నో కాంప్రమైజ్‌... ’ద ఫైటర్‌’

ప్రజలకోసం ఎందాకైనా...

ప్రజాప్రయోజనాల విషయంలో రాజీపడని ధోరణి

ఏ పార్టీ అయినా చెప్పింది చేయాలనే ’పట్టు’దల

తన సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రతో ఆంధ్రప్రదేశ్‌లో తన ఉనికిని మరింత బలంగా చాటిన ప్రతిపక్షనేత వై.యస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్రంలోనే కాదు, రాబోయే రోజుల్లో జాతీయరాజకీయాల్లోనూ కీలకశక్తిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా వున్నాయంటోంది నేషనల్‌ మేగజైన్‌ ఇండియా టుడే. ఇటీవలే ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న జగన్‌..అందులో సూటిగా, స్పష్టంగా తన అభిప్రాయాలు, రాజకీయసిద్దాంతాలు స్పష్టం చేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలు తనకు, చంద్రబాబుకు మధ్య కాదని, విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్యనే అని గట్టిగానే చెప్పారు. తన రాజకీయపోరాటాల నుంచి, తనపై జరిగిన కుట్రల వరకు అన్నింటా చంద్రబాబు హస్తం వుందని కూడా చెప్పారు. 

ఇండియా టు డే కాంక్లేవ్‌ పేరిట విడుదలయిన... ఇండియా టుడే స్పెషల్‌ ఇష్యూలో మరోసారి, రాబోయే రోజుల్లో...రాష్ట్ర, దేశరాజకీయాల్లో వైఎస్‌ జగన్‌ పాత్రను ప్రస్తావించారు. మరోముఖ్యమైన విషయాన్ని అక్కడ ప్రచురించారు. 

కేంద్రంలో ప్రధానజాతీయపార్టీలైన బిజేపి, కాంగ్రెస్‌లకు స్పష్టమైన మెజారిటీ రాక ’హంగ్‌ లోక్‌సభ’ ఏర్పడే పరిస్థితులు వస్తే మీ మద్దతు ఎవరికి అన్న ప్రశ్నకు జగన్‌ తడుముకోకుండా సమాధానం చెప్పారు. ’కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, సంకీర్ణం ప్రభుత్వం ఏర్పాటయినా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తేనే మా మద్దతు అని స్పష్టం చేశారు. అటు కాంగ్రెస్, ఇటు బిజేపి రెండూ జాతీయపార్టీలు ఆంధ్రప్రదేశ్‌కు మోసం చేశాయి. ఆ రెండూ పార్టీలు మాకే మాత్రం మంచి చేయలేదు’ అని తేల్చేసిన జగన్‌ గురించి రాస్తూ, రాబోయే రోజుల్లో కేంద్రంలో జగన్‌ పాత్ర కీలకమని తేల్చింది.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top