చంద్రబాబు వంచనపై గ్రామ గ్రామాన చైతన్యం

మరింత ముమ్మరంగా నిన్ను నమ్మం బాబు

ఈ నెల 24 నుంచి రెండో విడత కార్యక్రమం

రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ, ప్రచార ఆర్భాటాలతో మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేసే లక్ష్యంతో  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమాన్ని మరింత ముమ్మరంగా చేపట్టనున్నారు. ఈ నినాదంతో చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభించడంతో, ప్రజలకు వాస్తవాలు తేటతెల్లమై, చంద్రబాబు చేస్తున్న వంచనను వారు అర్థం చేసుకుంటున్నందున దీనిని మరింత విస్తృతంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమం రెండో విడతను ఈ నెల 24 వ తేదీ నుంచి ఫిబ్రవరి 2 వ తేదీ వరకు గ్రామాల్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన కార్యాచరణ, ఏర్పాట్లపై  కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి.

టీడీపీ మోసపూరిత చర్యలతో విసిగిపోయిన ప్రజలకు భరోసా ఇస్తూ, వారికి మరింత చేరువయ్యేందుకు ఈ  కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిర్వహించే గ్రామ స్థాయి ర్యాలీలు, సమావేశాల్లో చంద్రబాబు వైఫల్యాలను, అక్రమాలను, అవినీతిని, వంచనా శైలిని ప్రజలకు వివరిస్తూ, చంద్రబాబు ను ఇక నమ్మే ప్రసక్తే లేదంటూ నిన్ను నమ్మం బాబూ అంటూ తీర్మానాలు చేయనున్నారు. రెండో విడత కార్యక్రమంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 20 గ్రామాలకు తగ్గకుండా, కార్యక్రమాలను చేపట్టనున్నారు. దాదాపు పది రోజుల పాటు రెండో విడత కార్యక్రమాన్ని గ్రామగ్రామాన నిర్వహించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Back to Top