్లి లక్ష్మి అనే ఒంటరి మహిళకు కూడా ఒక్క రోజులోనే రేషన్ కార్డు మంజూరు చేశారు. ఇదే కదా గ్రామ స్వరాజ్యమంటే.. గ్రామ స్వరాజ్యం.. మహాత్మా గాంధీజీ కల.. అనే మాటలు 70 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. ఆ మాటలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలన ప్రజల గుమ్మం ముందుకే వచ్చింది. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడి నేటితో సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. ‘కులం చూడం, మతం చూడం.. పార్టీలు చూడం.. రాజకీయాలు చేయం.. ‘ ఎన్నికలకు ముందు జగనన్న చెప్పిన మాటలు. సంవత్సరం క్రితం సరిగ్గా ఇదే రోజున అక్టోబర్ 2న మహాత్ముడి పుట్టిన రోజున ఆయన ఆశీస్సులతో గ్రామ స్వరాజ్యానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. కొందరు ఎంపీటీసీలుగా, సర్పంచ్‌లుగా పనిచేసిన వారుసైతం పరీక్షలు రాసి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో చేరారు. వారంతా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల్లో నియమితులయ్యారు. దేశానికి, రాష్ట్రానికి యువత విలువ తెలిసిన ఓ యువ ముఖ్యమంత్రి ఇచ్చిన చిన్న బహుమానం ఈ గ్రామ సచివాలయాలు. సరిగ్గా ఏడాది క్రితం.. ప్రభుత్వ సేవలు మరింత సులభమైన పద్దతిలో ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థను అక్టోబర్ 2, 2019న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ పరిధిలోని కరప గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థను సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. సీఎం వైయస్ జగన్ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేరువైంది. దేశంలో అనేక రాజకీయ పార్టీలు వందలాది మంది గొప్ప నాయకులు ఉన్న ఈ దేశంలో ఏ నాయకుడు తీసుకొని నిర్ణయాన్ని..గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని వైయస్ జగన్ తీసుకువచ్చారు. పాదయాత్రలో నాందీ.. వైయస్ జగన్ 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రతి మండలంలో ఆయన పాదయాత్ర కొనసాగింది. ఆయనకు ఎదురైన అనేక సమస్యలు, ప్రజల కష్టాలు, గ్రామ స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. సామాన్యుడు తన కష్టాన్ని ప్రభుత్వానికి చెప్పుకునే సమయం వచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. ఈ రోజు అనేక పంచాయతీలు ఉన్నాయి. సాధారణంగా ఓ వ్యక్తికి, కుటుంబానికి ఇబ్బందులు వస్తే అధికారులకు చెప్పుకుందామంటే ఎవరు అందుబాటులో లేని తరుణంలో ఇలాంటి పరిస్థితులను మార్పు చేసే గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2 వేల జనాభా ఉన్న ప్రతి పంచాయతీని గ్రామ సచివాలయంగా ఏర్పాటు చేయడం అదృష్టం. గ్రామ సచివాలయంలో అన్ని శాఖలు ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే ఇక్కడ పరిష్కారం దొరుకుతుందన్న అవకాశం కల్పించారు. దేశానికే ఆదర్శం.. ఆంధ్రరాష్ట్రంలో ఏర్పాటైన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. యూపీఎస్సీ ట్రైనింగ్ సెంటర్లో ఒక పాఠ్యాంశంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకు ప్రభుత్వ పథకాలను తీసుకెళ్తున్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు 500 సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. గ్రామ సచివాలయాల్లో 14 మంది శాశ్వత ఉద్యోగులను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఏదైనా