పోలవరం రివర్స్ టెండరింగ్ ఫలితాలు చూస్తే షాక్

ముఖ్యమంత్రి వైయస్ జగన్ పోలవరం విషయంలో ఎంతో పట్టుదలగా ఉన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం పోలవరాన్ని కమీషన్ల కోసం ఎటిఎం కార్డులా వాడుకున్న విషయాన్ని ప్రజల దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాదు రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో పోలవరాన్ని పూర్తి చేసే పనులకు శ్రీకారం చుట్టారు.
రివర్స్ టెండరింగ్ ఫలితాలు
సీఎం ఆశించినట్టే రివర్స్ టెండరింగ్ సత్ఫలితాలను ఇస్తోంది. చంద్రబాబు అంచనాలను ఎన్నింతలు ఎక్కువ చేసి ప్రజా ధనాన్ని లూటీ చేశారో ఈ రివర్స్ టెండరింగ్ బైట పెడుతోంది. అధిక ధరలకు టెండర్లు దక్కించుకున్న'సంస్థల టెండర్లను కాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ కు పిలవడం ద్వారా ఆ పనులకయ్యే అసలు ఖర్చు ఎంతో ఇప్పుడు అందరికీ అర్ధం అయ్యింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులోని 65 పాకేజీ పనికి దాదాపుగా ౩౦౦ కోట్లు అంచనా వ్యయం గా ఖరారు అయ్యింది. మాక్స్ ఇన్ఫ్రా సంస్థ ఈ టెండర్ ను దక్కించుకుంది. ఐతే రివర్స్ టెండరింగ్ లో ఇదే మొత్తాన్ని బెంచ్ మార్క్ గా పరిగణిస్తూ తాజాగా టెండర్లకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం  జరిగిన ఈ ఆక్షన్ లో ఆరు సంస్థలు పోటీ పడ్డాయి. అతి తక్కువ బీడ్ దాఖలు చేసిన వారికి ఈ టెండర్ దక్కుతుంది. ఇంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించడం దేశంలో ఇదే ప్రప్రధమం. 300 కోట్లు విలువ చేసే ఈ పనిలో రివర్స్ టెండరింగ్ ద్వారా యాభై ఎనిమిది కోట్ల మేర ఆదా జరుగుతోంది. అంటే గత టెండర్ కంటే 15.6 శాతం తక్కువ వ్యయంలోనే పని పూర్తి అవుతుందన్న మాట. 300.కోట్ల పనిలోనే ఇంత ఆదా సాధ్యం అయితే పూర్తి పోలవరం పనులను రివర్స్ టెండర్ చేస్తే మరెంత ఖర్చును ఆదా చేయొచ్చు అంటున్నారు జల వనరుల అధికారులు. భవిష్యత్ లో హైడల్, హెడ్ వర్క్స్ కి సంబంధించి రివర్స్ టెండరింగ్ పూర్తయితే మరింతగా అంచనా వ్యయం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట.
పోలవరం ఆపేశారని, కమీషన్ల కోసమే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లను రద్దు చేస్తోందని నానా యాగీ చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏమంటారో చూడాల్సి ఉంది. తన హయాం లో పెంచిన అంచనా వ్యయం సొంత జేబులోకి చేరిన కమీషన్ కోసమే అన్న నిజాన్ని ఒప్పుకుంటారేమో ప్రజలే నిలదీసి నిగ్గదీసి అడగాల్సి ఉంది.

Back to Top