ప‌వ‌న్ దృష్టిలో ముఖ్య‌మంత్రి జ‌గ‌నేనా?

ప‌వ‌న్ దృష్టిలో ముఖ్య‌మంత్రి జ‌గ‌నేనేమో అంటున్నారు చాలామంది. ప‌వ‌న్ తీరు తెన్నులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ప్ర‌తిప‌క్ష నేత అని కాక‌, ఆయ‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ముఖ్య‌మంత్రేమో అనేలా ఉన్నాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మొన్న తిరుప‌తిలో స‌భ‌కు అనుమ‌తి రాక‌పోతే అందుకు జ‌గ‌న్ కార‌ణం అంటాడు పవ‌న్ క‌ళ్యాణ్. నిన్న హెలికాఫ్ట‌ర్ లాండింగ్ కు అనుమ‌తి ఇవ్వ‌కుంటే దీనికి కూడా కార‌ణం ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌నే అంటున్నాడు. ఈ జ‌నసేన అధ్య‌క్షుడు. లా అండ్ ఆర్డ‌ర్ నిర్ణ‌యాలు తీసుకునేది ప్ర‌భుత్వం అని, ఆ ప్ర‌భుత్వం చంద్ర‌బాబుద‌ని ప‌వ‌న్ పూర్తిగా మ‌ర్చిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. రాష్ట్రానికి హోదా రాక‌పోయినా ప‌వ‌న్ అందుకు కార‌ణం జ‌గ‌నే అని విమ‌ర్శించ‌డం చూసి ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లే తెల్ల ముఖాలు వేస్తున్నారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ల‌కు తాన తందానా అనాల్సి వ‌స్తోంద‌ని త‌ల బాదుకుంటున్నారు. అధికారంలో ఉన్న ముఖ్య‌మంత్రిని ప్ర‌శ్నించ‌కుండా ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ ను ప్ర‌శ్నించ‌డం ఏమిట‌ని సోష‌ల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్న‌వాళ్ల‌కు స‌మాధానం చెప్ప‌లేక సైలెంట్ అయిపోతున్నారు జ‌న‌సైనికులు. 

ప‌వ‌న్ మాత్ర‌మే కాదు చంద్ర‌బాబు కూడా

చంద్ర‌బాబు కూడా రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి తనే అనే విష‌యాన్ని ఎప్పుడో మ‌ర్చిపోయారు. కేంద్రం నిధులు ఇవ్వ‌కున్నా, పోల‌వ‌రం ప‌నులు ఆగినా, కేసీఆర్ కేసులు వేసినా, హైకోర్టు మొట్టికాయ‌లేసినా అన్నిటికీ కార‌ణం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటూ ఆక్రోశిస్తుంటారు. గ‌త ఎన్నిక‌ల నుంచి రేపు రాబోయే ఎన్నిక‌ల ప్ర‌చారం వ‌ర‌కూ ప్ర‌తి చోటా వైఎస్ జ‌గ‌న్ ను  విమ‌ర్శించ‌డ‌మే చంద్ర‌బాబు ఎజెండా.  ఎక్క‌డ ఏ ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగినా, చివ‌ర‌కు జ‌గ‌న్ పైనే దాడి జ‌రిగినా అందుకు జ‌గ‌న్‌దే పూచీ. ప్ర‌తిప‌క్ష‌నేత‌దే బాధ్య‌త అంటాడు చంద్ర‌బాబు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న నాయ‌కుడు అధికారిక వ్య‌వ‌హారాల‌కు ఎలా బాధ్యుడు అవుతాడు? ఘ‌ర్ష‌ణ‌ల‌కు కార‌ణ‌మైతే అధికారం చేతిలో ఉన్న టీడీపీ ప్ర‌భుత్వం చేతులు ముడుచుకు ఎందుకు కూర్చుంది అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఉండ‌దు. 

