పోల‌వ‌రం సినిమాకు రూ.400 కోట్లు

పోలవరం సందర్శన యాత్ర పేరుతో 400 కోట్లు ఖ‌ర్చు

ప్రభుత్వ జీవోలే సాక్ష్యాలు 

అమ‌రావ‌తి: అధికారాన్ని అడ్డుపెట్టుకొని చంద్ర‌బాబు చేస్తున్న దోపిడీ ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో పోల‌వ‌రాన్ని కేంద్ర ప్ర‌భుత్వ‌మే నిర్మించాల్సి ఉండ‌గా..చంద్ర‌బాబు త‌న క‌మీష‌న్ల కోసం పోల‌వ‌రం నిర్మాణ బాధ్య‌త‌లు తీసుకున్నారు. పోల‌వ‌రం కోసం ఏపీకి సంజీవ‌ని అయిన ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టు పెట్టారు. ఇష్టారాజ్యంగా అంచ‌నాలు పెంచి త‌న బినామీల‌కు కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్టారు. 2018లోగా పోల‌వ‌రాన్ని పూర్తి చేస్తామ‌ని ఇన్నాళ్లు చెప్పిన చంద్ర‌బాబు గేట్లు పెట్టి జాతికి అంకితం చేశారు. అంత‌టితో ఆగ‌కుండా పోల‌వ‌రం చూపించేందుకు సంద‌ర్శ‌న పేరుతో రూ.400 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఇందుకోసం ప్ర‌త్యేక జీవోలు విడుద‌ల చేశారు. ఈ జీవోలే చంద్ర‌బాబు దోపిడీకి స‌జీవ సాక్ష్యంగా మారాయి. పట్టపగలు జరుగుతున్న ఇలాంటి దోపిడీ ప్రపంచంలోనే ఎక్కడా ఉండి ఉండదు. కనీసం మనం విని కూడా ఉండం . పది శాతం కూడా పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ ని చూడటం కోసం ప్రజలని ప్రభుత్వ ఖర్చుతో తరలించటం ఏమిటీ ..దానికోసం ఇప్పటిదాకా రూ.400 కోట్లు ఖర్చు చేయటం ఏమిటి ? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ? పత్రికలు , ప్రభుత్వ వ్యవస్థలు పని చేస్తున్నాయా ? అన్న అనుమానాలు క‌లుగ‌క‌మాన‌దు.  కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరైనా ఇలాంటి దోపిడీని సమర్థిస్తారా ? పైపెచ్చు ఇప్పటిదాకా రెండు లక్షల మంది సందర్శించారని పచ్చ మాఫియా గొప్పలు చెప్పుకొంటోంది . 
 పోలవరం సందర్శన, ఇతర ప్రయాణ ఖర్చులకి ఇప్పటి దాకా 19 జీవోలు జారీ  
1) . జీవో నెం - 1709  ,తేదీ - 05-09-2018 
    విడుదల చేసిన మొత్తం - 23,16,00,000 ( రూ.23 కోట్ల 16 లక్షలు ) 
  జీవోలో చెప్పిన కారణం -- పోలవరం సందర్శన యాత్ర కోసం బస్సులు , బ్రేక్ఫాస్ట్ , లంచ్ , స్నాక్క్స్ , డిన్నర్ .

2) జీవో నెం -- 311 , తేదీ - 27.04.2018 
   విడుదల చేసిన మొత్తం - 22,25.00.000 ( రూ.22 కోట్ల 25 లక్షలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- పోలవరం సందర్శన యాత్ర కోసం బస్సులు , బ్రేక్ఫాస్ట్ , లంచ్ , స్నాక్క్స్ , డిన్నర్ .

