అమరావతి: రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ మరోసారి విజయదుందుభి మోగిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. తాజాగా, అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీదే హవా అని మరో సర్వే స్పష్టం చేసింది. పొలిటికల్ క్రిటిక్ సర్వేలో మొత్తం 175 సీట్లలో 121 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. అలాగే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 54 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. టీడీపీ- జనసేన-బీజేపీల కూటమిపై వైయస్ఆర్‌సీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఆ పార్టీల పొత్తు తర్వాత కూడా వైయస్ఆర్‌సీపీ ముందంజలో ఉందని సర్వే పేర్కొంది. వైయస్ఆర్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వే స్పష్టం చేసింది. అసెంబ్లీ సీట్ల సర్వే ఫలితాలు వైయస్ఆర్‌సీపీ:121+/-5 టీడీపీ-జనసేన-బీజేపీ: 54+/-5 కాంగ్రెస్: 00 ఇతరులు: 00 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం అంచనా వైయస్ఆర్‌సీపీ: 49.5 శాతం టీడీపీ-జనసేన-బీజేపీ: 43 శాతం కాంగ్రెస్: 2.5 శాతం ఇతరులు: 5 శాతం కాగా, 2019 ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఘన విజయం సాధించి సత్తా చాటింది. గడిచిన నాలుగన్నరేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక 99 శాతం అమలు చేయడంతో పేదవర్గాల్లో అధికార వైయస్ఆర్‌సీపీకి ఆదరణ మరింత పెరిగింది. దీంతో ఓటర్లు మరోసారి వైయస్ఆర్‌సీపీకి అవకాశం కల్పించాలనే సంకల్పంతో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.