నీ మోసాన్ని జనం మరువరు బాబూ..

బీజేపీ, టీడీపీ పరస్పర విమర్శలు హోదా అంశాన్ని పక్కదారి పట్టించడమే

తాయిళాలతో నోటికి తాళాలేసే కుట్ర

దిగజారి విమర్శలకు దిగిన చంద్రబాబు, మోడీ 

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ, బీజేపీల అసలు స్వరూపం బయటపడుతోంది. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనత రెండు పార్టీలకు దక్కుతుంది. 2014 ఎన్నికలకు ముందు హోదా తెస్తామని ఒకరు.. అధికారంలోకి రావడమే తరువాయి ఇస్తామని ఇంకొకరు హామీ ఇవ్వడం అక్కడే ఉన్న వెంకన్న స్వామి మర్చిపోయి ఉంటాడేమో కానీ.. ఈ ఐదేళ్లలో ఆంధ్రా ప్రజానీకం మరిచిపోలేదు. దానికి కారణం వైయస్‌ జగన్‌ అని నిస్సందేహంగా చెప్పాలి. ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు కానీ.. ఫలితాల తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ప్రతిక్షణం ప్రజల పక్షానే ఉంటూ ఎన్నికల హామీల అమలు కోసం సర్కారుపై పోరాడుతూనే ఉన్నాడు. ఇంకా సూటిగా చెప్పాలంటే సర్కారును వేటాడుతున్నాడు. జగన్‌ ధాటిని.. దాడిని తట్టుకోలేక టీడీపీ తన అఫీషియల్‌ వెబ్‌సైట్‌ నుంచి పార్టీ మేనిఫెస్టోని తొలగించింది అంటేనే ప్రతిపక్ష నాయకుడు జగన్‌ పోరాటాన్ని అర్థం చేసుకోవచ్చు. 

చంద్రబాబు, నరేంద్ర మోడీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని ప్రత్యేక హోదా అంశాన్ని మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అన్న విచక్షణ మరిచి విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం.. అవి కూడా వ్యక్తిగత విమర్శలకు దిగి దిగజారిపోడం మాత్రం హేయం. కనీస సంస్కారం మరిచి ఒకరిమీద ఇంకొకరు చేసుకుంటున్న విమర్శలు వారి ప్రతిష్టనే కాకుండా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులకున్న గొప్పతనాన్ని కూడా తక్కువ చేసేలా వ్యవహరిస్తున్నారు. 

మొన్ననే రూ. 10 కోట్లు ఖర్చు చేసి మరీ ప్రత్యేక రైల్లో టీడీపీ కార్యకర్తలను తరలించి మరీ ఢిల్లీలో దీక్ష చేసి వచ్చాడు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగిన చంద్రబాబే.. మోడీ ఆంధ్రాకి మోసం చేశాడని నేషనల్‌ మీడియా ముందు దుమ్మెత్తి పోసి వచ్చాడు. కానీ నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు మాత్రం.. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందన్న విషయం తెలియదు.  దేశంలో ఎవరైనా ఎక్కడైనా తమ నిరసనను తెలియజేయవచ్చు. అదే ప్రధానమంత్రికి ఉండే విశేష అధికారాల గురించి నాలుగు దశాబ్దాల అనుభవమున్న బాబుకు తెలియకపోవడం విడ్డూరం. ప్రధాని మోడీ గుంటూరు  వస్తుంటే మాత్రం గో బ్యాక్‌ మోడీ.. అని పెద్ద పెద్ద కటౌట్‌లు ఏర్పాటు చేయడం హాస్యాస్పదం. కనీసం ఆయా కటౌట్‌ల మీద బాధ్యుల పేర్లు కూడా లేకపోవడం చంద్రబాబు తరహా తూతూ మంత్రపు నిరసనకి అద్దం పడుతోంది. బీజేపీతో ఉన్నంత కాలం నరేంద్రమోడీ అంతటోడు దేశంలోనే లేడని  అసెంబ్లీలో బాకా ఊదడం.. ఇంటికి పిలిచి మనవడితో ఆడించడం బాబు మర్చిపోయాడేమో కానీ.. జనం కాదు. ప్యాకేజీ ఇచ్చినందుకు అరుణ్‌ జైట్లీకి అభినందన తీర్మాణం చేయడం.. ప్యాకేజీ వద్దు హోదా మాత్రమే కావాలన్న ప్రతిపక్షాన్ని ఉద్దేశించి.. ప్యాకేజీతో ఏమొస్తుందని, హోదా ఉన్న రాష్ట్రాలు స్వర్గాలైపోతాయా, హోదా ఏమైనా సంజీవనా, నన్ను ఎడ్యుకేట్‌ చేయండని, కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని ఎగతాళిగా మాట్లాడటం.. హోదా కోసం జగన్‌ నిర్వహిస్తున్న యువ భేరి సభలకు వెళితే కేసులు పెట్టడం, విద్యార్థులను వారి తల్లిదండ్రులను వేధించడం.. ఇవన్నీ జనం మర్చిపోలేదు. 

Back to Top