ఇడుపులపాయ: ప్రతి తెలుగువాడి గుండెచప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి... పల్లె తలుపు తట్టినా.. పేదవాడి ముంగిటకెళ్లినా.. వైయస్సార్ మార్కు జ్ఞాపకాలు గిర్రున తిరుగుతాయి. జలసిరుల జలయజ్ఞంలో,బడుగు జీవులకు ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీలో, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లయిన నిరుపేదల ఫీజురీయిబర్స్‌మెంట్ అనుభవాల్లో పెద్దాయనే కనిపిస్తారు. ఏ ఊరికెళ్లినా రాజన్న మాటలే.ఏ వాడకెళ్లినా మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తీపిగుర్తులే. అందరూ బాగుండాలి. అన్ని ప్రాంతాలూ బాగుండాలి. అందరికీ నీరు, నిధులు, పరిపాలన దక్కితేనే న్యాయం అని నమ్మిన వ్యక్తి. ప్రజా సంక్షేమమే శ్వాసగా, అభివృద్ధే ధ్యాసగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం వైయస్ రాజశేఖరరెడ్డి జననం వైయస్ పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. ఆయన 1949 జూలై 8న జయమ్మ, రాజారెడ్డి దంపతులకు కడప జిల్లా జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చదివారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్యకళాశాల నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాక ముందు వైఎస్ 1973లో తన తండ్రి పేరిట 70 పడకల చారిటబుల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు 2004-09 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేశారు. 2003లో మండువేసవిలో దాదాపు 1467 కి.మీ. దూరం పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన అనేక రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్, 18 అంబులెన్స్ సేవలు లాంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలకు వైఎస్ శ్రీకారం చుట్టారు. ఓటమి ఎరుగని నేత వైయస్ 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా నాలుగుసార్లు, ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక వైయస్ 1983లో తొలిసారి పీసీసీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. తర్వాత 1998లో మళ్లీ పీసీసీ అధ్యక్షుడయ్యారు. ప్రతిపక్ష నేతగా ఎన్నిక వైయస్ రాజశేఖర రెడ్డి 1999 నుంచి 2004 వరకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. పాదయాత్రతో ప్రజా సమస్యలపై అవగాహన ఎన్నికల ముందు 2003లో మండు వేసవిలో వైయస్ 1467 కి.మీ. పాదయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ఈ పాదయాత్ర మొదలైంది. వైయస్ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. సీఎంగా తొలి సంతకం రైతన్నకోసం.. వైయస్ పాదయాత్ర కారణంగా 2004 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మే 14న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రైతుల సమస్యలు చూసి చలించిపోయిన ఆయన.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై సీఎంగా తొలి సంతకం చేశారు. సంక్షేమ పథకాలతో మళ్లీ సీఎంగా.. వైయస్ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దీంతో 2009లో మరోసారి ఆయన సీఎంగా ఎన్నికయ్యారు. ఆకస్మిక మరణం: వైఎస్ సీఎంగా ఎన్నికైన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమం కోసం బయల్దేరిన ఆయన ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన మరణం రాష్ట్ర ప్రజలను కలచివేసింది. సంక్షేమ పథకాలతో గుర్తింపు.. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్, 108 అంబులెన్స్ సేవలు లాంటి అనేక సంక్షేమ పథకాలను వైఎస్ ప్రవేశపెట్టారు. రైతు రుణమాఫీలో, ఇందిరమ్మ ఇళ్లు అందడంలో, ఫించన్ల మొత్తాన్ని పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలే ప్రజల గుండెల్లో ఆయన్ను చిరస్మరణీయుణ్ని చేశాయి. తండ్రిని మించిన తనయుడు... మహానేత మరణంతో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు కుంటు పడ్డాయి. ఆయన మరణంతో తెలుగు ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పదేళ్ల పాటు పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఇలాంటి సమయంలో మహానేత ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అచ్చం తండ్రిలాగే మాట తప్పకుండా..మడమ తిప్పకుండా పాలన సాగిస్తున్నారు. ఏడాదిలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు సంపాదించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు.