రెండేళ్లలో పోలవరం రెడీ

రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం పనులు జాప్యం అని వాదించేవాళ్ల మాటల్లో వాస్తవం లేదు.  సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం అని వైయస్ జగన్ మాట అక్షరాలా నెరవేర్చబోతున్నారు. ఆ లక్ష్యాలకు తొలి అడుగుగానే రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం వ్యయాన్ని తగ్గించి, పనులను ప్రారంభించడం. రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మించి తీరుతామని నీటిపారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ప్రకటించారంటేనే ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ఎంత శ్రద్ధ కనబరుస్తోందో అర్థం చేసుకోవచ్చు. 
పోలవరం అంచనా వ్యయం పెంచి, కమీషన్లు తిని, పనులను పడకేయించిన గత ప్రభుత్వ నిర్లక్ష్యన్ని రివర్స్ టెండరింగ్ తో వదిలించారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులెన్నో చేసిన మేఘా సంస్థ సీఎం జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా పోలవరాన్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తామనే హామీ ఇస్తోంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నిలబడ్డ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలకు ఇస్తున్న ఒకే లక్ష్యం వేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం. ఒకప్పటి అవినీతి సర్కారు 50-50 అంటూ కమీషన్లు దండుకున్న విషయం అందరికీ తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి చోటు లేకుండా, పారదర్శక విధానంలో టెండర్లు పిలిచింది. కాంట్రాక్టు సంస్థలకు వారి మార్జిన్ లాభాలు తప్ప ఎలాంటి కమీషన్లు, లంచాలకూ తావులేకుండా పనిచేసే స్వేచ్ఛను కల్పించారు ముఖ్యమంత్రి. బృహత్తర నిర్మాణాలు చేపట్టి దేశంలో నెంబర్ 2 అనిపించుకున్న మేఘా సంస్థ ప్రతిష్టాత్మకంగా పోలవరాన్ని నిర్ణీతవ్యవధిలో పూర్తిచేస్తుందని భావించవచ్చు. 
ప్రకృతి కూడా ఈ ప్రభుత్వానికే సహకరిస్తోంది అంటున్నారు రైతులు, రాష్ట్ర ప్రజలు. ముందుగానే వచ్చిన వర్షాకాలమే ఇందుకు నిదర్శనం. వందరోజుల వ్యవధిలోనే పోలవరంపై సమీక్ష, టెండర్లు పిలవడం, ఖరారు చేయడం జరిగిపోయాయి. వర్షాల సమయం కనుక పాత కాంట్రాక్టు సంస్థ అయినా ఈ మూడు నెలల కాలం ఎలాంటి పనులూ చేపట్టే పరిస్థితి ఉండదని ఇంజనీరింగ్ నిపుణులే చెబుతున్నారు. కనుక కనస్ట్రక్షన్ సీజన్ మొదలయ్యే సరికి రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ పూర్తి అయ్యి పోలవరం పనులకు ఆటంకాలన్నీ తొలగిపోతాయి.  లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు పోలవరం పరుగులు పెట్టేందుకు సిద్ధమవ్వడం తథ్యం. 

 

Back to Top