రాక్ స్టార్ లా వైఎస్ జగన్

అన్నొస్తున్నాడని చెప్పండీ అంటూ వైయస్ జగన్ పిలుపు

లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహం

కడపలో వైఎస్ జగన్ చేసిన సమర శంఖారావం రాష్ట్రం నలుదిక్కులా ప్రతిధ్వనిస్తోంది. అన్నొస్తున్నాడని చెప్పండీ అంటూ జగన్ ఇచ్చిన పిలుపు లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సభలో ప్రతిపక్ష నేత ఓ రాక్ స్టార్ లా ఉన్నాడంటున్నారు యువాభిమానులు. భారీ బహిరంగ సభలో వేలాది మంది ప్రజానీకం మధ్య నుంచి నడిచేలా, వారితో సంభాషించేలా ఏర్పాటు చేసిన కారిడార్ లో జగన్ నడుస్తూ ముందుకు వెళ్లారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు. 
స్టేజీ చుట్టూ ఏసీలు పెట్టుకుని చంద్రబాబులా చెమట చుక్క చిందకుండా సొల్లు ఉపన్యాసాలు ఇచ్చే మాటల నాయకుడు కాదు వైఎస్ జగన్. చంద్రబాబులా మెత్తటి పరుపులు వేసుకుని, సొగసైన కుర్చీల్లో విలాసంగా కూర్చుని, భజంత్రీగాళ్ల లాంటి నాయకుల వెకిలి మాటలకు విరగబడి నవ్వే నాయకుడు కాదు జగన్. బాబులా మాటల్లో అధికారం, ముందున్న ప్రజల మీద అహంకారం ప్రదర్శించే డాబుసరి నేత కాదు వైఎస్ జగన్.  బాబులా తరాల గొప్పలు చెప్పుకుని, తన గొప్పల డప్పులు కొట్టుకునే కన్నింగ్ టైప్ కాదు యువనేత జగన్. నిఖార్సుగా ప్రజల మద్ద నిలబడ్డాడు.

ఆ ప్రజల మధ్యలోకే నడిచి వెళ్లాడు. వారి ప్రశ్నలు అందుకుని జవాబులిచ్చాడు. చిరునవ్వుతో, స్థిరమైన మాటతో, అతి సామాన్యంగా, సాదాసీదాగా, అందరిలో ఒకడనిపించేలా ఉన్న వైఎస్ జగన్ ను చూసి ఇతడే అసలైన రాక్ స్టార్ అంటున్నారు అభిమానులు. మ్యూజిక్ తో , పాటలతో మెస్మరైజ్ చేసేవాళ్లే కాదు, ప్రజల మనసులు గెలిచిన జగన్ కూడా రాక్ స్టారే అంటున్నారు. 
రాజకీయాల్లో రోల్ మోడల్ గా, వ్యక్తిత్వంలో ఒకే ఒక్కడిగా, ప్రజాభిమానంలో రాజన్నకు వారసుడిగా వైఎస్ జగన్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
 

Back to Top