నియంత నీడ..!

అతనొకప్రాణాలతో ఉన్నకోడిని తీసుకుని దాని ఈకలు ఒక్కొక్కటీ పీకుతూ ఉన్నాడు. ఆ నొప్పికి అది విలవిలలాడుతోంది. అయినా సరే ఒక్కొక్కటీ ఒక్కొక్కొటీ అలా మొత్తం దాని శరీరంపై ఉన్న ఈకలన్నీ పీకేశాడు. తర్వాత దాన్ని కింద వదిలి పెట్టాడు. తన జేబులో ఉన్న గుప్పెడు నూకలను తీసిం భరించలేని నొప్పితో వంటి మీద రక్షణ లేక ఉన్న ఆ కోడి ముందుచల్లాడు.

ఆకలికి తట్టుకోలేక ఉన్న ఆ కోడిం తనను ఆ స్థితికి తెచ్చిన వ్యక్తి అతనే అనేవిషయాన్ని కూడా పక్కనపెట్టి ఆ నూకల్నిఒక్కొక్కటీ తిన సాగింది. అప్పుడు చుట్టూ ఉన్న వారితో అతను ఇలా అన్నాడు.. ‘’ప్రజల్నిమనం ఇలాగే పాలించాలి..అప్పుడే మనం ఎప్పుడూ విజయాలు సాధించగలం’’ అని. ఇది ఒక నియంత కథ. 
ప్రజలు అధికారమిచ్చి ఐదేళ్లు కావస్తున్నా.. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని చంద్రబాబు..ప్రజల్ని అనేక రకాలుగా మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు చేస్తున్న పనులు చూస్తుంటే ఈ కథ గుర్తొచ్చింది. హడావుడిగా పెన్షన్పెంచేస్తున్నానని చెప్పడం, రైతులపై ప్రేమను ఒలకబోయడం చూస్తుంటే.. ఆ నియంత చల్లిన నూకలే గుర్తొస్తున్నాయి.

కానీ..ఆంధ్రప్రదేశ్  ప్ర‌జలు ఎంత విజ్ఞులో, రాజకీయంగా ఎంత చైతన్యం ఉన్నవాళ్లో బాబు మర్చిపోయాడు. 2004, 2009 ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును కూడా మర్చిపోయాడు. అందుకే..ఇప్పుడు ఎన్నికల ముందు ఈ రెండు నెలల్లో ఏదో ప్రజలకుమేలు చేస్తున్నట్టు నటించి, తాయిలాలు ప్రకటించి మళ్లీ అధికారంలోకి రావాలని కలలుగంటున్నాడు. అధికారమే లక్ష్యంగా అవినీతికి చిరునామాగా ఉన్న బాబు చేస్తున్న ప్రయత్నాలు చూసి ప్రజలు లోలోపలే నవ్వుకుంటున్నారు. ఐదేళ్లకు ఇప్పుడు గుర్తొచ్చామా బాబూ నీకు అంటూ ఓటు రాజకీయాన్నినిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. 

ప్రపంచంలో కెల్లా సీనియర్రాజకీయ నాయకుడిని అనిచెప్పుకు తిరిగే ఈ నిప్పుబాబుకి..ప్రపంచ నియంతల లక్షణాలు ఒంటబట్టకుండా ఉంటాయని ఎలా అనుకోగలం. కాకపోతే ఇప్పుడు కాలం మారిన విషయం ఒక్కటే ఆయన మర్చిపోతున్నాడు. ప్రజలు చీపురు కట్టలు తిరగేసి తరిమే రోజులని అర్థం కావడానికి ఇంకెంతో సమయం పట్టదు. 
 

Back to Top