నేత‌న్న‌..నేనున్నా..!

చేనేత కార్మికుల‌కు అండ‌గా నిలిచిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ప్ర‌తి ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం

రేపు రెండో విడ‌త ‘వైయ‌స్సార్‌ నేతన్న నేస్తం’ ప్రారంభం

హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న చేనేత కార్మికులు

  తాడేప‌ల్లి: దశాబ్ధాల పాటు ఆడిన మగ్గం చంద్ర‌బాబు పాల‌న‌లో మూలన పడింది. రంగురంగుల హరివిల్లు లాంటి అందమైన పట్టుచీరను తయారు చేసే నేతన్న కష్టాల కడలిలో ఉండేవాడు.  అత్యధిక మంది జీవనం సాగిస్తున్న చేనేతపై గత పాలకుల చిన్నచూపుతో సంక్షోభంలో కూరుకుపోయింది.  మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికత నేర్పిన చేనేత కష్టాలు కన్నీళ్ల కలబోత అయింది. మగ్గం యజమానులు రైతులు, రైతు కూలీలా మాదిరిగానే పొరుగు రాష్ట్రాలకు వలస పోయేవారు. ముడిసరుకు ధర పెరగడంతో మగ్గం నేతన్నల లాభాలు తేలేక నష్టాలతో కళ్లు తేలేసేవారు.  వీరి కష్టాలను జననేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కళ్లారా చూశారు. నేను విన్నాను..నేను ఉన్నానని పాదయాత్రలో చేనేతలకు మాటిచ్చారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మాటను నిలబెట్టుకుంటున్నారు. 'వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తంతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ పథకం ద్వారా చేనేతల కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఇచ్చే కార్యక్రమంతో వారి జీవితాల్లో వెలుగులు నింపారు. చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న నేత కుటుంబాలకు వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ఆసరాగా నిలుస్తోంది.  దశాబ్దాలుగా చేనేతలు అనుభవిస్తున్న కష్టాలను పాదయాత్రలో వైయస్‌ జగన్‌ గమనించి, ఆనాడే చేనేతలకు భరోసా ఇచ్చారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాటను వైయస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజైన డిసెంబరు 21, 2019న‌ వైయస్‌ఆర్‌ నేతన్న హస్తం పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలోనే మ‌ళ్లీ రెండో విడ‌త సాయం చేసేందుకు స‌ర్వం సిద్ధం చేశారు.
 
అర్హులంద‌రికీ ఆర్థిక‌సాయం
అర్హులైన ప్రతి ఒక్కరికీ వైయ‌స్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.  ఈ మేరకు లబ్ధిదారులకు సంబంధించి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం 2020–21 సంవత్సరానికి సర్వే చేయించింది. సర్వే జాబితాలను జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి ఖరారు చేశారు.  గత సంవత్సరం అర్హులైన నేతన్న నేస్తం లబ్ధిదారులు వివిధ కారణాలతో ఆర్థిక సాయం అందుకోని వారు కొందరున్నారని, వారికి ఈ సంవత్సరం అందజేస్తారు.  ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీ జరిగి నేరుగా నేతన్నల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. వైయ‌స్ఆర్ నేత‌న్న నేస్తం అమ‌లు చేయ‌డం ప‌ట్ల చేనేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top