పోలవరం ఇక బ్యారేజ్‌!

41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వ.. తేల్చి చెప్పిన కేంద్రం.. 

అటు కేంద్రం.. ఇటు రాష్ట్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాల నిర్వాకం బట్టబయలు 

రాజ్యసభలో కేంద్ర జల్‌ శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి స్పష్టీకరణ 

45.72 మీటర్ల ఎత్తులో నీటి నిల్వకు నిధుల కోసం ఫిబ్రవరి 27న పీఐబీ ప్రతిపాదన 

తొలి దశలో 41.15 మీటర్లలో నీటి నిల్వకు నిధులు విడుదల చేయాలని సిఫార్సు 

పీఐబీ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపకుండా అప్పట్లో చంద్రబాబు మోకాలడ్డు 

ఆగస్టు 28న గత ప్రతిపాదనకు భిన్నంగా కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదన.. అభ్యంతరం చెప్పని టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్‌

అనుకున్నంతా అయ్యింది.. ఏది జరగకూడదని ఇన్నాళ్లూ అనుకున్నామో అదే జరిగింది.. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిస్తున్నారంటే.. అబ్బే కాదు కాదని బుకాయించిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతుంది? ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టమవుతోంది. 

నాడు–నేడు చంద్రబాబు తీరే ఈ ప్రాజెక్టుకు శాపంగా పరిణమించిందని తేటతెల్లమవుతోంది. భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు కాస్తా బ్యారేజ్‌గా మారిపోనుందన్న నిజాన్ని నీటి పారుదల రంగ నిపుణులు, రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.

పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితమని కేంద్రం తేల్చి చెప్పింది. ఆ మేరకు నీరు నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు ఆమోదం తెలిపామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌ శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌదరి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు మేరకు పోలవరం ప్రాజెక్టును గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నామని.. ఎత్తును తగ్గించలేదని చెప్పారు. 

కానీ.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తద్వారా అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాలు పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీని వల్ల పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల కింద నీళ్లందిస్తున్న 1.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడానికి మాత్రమే పోలవరం బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు అక్కరకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఆ ఆయకట్టుకు కూడా గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే నీళ్లందించడానికి సాధ్యమవుతుందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.67 ఎకరాలతోపాటు కృష్ణా డెల్టాలో 13.06 లక్షలు, గోదా­వరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ.. 540 గ్రామాల్లోని 28.50 లక్షల మందికి తాగునీళ్లు అందించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. 

విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు అందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 8 లక్షల ఎకరాలకు నీళ్లందించడం అసాధ్యమని తేల్చి చెబుతున్నారు. ఇక ప్రాజెక్టు­లో అంతర్భాగంగా నిరి్మస్తున్న 960 మెగావాట్ల జ­ల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తికి వీలుండద­ని.. గోదావరి సిగలో కలికితురాయిగా వెలుగులీనాల్సి­న ఆ కేంద్రం ఒట్టి దిష్టి»ొమ్మగా మారుతుందని విద్యు­త్‌ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నోరు మెదపని టీడీపీ కేంద్ర మంత్రి  
పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయడానికి నిధులు మంజూరు చేయాలని.. తొలి దశలో కనీస నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయడానికి నిధులు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 27న పీఐబీ (పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు) కేంద్రానికి ప్రతిపాదించింది. 

41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే 1.53 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించవచ్చని, 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తేనే ప్రాజెక్టు కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతో పాటు గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడం, విశాఖకు నీటి సరఫరా చేయొచ్చని ఆ ప్రతిపాదనలో పీఐబీ స్పష్టం చేసింది. 

అయితే అప్పటికే ఎన్‌డీఏలో చేరిన చంద్రబాబు.. ఆ ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేస్తే వైఎస్సార్‌సీపీకి ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ పెద్దల చెవిలో వేశారు. దాంతో అప్పట్లో పీఐబీ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ పక్కన పెట్టింది. కానీ.. ఆగస్టు 28న పీఐబీ ప్రతిపాదించిన దానికి భిన్నంగా.. 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తూ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ముందుకు కేంద్ర ఆర్థిక శాఖ పంపింది.

ఈ ప్రతిపాదనపై ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు అభ్యంతరం చెప్పలేదు. అంటే.. అటు కేంద్రంతోపాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి అంగీకరించాయన్నది స్పష్టమవుతోంది. 

నాడూ.. నేడూ పోలవరానికి ‘చంద్ర’ ద్రోహం  
రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టును అప్పట్లో ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం తాగునీటి విభాగం, జల విద్యుత్‌ విభాగానికి అయ్యే వ్యయం కాకుండా కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయం రూ.20,398.61 కోట్లు ఇస్తే చాలని చెప్పారు. 

భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం సంగతి గాలికొదిలేశారు. కమీషన్లు వచ్చే మట్టి పనులనే 2016–19 మధ్య చేపట్టి, ఆ ప్రాజెక్టులో విధ్వంసం సృష్టించారు. తద్వారా డయా ఫ్రం వాల్‌ దెబ్బ తినడానికి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గురవ్వడానికి వరద మళ్లింపు పనులు పూర్తి చేయక పోవడమేనని అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇటీవల తేల్చి చెప్పింది. 

అప్పట్లో విధ్వంసం సృష్టించి.. ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి.. పోలవరానికి ద్రోహం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే బాటలో పయనిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రెండు దశల్లో పోలవరం.. ప్రతిపాదించింది కేంద్రమే  
» నీటి పారుదల, తాగు నీటి విభాగాలు వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని, తాగునీటి విభాగానికి అయ్యే రూ.4,068 కోట్లను ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. ఆ ప్రతిపాదనను కేంద్ర జల్‌ శక్తి శాఖకు పంపారు. ఈ అంశంపై 2021 జూలై 29న కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన ప్రతిపాదనతో సీడబ్ల్యూసీ నాటి ఛైర్మన్‌ హెచ్‌కే హల్దర్‌ ఏకీభవించారు.  

» ఆ సమావేశంలో 1986 మార్చి 13న సీడబ్ల్యూసీ జారీ చేసిన మార్గదర్శకాల మేరకు.. ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది కనీస నీటి మట్టం స్థాయిలో నీటిని నిల్వ చేయాలని.. ఆ తర్వాత దశల వారీగా ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలని హల్దర్‌ సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాల ఆధారంగా పోలవరంలో 35.44, 35.50, 41.15, 45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేస్తే ఏం ప్రయోజనాలు కలుగుతాయో తెలపాలంటూ పీపీఏ సీఈవోకు కేంద్ర జల్‌ శక్తి శాఖ అప్పటి సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ అనూప్‌ కుమార్‌ శ్రీవాత్సవ 2021 అక్టోబర్‌ 27న లేఖ రాశారు. ఇదే లేఖను ఏపీ జ­లవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపిన పీపీఏ.. ఆ వివరాలు ఇవ్వాలని కోరింది. 
 
» 35.44, 35.50 మీటర్లలో నీటిని నిల్వ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని.. కనీస నీటి మట్టం 41.15 మీటర్లలో నిల్వ చేస్తే పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.53 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని.. 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తేనే ప్రాజెక్టు కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు గోదావరి, కృష్ణా డెల్టాల ఆయకట్టును స్థిరీకరించడం, 28.50 లక్షల మందికి తాగు నీరు, విశాఖకు 23.44 టీఎంసీలు సరఫరా చేయవచ్చునని వివరించారు.  

» ఇదే వివరాలను కేంద్ర జల్‌ శక్తి కార్యదర్శికి వివరిస్తూ 2021 నవంబర్‌ 20న పీపీఏ అప్పటి సభ్య కార్యదర్శి ఎంకే శ్రీనివాస్‌ లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగానే పోలవరాన్ని రెండు దశల్లో.. తొలి దశలో 41.15 మీటర్లలో 115.44 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా, రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తులో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా పనులు చేçపట్టడానికి నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
  
» పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేయాలంటే భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.23,622.35 కోట్లు అవసరం. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడం ద్వారా ఆ నిధులు మిగుల్చుకోవచ్చన్నది కేంద్రం ఆలోచన. పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావం వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం ఉంటుందంటూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చనే కేంద్రం ఇలా చేసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

జీవనాడిగా మార్చిన వైఎస్‌ జగన్‌  
»  రాష్ట్రంలో 2019 మే 30న సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ గాడిలో పెట్టారు. జీవచ్ఛవాన్ని జీవనాడిగా మార్చారు. రెండేళ్లు కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ చానల్, పైలట్‌ చానల్, ఎగువ కాఫర్‌ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్‌ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించారు. 

» చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల కోతకు గురైన దిగువ కాఫర్‌ డ్యాంను సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) మార్గదర్శకాల మేరకు పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే సొరంగాలు, ప్రధాన డ్యాం గ్యాప్‌–3లో కాంక్రీట్‌ డ్యాం, గ్యాప్‌–1లో డయాఫ్రం వాల్‌ వేశారు. గ్యాప్‌–2లో దెబ్బ తిన్న డయాఫ్రం వాల్‌ భవితవ్యం తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు.  

» ప్రాజెక్టుకు తాజా ధరల మేరకు నిధులు ఇచ్చి సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక, జల్‌ శక్తి శాఖ మంత్రులకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. తాగు నీటి విభాగం, నీటి పారుదల విభాగం వేర్వేరు కాదని.. రెండు ఒకటేనని, అందుకయ్యే వ్యయాన్ని కూడా ఇవ్వాలని కోరారు. 

ఇందుకు ప్రధాని మోదీ అంగీకరించారు. రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేద్దామని.. తొలి దశలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.12,911 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ గతేడాది జూన్‌ 5న కేంద్ర ఆరి్థక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నోట్‌ జారీ చేశారు. 

Back to Top