తెగిడిన నోళ్లే పొగుడుతున్నాయ్

 వైయస్‌ జగన్‌ పాలనకు వంద మార్కులు వేసిన జేసీ దివాకర్‌రెడ్డి

వరాలిచ్చే దేవుడు వైయస్ జగన్ అన్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌

వైయస్ జగన్ పాలనకు 100 మార్కులు అంటున్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఒకప్పుడు ఇదే జేసీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైయస్ జగన్ పై లెక్కలేనన్ని ఆరోపణలు చేసారు. అనుభవం లేదని విమర్శించారు. కానీ తన వంద రోజుల పాలనతో తానేంటో నిరూపించుకుని చూపించారు యువ ముఖ్యమంత్రి. నవ్విన నాప చేను పండిదన్న సామెతగా విమర్శించిన వాళ్లతోనే జయహో జగన్ అనిపించుకుంటున్నారు సీఎం. 
సంక్షే మ పథకాలు, అవినీతిని అరికట్టడం, ప్రభుత్వ పాలసీలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, క్రమబద్ధమైన పాలన ఇలా ప్రతి అంశంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఎన్ని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నా, ప్రజా సమస్యలు, పాలన తప్ప మరో విషయం వైపు వైయస్ జగన్ చూపు సారించనేలేదు. ఇదీ నిబద్ధత అంటే. ఈ నిబద్ధతే తెగిడిన నోళ్లతో పొగిడిస్తోంది. అందరూ మెచ్చేలా పరిపాలన చేసి చూపుతానంటూ ఆత్మవిశ్వాసంతో ఆయన చెప్పిన మాటను నిజం చేసి చూపించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. 
జేసీ మాత్రమే కాదు వైయస్ జగన్ నిర్ణయాలను చూసి తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఫిదా అయిపోయారు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. అడకుండానే వరాలిచ్చే దేవుడు వైయస్ జగన్ అంటూ అసెంబ్లీ సాక్షిగా తన ఉద్దేశ్యాన్ని వెలిబుచ్చారు రాపాక. మత్స్యకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తొలి బడ్జెట్ లోనే 10లక్షలు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసారు. ప్రజలంతా జగన్ ను ఇంతలా ఎందుకు అభిమానిస్తారో ఇప్పుడే అర్థమైందన్నారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన శాసన సభ్యుడు కూడా అభినందించి, మద్దతిచ్చేలా ఉన్న వైయస్ జగన్ పాలనా తీరు విమర్శకుల ప్రశంశలు అందుకుంది. 
పథకాల అమలులో కులం, మతం, పార్టీ చూడం అని వైయస్ జగన్ చెప్పినట్టుగానే పాలన సాగుతోంది. ఉద్యోగాల కల్పనలో విప్లవం, చిరుద్యోగులకు జీతాల పెంపు, పింఛన్లతో చేయూత, సమస్యల పరిష్కారానికి అవినీతి రహిత వేదిక వంటి వినూత్న విధానాలతో వైయస్ జగన్ ప్రతిపక్ష పార్టీ అనుయాయుల నుంచి కూడా మెప్పు పొందుతున్నారు. 
జగన్ మోహన్ రెడ్డిపై పెట్టిన కేసు అక్రమమే అంటూ నాడు విచారణ చేసి, నేడు జనసేనలో చేరిన ఈడీ అధికారి జేడీ స్వయంగా తన నోటితో ఒప్పుకున్నారు. స్వయంగా చంద్రబాబే కాంగ్రెస్ ను ఎదిరించినందుకు సోనియానే వైయస్ జగన్ పై కుట్రలు చేసిందని బైటపెట్టారు. సీనియర్ అధికారులు సైతం జగన్ వ్యక్తిత్వాన్ని చూసి ముగ్ధులౌతున్నారు. ప్రజా తీర్పులోని బలం, ప్రజా నాయకుడి సంకల్పం కలిస్తే వైయస్ జగన్ మోహనరెడ్డి ప్రభుత్వంలా ఉంటుందనిపిస్తోంది. 100 రోజులకు 100 మార్కులు తెచ్చుకుంటున్న ఈ నాయకత్వం రానున్న రోజుల్లో ఆదర్శవంతమైన పాలనతో సంక్షేమానికి చిరునామాగా మారుతుందనడంలో అనుమానం లేదు. 

Back to Top