ఊస‌ర‌వెల్లి నారా‘జకీయం’

చంద్ర‌బాబు తీరును అస్య‌హించుకుంటున్న‌ తెలుగు ప్ర‌జ‌లు

చంద్రబాబా చెప్పిందే వేదమంటూ ప‌చ్చ మీడియా చెక్కభజన  

నిన్ను న‌మ్మం బాబు అంటున్న ఏపీ ప్ర‌జ‌లు

 

అమ‌రావ‌తి:  రాష్ట్రంలో నారా‘జకీయం’ సైర్యవిహారం చేస్తోంది. బాబుగారు చేస్తే సంసారం అంట..పొరుగువారు చేస్తే వ్యభిచారం అంట..ఇది సదా పచ్చబాబు సేవలో తరించే జాతి మీడియా పొలికేకలు, గావుకేకలు..డబుల్‌ యాక్షన్‌ బాబుగా తెలుగురాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఘ‌న‌త‌కెక్కిన అభినవ ఇంద్రుడు లాంటి చంద్రుడు వేస్తున్న జూగుప్సకరమైన  ఊసరవెల్లి వేషాలు తారాస్థాయికి చేరుతున్నాయి.పచ్చ మహాప్రభువుల కనుసన్నల్లో..చంద్రబాబా చెప్పిందే వేదమంటూ చెక్కభజన చేసే పచ్చమీడియా వికృతరూపం దాల్చి మ‌రోసారి ప్రజలను మభ్యపెట్టి తమ బాస్‌ను మళ్లీ  అధికార పీఠంపై కూర్చొపెట్టడానికి సామ, దాన దండోపాయాలను ప్రయోగిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌పై  కేటీఆర్‌తో వైయస్‌ జగన్‌ చర్చిండంపై పచ్చబాబు,పచ్చమీడియా చేసిన నానాయాగీ అంతా ఇంతా కాదు. స్వార్థం కోసం పూట‌కో మాట‌..రోజుకో బాట ప‌డుతున్న చంద్ర‌బాబును నిన్ను న‌మ్మం బాబు అంటూ ఏపీ ప్ర‌జ‌లు ముక్త‌కంఠంతో హెచ్చ‌రిస్తున్నారు. చంద్రబాబు జాతి మీడియా తీరుపై నెటిజన్లు సంధిస్తున్న సూటి ప్రశ్నలకు ప‌చ్చ నేత‌ల వ‌ద్ద బ‌దులుందా?