ఇబ్బంది వస్తే ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అందుబాటులో ఉన్నారు. ప్రతి సచివాలయంలో మహిళల రక్షణకు సీఎం వైయస్ జగన్ ముందే ఆలోచన చేశారు. పూర్వం మండల వ్యవస్థ, తాలుకా వ్యవస్థల్లో జరిగిన పరిస్థితులను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఏదైనా ఇబ్బంది వస్తే సచివాలయంలో 72 గంటల్లో సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. రాష్ట్రంలో 1.34 లక్షల మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ వాలంటీర్లుగా దాదాపు రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇది అని సగర్వంగా చెప్పవచ్చు. నూతన రాష్ట్ర ప్రభుత్వం తన మేనిఫెస్టోలోని నవరత్నాల్లో భాగంగా కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు సులువుగా ప్రభుత్వ సేవలను అందించే ఉద్దేశంతో గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. సంక్షేమ పథకాల్లో అవకతవకలు, అవినీతి, అక్రమాలను నిరోధిస్తూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలన్నదే గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రధాన ధ్యేయం. పరిపాలనలో నూతన ఒరవడి.. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే పేపర్ మేధావిని 40 ఏళ్ల కుర్రాడు తన పనితనంతో ఢీకొడుతున్నాడు. పది నిమిషాల్లో పెన్షన్, రేషన్ కార్డు అర్హులకు అందడం గతంలో ఎప్పుడైనా చూసిన దాఖలాలు ఉన్నాయా..? కానీ పరిపాలనలో నూతన ఒరవడి సృష్టించిన గ్రామ, వార్డు సచివాలయాలు ఇలాంటి అద్భుతాలను చూపిస్తున్నాయి. ‘ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటా’ అని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే వైయస్ జగన్ చెప్పారు.. నాలుగు నెలల్లోనే 4 నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి.. ఈ సంవత్సర కాలంలో తన ప్రయాణంపై ఐదు కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇచ్చాడు. పాలకుడు.. సేవకుడు అయితే సంక్షేమ పథకాలు గుమ్మం ముందుకే వస్తాయని చూపించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఏకంగా 500 పైగా సేవలను అందిస్తున్నారు. అర్హత ఉంటే చాలు దరఖాస్తు చేసుకోండి.. వలంటీర్లు వచ్చి మీ గుమ్మం ముందుకే వచ్చి సేవలు అందిస్తారని ఆనాడే చెప్పారు.. చెప్పిన మాట ప్రకారం చేసి చూపిస్తున్నారు మన సీఎం. చంద్రబాబు ఆంధ్రరాష్ట్రాన్ని అంధకారంలో నెట్టినా.. వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లో ముంచిన చంద్రబాబును ఏనాడూ దూషించలేదు. అయిదేళ్లు ఇసుకను బొక్కేసి వాంతులు చేసుకున్న టీడీపీ ఇసుకాసురులను, కరెంటు కాంట్రాక్టుల్లో వేలకు వేల కోట్లు అప్పనంగా దోచుకుని ఆంధ్రరాష్ట్రాన్ని అంధకారంలో నెట్టినా.. బకాయిలన్నింటినీ తీర్చుతూ చిరునవ్వుల వెలుగులు నింపారు. పోలవరం ప్రాజెక్టు చేపట్టాలంటేనే డబ్బులు పుట్టని పరిస్థితి సృష్టించి కలవర పెట్టాలని చూసినా.. ఫలానా సమయానికి పోలవరం పూర్తిచేస్తానని మాటిచ్చి మరీ ప్రాజెక్టు పనులను పరుగులుపెట్టిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కులం, మతం పేరుతో బురదజల్లాలని చూసినా.. ప్రజలకు అందాల్సిన హక్కులకు మోకాలొడ్డుతున్నా.. పేపర్లు, టీవీ ఛానల్స్‌తో పచ్చమీడియా నిత్యం విషం చిమ్ముతున్నా.. చిరునవ్వుతో ముందుకు సాగుతూ అనుకున్న మంచి ప్రజలకు చేరువ చేస్తున్న సంఘటనలే ముఖ్యమంత్రి వైయస్ జగన్ పనితనానికి గీటురాయి.