నేతన్నకు జననేత చేయూత

సీఎం వైయస్‌ జగన్‌ పుట్టిన రోజున వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ప్రారంభం

మరో హామీ అమలు

ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం

రుణాలు మాఫీ చేస్తామని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు చేనేతలకు మోసం

అనంతపురం: దశాబ్ధాల పాటు ఆడిన మగ్గం మూలన పడింది. రంగురంగుల హరివిల్లు లాంటి అందమైన పట్టుచీరను తయారు చేసే నేతన్న కష్టాల కడలిలో పడ్డాడు. అత్యధిక మంది జీవనం సాగిస్తున్న చేనేతపై గత పాలకుల చిన్నచూపుతో సంక్షోభంలో కూరుకుపోయింది.  మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికత నేర్పిన చేనేత కష్టాలు కన్నీళ్ల కలబోత అయింది. మగ్గం యజమానులు రైతులు, రైతు కూలీలా మాదిరిగానే పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు. ముడిసరుకు ధర పెరగడంతో మగ్గం నేతన్నల లాభాలు తేలేక నష్టాలతో కళ్లు తేలేస్తున్నారు.  దీంతో చేనేతలు అప్పుల ఊబిలో కురుకుపోయారు. వీరి కష్టాలను జననేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కళ్లారా చూశారు. నేను విన్నాను..నేను ఉన్నానని పాదయాత్రలో చేనేతలకు మాటిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మాటను నిలబెట్టుకుంటున్నారు. 'వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తంతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ పథకం ద్వారా చేనేతల కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఇచ్చే కార్యక్రమంతో వారి జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి.  చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న నేత కుటుంబాలకు వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం పథకం ఆసరాగా నిలుస్తుంది.  దశాబ్దాలుగా చేనేతలు అనుభవిస్తున్న కష్టాలను పాదయాత్రలో వైయస్‌ జగన్‌ గమనించి, ఆనాడే చేనేతలకు భరోసా ఇచ్చారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాటను వైయస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజైన డిసెంబరు 21న వైయస్‌ఆర్‌ నేతన్న హస్తం పథకం అమలుకు శ్రీకారం చుట్టడం చేనేతలపై వైయస్‌ జగన్‌కు ఉన్న మమకారాన్ని తెలియజేస్తోంది. ఈ నెల 21న అనంతరపురం జిల్లా ధర్మవరంలో  ‘నేతన్న నేస్తం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు.  

చేనేతలకు చంద్రన్న మొండిచెయ్యి 
 చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చేనేతల బతుకులు చితికిపోయాయి.  2014 ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే చేనేతల జీవితాలలో వెలుగులు నింపుతామని టిడిపి ప్రభుత్వం హామీ ఇచ్చింది. చేనేత రిజర్వేషన్లను అమలులోకి తెస్తామని, ముడిసరుకుల ధరలు అదుపులోకి తీసుకువస్తామని, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి రూ.ఐదు లక్షల పరిహారం ఇస్తామని, నేత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన మాటలు చెత్తబుట్టదాఖలయ్యాయి.  చేనేత క్లస్టర్లు, పార్కులు కలలుగానే మిగిలాయి. చివరికి ఆత్మహత్యలు చేసుకున్న నేతన్న కుటుంబాలకు ఇచ్చే పరిహారం విషయంలోను ప్రభుత్వం దగా చేసింది. దీంతో చేనేత రంగం తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంది.  రాష్ట్రంలో ఒక్క శాతం వున్న పవర్‌లూమ్స్‌ మరమగ్గాలు చేనేత జీవితాలకు చిధ్రం చేశాయి.  నిబంధనల పేరుతో ప్రభుత్వం శిల్క్‌ రాయితీ అందించకపోవటంతో అత్యధిక శాతం మంది ఆత్మస్థైర్యం కోల్పోయారు.  అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలకు పరిహారం అందించటంలో తీవ్ర జాప్యం జరిగింది.  టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత  రాష్ట్రంలో  62 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరిలో పది మందికి మాత్రమే పరిహారం అందింది. ఇదే క్రమంలో అనధి కారికంగా జరిగిన మరో 60 చేనేత ఆత్మహత్యలను నిబంధనల ప్రకారం లేవని పక్కనపెట్టింది. దీంతో ఆ కుటుంబాలు ఇంటి పెద్దను కోల్పోయి రోడ్డున పడ్డారు. పరిహారం పేరుతో రూ.5 లక్షలు రూపా యలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపింది. సంబంధిత జిఒ నేటికి విడుదల కాని పరిస్థితి వుంది. కుటుంబానికి రూ.50 వేల రూ పాయలు ఇస్తూ, మిగిలిన లక్ష జాయింట్‌ ఆకౌంట్‌ పేరుతో కుటుంబ సభ్యులను క్షోభకు గురి చేసింది.  

మాఫి లేదు... రుణం లేదు...
చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత గత ఐదేళ్లలో చేనేత సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  రూ.39 కోట్లు రుణమాఫీ చేసినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా నేటికి 900 మందికి రుణమాఫీ కాని పరిస్థితి వుంది. బ్యాంకు రుణాల విషయం లోను నేతన్నపై గత ప్రభుత్వం చిన్న చూపు ప్రదర్శించింది.  లక్షరూపాయలు ప్రభుత్వ పూచితో రుణాలు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది.  దీంతో వేలాది మంది చేనేతలు బ్యాంకు రుణాల కోసం ఎదురుచూశారు.  చేనేత రంగం దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో వారి కష్టాలను వైయస్‌ జగన్‌ చూసి చలించి పోయారు. తన పుట్టిన రోజునే వైయస్‌ఆర్‌ చేనేత నేస్తం పథకాన్ని అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపనున్నారు. అందుకే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర ప్రజలు మనసున్న జననేత అని కొనియాడుతున్నారు.  

Back to Top