వీటికి బ‌దులేది బాబూ?
1.కేసీఆర్‌ ఆంధ్రోళ్లను తిట్టాడని ఇప్పుడు కొత్తగా అడుగుతున్న బాబు అండ్‌కో మరి 2009లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు తెలీదా..?(ఈ ఐదేళ్లు తెలంగాణలో ఆంధ్ర ప్రజలను మంచిగా చూసుకున్నారు కాదా..)
2.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం కేసీఆర్‌ను అడిగినా ఒప్పుకోలేదని..దాంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నానని కాంగ్రెస్‌ నాయకుల ముందే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పలేదా..?
3.హరికృష్ణ శవం సాక్షిగా కేటీఆర్‌తో మనం పొత్తు పెట్టుకుందాం.ఆవిధంగా ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చు..ఎక్కువ ఎంపీ సీట్లు మన ఇద్దరికి ఉంటే కేంద్రం మీద గట్టిగా పోరాడవచ్చు అని చెప్పాను..కాని కేటీఆర్‌ ఒప్పుకోలేదు అని చంద్రబాబు మీడియా సాక్షిగా బాబు చెప్పలేదా..?
4.పోలవరాన్ని అడ్డుకోవడానికి కేంద్రానికి లేఖ రాసిన కోదండరాం పార్టీతో పొత్తు ఎలా పెట్టుకున్నావు బాబూ..?
5. అసలు హోదా వద్దు..హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయి.హోదా వలన లాభాలేంటో  నాకు ట్యూషన్‌ చెప్పండి? హోదా అంటే జైల్లో వేస్తా..నేను 40 ఇయర్స్‌..అంతా నాకు తెలుసు..ఈ జగన్‌కు ఏమీ తెలీదు అని అసెంబ్లీలో హేళనగా మాట్లాడలేదా బాబూ..? అసలే హోదానే వద్దన్నా నీవు..కేసీఆర్‌తో పొత్తు కోసం తహతహలాడి ఇప్పుడు కేసీఆర్‌ హోదాకు అడ్డం అంటావా..?(ఇటీవల ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ నేను ప్రత్యేకహోదాకు వ్యతిరేకం కాదు అని తేల్చిచెప్పాడు..అసవసరం అయితే కేంద్రానికి కూడా రాఖ రాస్తా అని చెప్పలేదా..
6.ఓటుకు కోట్ల కేసులో పట్టుబడినప్పుడు నీ తరపున కేసీఆర్‌తో మీ కుల పెద్దలు ఈనాడు రామోజీ, ఆనాటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్‌ణ, ఒక పెద్ద పదవిలో ఉన్న అధికారి చర్చలు జరపలేదా..? ఆ చర్చల్లో మా బంగారుబాబును వదిలేయి..మా కులస్థుల మీడియా మద్దతు ఉంటుందని, మా కులస్థుల ఓట్లు గుంపగుత్తగా టీఆర్‌ఎస్‌గా వేయిస్తామని డీల్‌ కుదుర్చుకోలేదా..?  ఆ తరువాత మీ అనుకుల మీడియా కేసీఆర్‌ భజన చేయలేదా..? మరల మీరు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోగానే ఇదే మీడియా మరల కేసీఆర్‌ను దుమ్మెత్తి పోయలేదా..? టీఆర్‌ఎస్‌తో కలిసి టీడీపీ పోటీ చేస్తే అద్భుతంగా ఉంటుంది.తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి అని మీ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చౌదరి తన కమ్మని పలుకులో రాయలేదా..?అలాగే సర్వేల స్పెషలిస్ట్‌ అయిన లగడపాటి రాజగోపాల్‌ చౌదరి కేటీఆర్‌ను కలిసి మీరు టీడీపీతో పొత్తు పెట్టుకోండి..దాదాపుగా అన్ని సీట్లు గెలుస్తారు అని చెబితే కేటీఆర్‌ ఒప్పుకోలేదు అని మీడియా ముందు చెప్పలేదా..? కేవలం టీడీపీని గెలిపించాలని కులాభిమానంతో ఎన్నికల ముందు వచ్చి మహాకూటమి గెలుస్తోంది..టీఆర్‌ఎస్‌ ఓడిపోతుంది అని ఉత్తుతి సర్వేల్లో లగడపాటి చెప్పలేదా..?
7.అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌లు రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ వచ్చి కేవలం కేంద్రం మీద పోరాడటానికి మా 17 మంది ఎంపీల బలం సరిపోదు కనుక..మీ 25 మంది ఎంపీల బలం కూడా ఉంటే బాగుంటుందని,ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి రండి అంటే శివాతెత్తుతారా..మీ కుల మీడియా అమ్మె ఇంకేమైనా ఉందా రాష్ట్రం నాశనం అయిపోతుందంటూ దుష్ఫ్రప్రచారం చేస్తారా.. అయినా ఏపీలో టీఆర్‌ఎస్‌ పోటీ చేయదు..వైయస్‌ఆర్‌సీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుంది. కానీ కేసీఆర్‌తో ఒకసారి పొత్తుపెట్టుకుని,ఇంకోసారి ట్రై చేసిన నీవు కేసీఆర్‌ను ఎదో అంటరానివాడిగా మీ కుల మీడియాతో డప్పు వేయించడం తగునా..?
8.అమరావతి ప్రారంభోత్సవానికి ఏ ఇతర రాష్ట్రాల సీఎంను పిలవకుండా కేసీఆర్‌ను మాత్రమే ఎందుకు పిలిచావు..? కేసీఆర్‌ ఆంధ్రకు వచ్చినప్పుడల్లా అడుగులకు మడుగుతొత్తెంది ఎవరు..?  36 వంటకాలతోభోజనాలు పెట్టిందెవరు..మూతి తుడిచిందెవరు..సిగరెట్‌ వెలిగించింది ఎవరు..?
9.అజ్ఞాతవాసి సినిమా బెనిఫిట్‌ షో కోసం కేసీఆర్‌ను కలిసిన తర్వాత కేసీఆర్‌ది అద్భుతపాలన అని పవన్‌ చెప్పలేదా..
10.వైయస్‌ లాగా కేసీఆర్‌ను కూడా వరుసగా రెండోసారి ప్రజలు ఎన్నికున్నారు..మరిచిపోకండి..
11.నీకు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవగలవా..?
 

Back to Top