"పచ్చ'' అబద్ధం

తిరుమల అన్యమత ప్రచారం వెనుక బట్టబయలైన నిజం

టిమ్ పేపర్లపై చంద్రబాబు పేరుతోనే పథకాల ప్రచారం

టీడీపీ హయాంలోనే టికెట్లపై ప్రచారానికి ఖరారైన టెండర్

అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై ప్రతిపక్ష తెలుగు దేశం, బీజేపీలు మహా కుట్రకు తెర లేపాయి. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. నిన్నటికి నిన్న అమెరికాలో వైయస్‌ జగన్‌ ఓ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేయలేదని విష ప్రచారం చేసిన కమలవనంలోని పచ్చ పుష్పాలు..ఇవాళ టీటీడీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం జరుగుతుందని మరో కుట్రకు తెర లేపారు. ఇదంతా కూడా తెలుగు దేశం పార్టీ కుట్రే అని బహిర్గతమైంది.  ఆర్టీసీ బస్సు టికెట్లపై ప్రభుత్వ పథకాలు ప్రచారం చేసేందుకు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చింది. ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయిన ఆర్టీసీలోకి కొందరు అధికారులకు చంద్రబాబుపై ఉన్న ప్రేమ తగ్గలేదు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లే బస్సు టికెట్లపై పవిత్ర హజ్‌ యాత్ర, జేరుసలేమ్‌ యాత్రల గురించి ముద్రించిన టికెట్లు జారీ చేశారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెర లేపారు.  చందద్రబాబు పేరుతో పథకాలను ప్రచారం చేసేందుకు 2018లో కాంట్రాక్టు కుదుర్చుకొని 60 వేల టిమ్ పేపర్లపై మైనారిటీ సంక్షేమ శాఖ ప్రకటనలు వేయాలని మార్వెన్ క్రియేటివ్ సర్వీసెస్ కు కాంట్రాక్టు ఇచ్చినట్లు అప్పటి జీవో కాపీ వెలుగు చూసింది. తిరుమల బస్సుల్లో  ఈ ప్రకటనలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది.  ఇవేవి తెలుసుకోకుండా బీజేపీ నేతలు వైయస్‌ జగన్‌పై విష ప్రచారం మొదలుపెట్టారు.   నిన్నటి నుండి తిరుమల వెళ్లే బస్ లలో టికెట్ ల వెనక జెరూసలేం యాత్ర అని ఉంది కాబట్టి మత ప్రచారం చేస్తున్నారు అని తెగ గోల చేస్తు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పరువు తీయాలని, మతాల మస్య చిచ్చు రేపి ప్రజల్లో అశాంతి నెలకొల్పాలని ఒక వర్గం ప్రయత్నిస్తోంది.

 ఆ టికెట్ వెనక భాగం ఏముందంటే..?

*.పవిత్ర జెరూసలేం యాత్ర గత 41/2 ఏళ్లలో ఇంతమందీని తీసుకెళ్లాం. మైనారిటీ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

*.పవిత్ర హజ్ యాత్ర గత 41/2 ఏళ్లలో ఇంతమందీని తీసుకెళ్లామని అప్పటి మైనారిటీ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చి కనీసం 3నెలలు కూడా పూర్తి కాలేదు. ఆ టికెట్ లు ఎవరివి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ వారివి. అవి ప్రింట్ చేసేది వాళ్లే, ఆ ప్రకటన ఇచ్చింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలోని మైనారిటీ సంక్షేమ శాఖ .

అవన్నీ గత ప్రభుత్వంలో ప్రింట్ చేసినవే అనేదానికి ఆధారం అందులోనే ఉంది, గత 41/2 సంవత్సరం తీసుకెళ్లాం అని ఉంది అంటే ఆ ప్రకటన ఇచ్చింది ఎవరి ప్రభుత్వం? చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం.
గత నెల వరకు టిటిడి చైర్మన్ గా ఉన్నది ఎవరు? పుట్టా సుధాకర్ యాదవ్, అన్యమత ప్రచారాలకు వెళ్ళే వ్యక్తి.  టీడీపీ హయాం లో జరిగిన పనులు వైయస్‌ జగన్ వచ్చాక జరిగాయి అని చెప్పడం మీ భావ దారిద్య్రం అనుకోవాలా?  తిరుమల బస్సుల్లో అన్యమత ప్రచారానికి సహకరించిన అధికారుల పాత్రపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విచారణకు ఆదేశించారు. 

Back to Top