3 ) జీవో నెం - 211 , తేదీ - 15.02.2018  
 విడుదల చేసిన మొత్తం - 23,35,00,000 ( రూ.23 కోట్ల ముప్పైఐదు లక్షలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- అడ్వర్టైజ్మెంట్  , పబ్లిసిటీ ఖర్చులు 

4 ) జీవో నెం - 1226 , తేదీ -26.05.2018 
 విడుదల చేసిన మొత్తం -- 89,60,72,000 ( రూ.89 కోట్ల 60 లక్షల 72 వేలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- వాహనాలు , ఆఫీస్ ఖర్చులు , ప్రయాణ ఖర్చులు . 

జీవోలు  క్షుణ్ణంగా పరిశీలిస్తే..
ఒక్కో బస్సు కి -- రూ.55 వేలు 
   కిలోమీటర్ కి -- రూ.66   
    టిఫిన్ -- రూ.75  
 లంచ్  125 రూపాయలు 
  - సాయంత్రం టీ , స్నాక్స్ -- 50 రూపాయలు 
  డిన్నర్  -125 రూపాయలు 

ఇదీ ఒక్కో మనిషికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు . ఇప్పటివరకు రెండు లక్షల మంది సందర్శించినట్లు లెక్కలో రాసుకొన్నారు . 
  
కేవలం 2018 లోనే పోలవరం బస్సు యాత్ర పేరుతో దోచుకొన్నది అక్షరాలా రూ.158 కోట్లు . ఇది కాకుండా మిగిలిన ఈ మూడు నెలల కాలానికి మరో రూ.71 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . అంటే 2018 మొదలుకొని ఇప్పటిదాకా పోలవరం బస్సు యాత్ర పేరుతో దోచుకొన్నది అక్షరాలా రూ. 229 కోట్లు . 
పైనాలుగు జీవోలు గడచిన సంవత్సరం కాలంలో కేవలం రైతులు పోలవరం యాత్ర సందర్శన పేరుతో విడుదల చేసారు . 
మిగిలిన ఈ క్రింది జీవోలు 2017 ,2016 లలో పోలవరం ఆఫీస్ ఖర్చులు , ప్రయాణ ఖర్చులు పేరుతొ మిగిలిన 15 జీవోలు జారీ చేసారు . 

5 ) జీవో నెం - 76 , తేదీ - 22.1.2018  
 విడుదల చేసిన మొత్తం -- 8,74,72,000  ( రూ.8 కోట్ల 74 లక్షల 72 వేలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు . 

6 ) జీవో నెం - 2107 , తేదీ - 2.11.2017 
 విడుదల చేసిన మొత్తం -- 10,24,72,000 ( రూ.10 కోట్ల 24 లక్షల 72 వేలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు .

7 ) జీవో నెం - 1558 , తేదీ - 09.07.2017 
 విడుదల చేసిన మొత్తం - 10,24,72,000 ( రూ.10 కోట్ల 24 లక్షల 72 వేలు )
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , 

8 ) జీవో నెం - 1393 , తేదీ - 11.06.2017  

 విడుదల చేసిన మొత్తం - 4,06,25,000 ( రూ.4 కోట్ల 6 లక్షల 25 వేలు ) 

 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , 
9 ) జీవో నెం - 1307 , తేదీ - 26.05.2017   
 విడుదల చేసిన మొత్తం - 1,01,25,000 ( రూ.1 కోటి 1 లక్ష 25 వేలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు . 

10 ) జీవో నెం - 1306 , తేదీ - 26.05.2017  
 విడుదల చేసిన మొత్తం - 12,00,00,000 ( రూ.12 కోట్లు ) 
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , 

11 ) జీవో నెం - 1070 , తేదీ - 24.04.2017  
 విడుదల చేసిన మొత్తం - 13,51,87,000 ( రూ.13 కోట్ల 51 లక్షల 87 వేలు ) 
--> జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , 

12 ) జీవో నెం - 555 , తేదీ - 21.03.2017 

 విడుదల చేసిన మొత్తం - 37,80,00,000 ( రూ.37 కోట్ల 80 లక్షలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , 

13 ) జీవో నెం - 2361 , తేదీ - 23.12.2016 
 విడుదల చేసిన మొత్తం - 13,75,00,000 ( రూ.13 కోట్ల 75 లక్షలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు 

