నియంత చెప్పే నీతి క‌థ‌

అవినీతిపై, అరాచ‌కాల‌పై గొంతెత్తే సాక్షిపై చంద్ర‌బాబు సాగించిన క‌క్ష సాధింపు చ‌ర్య

బాబు నియంత్ర‌ణ‌లో ఉన్న పత్రిక‌లు, ఛానెళ్ల ప‌ని. కోట్ల రూపాయిల ప్ర‌క‌ట‌న‌లు

 

అహింస గురించి హిట్ల‌ర్, ప్ర‌పంచ శాంతి గురించి బిన్ లాడెన్ మాట్లాడిన‌ట్టుంది మీడియా నియంతృత్వం గురించి చంద్ర‌బాబు మాట్లాడుతుంటే! వ్య‌వ‌స్థ‌లను మేనేజ్ చేయ‌డంలో భాగంగా చంద్ర‌బాబు చేసే ప‌నుల్లో మొట్ట‌మ‌ద‌టి మెట్టే మీడియా నియంత్ర‌ణ‌. త‌న‌కు అనుకూలంగా ప్ర‌చారం, ప్ర‌తికూల‌త‌ల‌పై దాప‌రికం అనే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేలా మీడియాను నియంత్ర‌ణ‌లో పెట్టుకున్న‌ది చంద్ర‌బాబే. త‌న‌ను ప్ర‌శ్నించేవారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం  చేయ‌డం, నిల‌దీసే మీడియాను దూరం పెట్ట‌డం బాబుకి అల‌వాటు. ఎమ్మెల్యేలు త‌న వెంటే ఉన్నారంటూ అబ‌ద్ధాలు ప్ర‌చారం చేయించి అధికారాన్ని చేజిక్కించుకున్న మొద‌టి రోజు నుంచీ నేటి వ‌ర‌కూ ఇదే బాబుది థియ‌రీ. ఒక‌ప్పుడు ఒక్క ప‌త్రిక‌తో మొద‌లై నేడు ప‌దుల సంఖ్య‌లో ఛానెళ్ల‌ను నియంత్రించే స్థాయికి చేరింది ఈ మీడియా నియంత్ర‌ణ‌. బాబు చేస్తే ఆహా బాబు చెబితే ఓహో అన‌డ‌మే బాబు నియంత్ర‌ణ‌లో ఉన్న పత్రిక‌లు, ఛానెళ్ల ప‌ని. కోట్ల రూపాయిల ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ, ప్ర‌త్యేక ప్యాకేజ్ ఇస్తూ మీడియాను త‌న నియంతృత్వంలో పెట్టుకున్న బాబు దిల్లీకెళ్లి బీజేపీ మీడియాను నియంత్రిస్తోందంటూ వ‌గ‌రుస్తున్నాడు. 

సాక్షిపై ఆంక్ష‌లు

చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగే అవినీతిపై, అరాచ‌కాల‌పై గొంతెత్తే సాక్షిపై చంద్ర‌బాబు సాగించిన క‌క్ష సాధింపు చ‌ర్య ఎవ్వ‌రికీ తెలియ‌నిది కాదు. దీనిపై ఆ మీడియా యాజ‌మాన్యం, ఉద్యోగులూ పెద్ద స్థాయిలో నిర‌స‌న వ్య‌క్తం చేసారు. కొన్నాళ్ల‌పాటు ఈ ఛానెల్ ప్ర‌సారం కాకుండా అడ్డుకునేందుకు కూడా ఎన్నో కుట్ర‌లు జ‌రిగాయి. అమ‌రావ‌తి దురాక్ర‌మ‌ణ‌ల‌పై సంచ‌ల‌న క‌థ‌నాలు ప్ర‌చురించ‌గానే, కోపంతో ఊగిపోయి ఆ ప‌త్రిక‌నే స్వాధీనం చేసుకుంటానంటూ అసెంబ్లీలో చిందులేసిన బాబును మ‌రిచిపోలేము. ప్ర‌శ్నించే విలేక‌రుల‌ను నీవు సాక్షీనా అని అడిగేంత‌గా ముఖ్య‌మంత్రి, మీకు స‌మాధానం చెప్ప‌ము అని ముఖం చాటేసేలా మంత్రులు భ‌య‌ప‌డుతున్నారు. 

ప‌సుపు గొడుగుకింద‌

ఏపీలో ఎల్లో గొడుగుకింద‌కు చేరిన ప‌త్రిక‌లు, ఛానెళ్ల‌ప‌ని ముఖ్య‌మంత్రి భ‌జ‌న చేయ‌డ‌మే. విదేశాల‌కు వెళితే వేల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తున్నాయంటూ క‌థ‌నాలు వండి వారుస్తారు. దిల్లీ వెళితే మోదీని క‌లిసి రాష్ట్రానికి కుప్పులు తెప్ప‌లుగా నిధులు తెస్తున్నాడంటూ బూర‌లూదుతారు. అరిటాకు ప‌రిస్తే అన్నం పెట్టాడంటూ క‌ల‌రింగిస్తారు. అర‌చేతిలో వైకుంఠంచూపే మాట‌ల‌నే అభివృద్ధి అని ప్ర‌చారం చేస్తారు. బాబు త‌ప్పులు క‌ప్పిపుచ్చుతారు. దుబారాను ప‌ట్టించుకోన‌ట్టు వ‌దిలేస్తారు. చేత‌గానిత‌నాన్ని స‌మ‌ర్థిస్తారు. దొంగ‌దీక్ష‌ల‌ను పోరాటాల‌ని న‌మ్మిస్తారు. బాబు నియంత్ర‌ణ‌లో ఉన్న ఈ మాధ్య‌మాల‌న్నీ అప‌ర అభిన‌వ అభివృద్ధి అవ‌తారం అని డ‌ప్పు కొడుతుంటాయి. హోదాపై బాబు యూట‌ర్న్ ల‌ను, పోల‌వ‌రం జాప్యాన్నీ, ప‌ట్టిసీమ లొసుగుల‌ను, ఇసుక దందాల‌ను, భూ క‌బ్జాల‌ను, అవినీతి అధికార‌పార్టీ నాయ‌కుల ఆగ‌డాల‌ను ఈ ప‌త్రిక‌లు, ఛానెళ్లు మ‌చ్చుకైనా చూపించ‌వు. హామీల‌ను గాలికొదిలినా, ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌ను కొన్నా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా ప్ర‌శ్నించ‌వు. మేనేజ్మెంట్ ను విజ‌న్ అని, చేత‌గానిత‌నాన్ని గొప్ప‌త‌న‌మ‌ని, దొంగ నాట‌కాల దీక్ష‌ల‌ను  పోరాటాల‌ని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేందుకు శాయ‌శ‌క్తులా కృషి చేస్తోంది బాబు అండ‌ర్ కంట్రోల్ లో ఆడుతున్న మీడియా. 

గురివింద త‌న న‌లుపెర‌గ‌ద‌న్న‌ట్టు బాబు త‌న నియంత్ర‌ణ‌లో సాగుతున్న ప‌చ్చ‌ప్ర‌చారాన్ని మ‌రుగుప‌రిచి, కేంద్రం మీడియా సంస్థ‌ల‌ను నియంత్రిస్తోంద‌ని నంగ‌నాచి విమ‌ర్శ‌లు చేస్తే ప్ర‌జ‌లు మాత్రం న‌మ్ముతారా!??

Back to Top