జ‌గ‌న్ స‌త్తా 

ప్ర‌తిప‌క్షంలో ఉన్నా కూడా ప్ర‌భుత్వాధినేత‌తో ప‌ని చేయించ‌గ‌ల సామ‌ర్థ్యం జ‌గ‌న్ ది అని ప‌వ‌న్, బాబు వాఖ్య‌ల‌తో ప్ర‌జ‌లు పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. అనుభ‌వ‌జ్ఞుడ‌ని చంద్ర‌బాబుకు అధికారం ఇస్తే ఆయ‌న వ‌ల్ల ఏం కాలేద‌ని, పోల‌వ‌రం మొద‌లు ప్ర‌జ‌ల సంక్షేమం వ‌ర‌కూ ఏది జ‌ర‌గాల‌న్నా జ‌గన్ తోనే సాధ్యం అన్న విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అనుభ‌వ పూర్వ‌కంగా తెలిసి వ‌చ్చింది. ఎందుకంటే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తానిచ్చిన హామీలు నెర‌వేర్చ‌డం సాధ్య‌మే అని బ‌ల్ల గుద్ది మ‌రీ చెప్పారు. ఆ హామీలను ఎగ‌తాళి చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు అవే హామీల‌ను ఎన్నిక‌ల‌కు ముందు నెర‌వేర్చ‌డం, కొన్నిటిని గెలిపిస్తే తీరుస్తానంటూ మేనిఫెస్టోలో పెట్ట‌డమే అందుకు నిద‌ర్శ‌నం. నిజంగా అసాధ్య‌మైన హామీలే జ‌గ‌న్ ఇచ్చుంటే వాటిని బాబు ఎలా నెర‌వేరుస్తున్నాడు. అంటే రాష్ట్రంలో ఆదాయం, ప్ర‌జా సంక్షేమానికి ప్రాధాన్యం, ప‌థ‌కాల ద్వారా పేద‌ల‌కు ల‌బ్ది అనే ఎన్నో విష‌యాల‌పై యువ‌కుడైన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఓ స్ప‌ష్ట‌మైన అవ‌గాహన ఉంది. న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం మాత్రం జ‌గ‌న్ హామీల‌ను కాపీ కొట్టి వాడుకోవాల్సిన దుస్థితిలో ప‌డింది. ఐదేళ్ల ప‌రిపాల‌నా కాలంలో తానిచ్చిన హామీలే నెర‌వేర్చ‌ని చంద్ర‌బాబు, రాష్ట్రం క‌ష్టాల్లో ఉంద‌ని బీద ఏడుపుల‌తోనే కాలం వెళ్ల‌బుచ్చాడు. జ‌గ‌న్ ఇచ్చే హామీలు ఆచ‌ర‌ణ సాధ్యం కాద‌ని ప్ర‌చారం చేయించాడు. నేడు అవే హామీల‌ను దొంగిలించి ఎన్నిక‌ల్లోకి వెళ్ల‌డం చూస్తే ఇన్నేళ్లుగా బాబు చెప్పినవ‌న్నీ అబ‌ద్ధాల‌ని తేలిపోయింది. అధికారంలో లేక‌పోయినా ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల‌ను అధికార పార్టీతో ఆచ‌రించేలా చేసిన ఘ‌నత వైఎస్ జ‌గ‌న్ కే ద‌క్కింది. ప్ర‌జ‌ల దృష్టిలో అధికారం లేని పాల‌కుడు, ప‌ద‌వి లేని ప్ర‌జానాయ‌కుడు వైఎస్ జ‌గ‌నే అయ్యాడు. 

ప్ర‌జ‌ల దృష్టిలోనే కాదు చంద్ర‌బాబు, ప‌వ‌న్ దృష్టిలోనూ రాష్ట్రాన్ని శాసించగ‌ల‌ వ్య‌క్తి జ‌గ‌నే అని నిర్థార‌ణ అయ్యాక, ఇక ప‌ని చేయ‌ని ఈ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు మాత్రం ఎందుకు కోరుకుంటారు?  

Back to Top