14 ) జీవో నెం - 2070 , తేదీ - 19.10.2016 
 విడుదల చేసిన మొత్తం - 13,75,00,000 ( రూ.13 కోట్ల 75 లక్షలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , 

15 ) జీవో నెం - 1840 , తేదీ - 12.08.2016  
 విడుదల చేసిన మొత్తం - 13,75,00,000 ( రూ.13 కోట్ల 75 లక్షలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , 

16 ) జీవో నెం - 1689 , తేదీ - 06.07.2016  
 విడుదల చేసిన మొత్తం -- 42,50,000 ( రూ.42 లక్షల 50 వేలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , 

17 ) జీవో నెం - 1402 , తేదీ - 09.05.2016 
 విడుదల చేసిన మొత్తం - 13,32,50,000 ( రూ.13 కోట్ల 32 లక్షల 50 వేలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , 

18 ) జీవో నెం - 1371 , తేదీ - 07.05.2016 
 విడుదల చేసిన మొత్తం --5,34,90,000 ( 5 కోట్ల 34 లక్షల 90 వేలు )
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , 

19 ) జీవో నెం - 398 , తేది - 05.03.2016 
 విడుదల చేసిన మొత్తం - 15,34,17,000 ( రూ.15 కోట్ల 34 లక్షల 17 వేలు ) 
 జీవోలో చెప్పిన కారణం -- ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు .

2018 నుండి పోలవరం బస్సు యాత్ర పేరుతొ విడుదల చేసిన మొదటి నాలుగు జీవోలు, 2017 , 2016 లలో పోలవరంలో ఆఫీస్ ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , పబ్లిసిటీ ఖర్చులు పేరుతొ విడుదల చేసిన 15 జీవోలు కలుపుకొంటే .. ఇప్పటివరకూ దోచుకొన్నది అక్షరాలా రూ.331 కోట్ల 69 లక్షల 32 వేలు . 

ఇది సరిపోదన్నట్లు ' ఎన్నికలు జరిగే వరకూ పోలవరం బస్సు యాత్రల పేరుతో ప్రజలని తరలించాలని అందుకోసం ఇంకో రూ.71 కోట్లు విడుదల చేయాలనీ నిర్ణయించారు . విడుదల చేయబోయే ఈ రూ. 71 కోట్లు కలుపుకొంటే పోలవరం బస్సు యాత్రల ఖర్చు రూ.400 కోట్లు పైమాటే . 

పోలవరంలో ఇప్పటిదాకా పెట్టింది ఒకే ఒక్క గేట్ , ఈ రూ. 400 కోట్లు పెడితే సగం గేట్లు పూర్తయ్యేవి . పులిచింతల పెండింగ్ పనులు పూర్తయ్యేవి రూ. 400 కోట్లతో రాష్ట్రంలో ఎన్నో సమస్యలని పరిష్కరించొచ్చు . 

పోలవరం బస్సు యాత్రలో తాగి చిందులేసే వార్తలు చూస్తూనే ఉన్నాము . ఇష్టమొచ్చిన  లెక్కలు రాసుకోవటం దోచుకోవటం . దీనిలో 100 కోట్లకి భారీ నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమా నియోజకవర్గం నుండి లక్ష మంది సందర్చించారని లెక్కల్లో చూపెట్టారు . 

పోలవరంలో ఈరకంగా దోపిడీ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ ని తన చేతుల్లోకి తీసుకోని ప్రత్యేకహోదాని తాకట్టుపెట్టాడు చంద్రబాబు . 

 ఇప్పటికైనా ఈ ప్ర‌భుత్వం చేస్తున్న అవినీతి, అక్ర‌మాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి. కనీవినీ ఎరగని దోపిడీని ప్రశ్నించాలి. రాబోయే ఎన్నికలలో ఈ దోపిడీదారుల పాలనని అంతం చేద్దాం. 

Back to Top