అతివలకు జగనన్నే భరోసా 

మహిళా సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట

మహిళ రక్షణ కోసం దిశ చట్టం

మంత్రి పదవుల్లో అధిక ప్రాధాన్యత

నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు 

సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటి సంబరం   

మద్యపాన నిషేదం దిశగా అడుగులు

రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

తాడేపల్లి:  ప్రతిభ ఉన్నా చంద్రబాబు పాలనలో అవకాశాలు లేక దాదాపు మరుగున పడిన మహిళలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అత్యంత ప్రాధాన్యం దక్కడంతో అన్నింటిలో సగంగా మారారు. దశాబ్దాలుగా పోరాడుతున్నా 33 శాతం  రిజర్వేషన్‌ దక్కించుకోవడమే కష్టంగా మారిన తరుణంలో రాష్ట్రంలో  వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మహిళలకు ఉద్యోగాలు, రాజకీయాలు, రాజకీయంగా సంక్రమించే నామినేటెడ్‌ పోస్టుల్లో సైతం 50 శాతం  వాటా  అందేలా చూస్తోంది. పేరుకు ఉద్యోగాల్లో 33 శాతం  రిజర్వేషన్లు అని చెబుతున్నా.. ఓపెన్‌ కేటగిరీ కలుపుకుంటే  50 శాతం  మహిళలకే దక్కుతున్నాయి. వైయస్‌ జగన్‌ పాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యం.

పెద్ద పీట..
 వైయస్‌ జగన్‌ సర్కార్‌ ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలకు పెద్ద పీట వేయడమే కాక ఆయా వర్గాలలో మహిళలకు సగం పదవులు కట్టబెట్టి సముచిత స్థానం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయం ముఖ్యంగా చదువుకున్న యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేదిగా ఉండడంతో వారు సంతోషిస్తున్నారు. అయిదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క ఉద్యోగం లభించక రోడ్డున పడ్డామని, వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ణయంతో బతుకుపై భరోసా కలిగిందని,రాజకీయంగా ప్రాధాన్యం లభించిందని పలువురు మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.  తన మంత్రివర్గంలో సీఎం వైయస్‌ జగన్‌ మహిళలకు పలు శాఖలు కేటాయించి వారికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పకనే చెప్పారు. డిప్యూటీ సీఎంగా గిరిజన ఎమ్మెల్యే పాముల పుష్పాశ్రీవాణిని కూర్చోబెట్టారు. అత్యంత కీలకమైన హోం శాఖను దళిత వర్గానికి చెందిన మేకతోటి సుచరితకు అప్పగించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ తానేటి వనితకు ఇచ్చి సముచిత స్థానం కల్పించారు. ఎన్నికల్లో చెప్పినట్లుగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు సృష్టించి గ్రామ వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మహిళలకే అధిక ప్రాధాన్యత కల్పించారు. 

ఆడపడుచులకు మాట ఇచ్చి నిలబెట్టుకుంటున్న వైయస్ జగన్  
దశలవారీగా మద్యపాన నిషేధం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  విచ్చలవిడిగా లైసెన్సులు ఇచ్చిన మద్యం దుకాణాలే కాదు, రాష్ట్రంలోని ప్రైవేటు దుకాణాలన్నిటినీ రద్దు చేసారు. మద్యం ఆదాయం ప్రభుత్వానికి అవసరమే కానీ, ప్రజల క్షేమం అంతకంటే ముఖ్యమని సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపేలా చర్యలు తీసుకున్నారు. 4380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా 20% తగ్గించి 3500 దుకాణాలుగా వాటిని కుదించారు. రాష్ట్రంలోని 44000 బెల్టు షాపులు లేకుండా చేసారు. ఫలితం - గత ఏడాదితో పోలిస్తే ఎక్సైజ్ ఆదాయం 678 కోట్లు తగ్గింది. అంటే అంత మేర మద్యం వినియోగం తగ్గిందన్నమాట. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. కనుక దుకాణాల వద్ద బార్లు ఉండే అవకాశం లేదు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మాత్రమే మద్యం విక్రయించడం జరుగుతుంది. దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ఆడపడుచులకు మాట ఇచ్చిన వైయస్ జగన్ ఆ మాటను అక్షరాలా నిలబెట్టుకుంటున్నారు. తన మాటనే కాదు గాంధీజీ చెప్పిన బాటను కూడా అనుసరిస్తున్నారు.

సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ..
సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నారు.  పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నారు. జగనన్న వసతి దీవెన పథకం కింద డిగ్రీ, పాలిటెక్నిక్‌ వంటి చదువులు చదువుతున్న వారికి ఏడాదికి రూ.20 వేలు తల్లి ఖాతాలో జమా చేస్తున్నారు. పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తున్నారు.     

మహిళలే మహరాణులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లా పరిషత్‌లు ఉండగా, అందులో సగానికంటే పైగా అంటే.. ఏడు జెడ్పీ చైర్మన్‌ పదవులను మహిళలకు రిజర్వు చేసింది. దీంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో మహిళలే జడ్పీ చైర్‌పర్సన్లుగా రాబోతున్నారు.  ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల రిజర్వేషన్లలోనూ సగానికి పైగా పదవులు మహిళలకే రిజర్వు అయ్యాయి. 660 మండల పరిషత్‌ అధ్యక్ష (ఎంపీపీ) పదవులు ఉండగా.. అందులో 334 పదవులు, 660 జెడ్పీటీసీ స్థానాల్లో 335 మహిళలకు రిజర్వు అయ్యాయి. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 9,639 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు.
వీటిలో 4,769 ఎంపీటీసీ స్థానాలు కూడా మహిళలకే రిజర్వు అయ్యాయి.   

మహిళా ఆయుధం.. దిశ చట్టం  
దిశ చట్టం మహిళలకు ఒక ఆయుధంలా ఉపయోగపడుతోంది.  రాష్ట్రంలో మహిళల రక్షణకు దిశ చట్టం ఉక్కు వలయంలా పని చేస్తుంది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన చట్టాన్ని  ముఖ్యమంత్రి వైనయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రూపొందించారు. మహి ళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలను నియం త్రించడంతో పాటు వారిపై దాడికి పాల్పడిన వారిని కఠి నంగా శిక్షించేందుకు దిశ చట్టం దోహదపడుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీసు స్టేషన్లను ప్రారంభిస్తున్నారు. పోలీ సులకు ప్రత్యేక అధికారాలు, అధునాతన సాంకేతిక పరికరా లతో కూడిన వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నారు.  దిశ కేసు నమోదైన వారం రోజుల్లోగా దర్యాప్తును పూర్తిచేసి 14 రోజుల్లో దోషులను రిమాండ్‌కు పంపించి, 21 రోజుల్లో వారికి శిక్ష పడేలా చట్టాన్ని రూపొందించారు 

మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు 
గూడులేని నిరుపేదల సొంతింటి కలను 2024 నాటికి నెరవేర్చే దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ ఉగాదికి రాష్ట్రంలో 26 లక్షల మంది పేద మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు. ఈ పట్టాలు మహిళల పేరుతో సీఎం వైయస్‌ జగన్‌ రిజిష్ట్రేషన్‌  చేసి ఇవ్వబోతున్నారు. ఐదేళ్ల తరువాత ఈ పట్టాను బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందే అవకాశం కూడా కల్పించారు. యాలని ఆదేశించారు. నాలుగేళ్లలో 30 లక్షల గృహాలు నిర్మించి పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టింది.  అధికారంలోకి రాగానే మాట తప్పని, మడమ తిప్పని వైయస్‌ జగన్ తన మాట నెరవేర్చుకుంటు న్నారు. దీంతో రాష్ట్రంలోని మహిళలు సంతోషంగా, ఆనందంగా ఉన్నారు.  వైయస్‌ జగన్‌ పాలనలో నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మహిళలు  నిండైన ఆత్మగౌరవంతో తలెత్తుకుని సగౌరవంగా బతుకుతారనడంలో సందేహం లేదు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top