అవ్వాతాతల మోముల్లో ఆనందం 

నవరత్నాలు – 9 

జన్మభూమి కమిటీల దయ ఉంటేనే పింఛన్‌ మంజూరు 

పెరిగిన ధరలతో ఖర్చులకు సరిపోని రూ.1,000 పింఛన్‌ 

 పింఛన్‌ వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తానని భరోసా 

వృద్ధాప్య, వితంతు పింఛన్‌ను   రూ.2,000కు పెంచుతామని హామీ 

వికలాంగులకు రూ.3,000 పింఛన్‌

 అమరావతి :  అన్ని అర్హతలుండీ సామాజిక భద్రత పింఛన్‌ల కోసం లక్షలాది మంది కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అర్హత ఉన్న లక్షలాది మంది వృద్ధులు పింఛన్‌ కోసం మండల, పంచాయతీ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. గతంలో ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఉన్న పాత పద్ధతి పునరావృతమవుతోంది. ఎవరైనా పింఛన్‌దారుడు మరణిస్తేనే ఆ స్థానంలో మరొకరికి పింఛన్‌ మంజూరు చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో లక్షలాది మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తుండగా.. ప్రభుత్వం మంజూరు చేసే పరిస్థితి కనిపించడం లేదు.  

వైఎస్‌ హయాంలో అందరికీ పింఛన్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక్క ఏడాది వ్యవధిలోనే దాదాపు 23 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కొత్తగా పింఛన్లు ఇచ్చిన చరిత్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ది. 2007–08 సంవత్సరంతో పోల్చితే.. 2008–09 సంవత్సరానికి ఒక్క ఏడాదిలోనే దాదాపు 23 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు 2014 సెప్టెంబర్‌ ఆరో తేదీన రాష్ట్ర శాసనసభకు సమర్పించిన కాగ్‌ రిపోర్టులోనే ప్రభుత్వం పేర్కొంది. 2004కు ముందు తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో పింఛనుదారుల్లో ఎవరో ఒకరు చనిపోతేనే ఆ స్థానంలో కొత్త వారికి పింఛన్‌ మంజూరు చేసే పరిస్థితి ఉండగా.. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌ మంజూరు చేయాలని ఆదేశాలు జారీచేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 

దుర్భర జీవితం గడుపుతున్నా.. 
నాకు 75 ఏళ్లు. నా భర్త 40 ఏళ్ల కిందట ఓ ప్రమాదంలో మృతిచెందాడు. నా ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. ప్రభుత్వం ఇస్తున్న రూ.1,000 పింఛన్‌ ఎటూ చాలడం లేదు. పెరిగిన ధరలు, అనారోగ్య సమస్యలకు వాడుతున్న మందులకు పింఛన్‌ నగదు సరిపోక దుర్భర కష్టాలు అనుభవిస్తున్నాను. అయితే పాదయాత్ర చేస్తున్న జగన్‌.. మా లాంటి వృద్ధుల పింఛన్‌ను రూ.2,000కు పెంచుతానని ప్రకటించడంతో చాలా సంతోషమేసింది. పక్కా ఇళ్లు కూడా కట్టిస్తానని చెప్పడంతో నాకు ఈ ఇరుకు ఇంటికి బదులు మంచి ఆసరాదొరుకుతుందని నమ్ముతున్నాను. ఆయన ముఖ్యమంత్రి అయి మా లాంటి
పేదల కష్టాలు తీర్చాలని కోరుకుంటున్నాను.  
– వాసంశెట్టి సుబ్బాయమ్మ, అంగర గ్రామం,కపిలేశ్వరపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా

ఆశలన్నీ రాజన్న బిడ్డమీదే.. 
నిరుపేద రజక కుటుంబంలో పుట్టిన నేను సమస్యలతో సహవాసం చేస్తున్నాను. భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. నాకు నిలువ నీడ లేదు. 50 ఏళ్ల వయసున్న నన్ను కాళ్ల వాపు, థైరాయిడ్, అధిక బరువు, బీపీ సమస్యలు బాధిస్తున్నాయి. ఇంటి పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. చాలీచాలని రూ.1,000 వితంతు పింఛనే నాకు ఆధారం. మందుల ఖర్చులు పెరగడంతో డబ్బులు సరిపోక దుర్భర జీవితం గడుపుతున్నాను. అయితే వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో నాలో ఆశలు చిగురిస్తున్నాయి. రూ.2,000 పింఛన్, ఇంటి సదుపాయం పథకాలతో నా జీవితానికి భరోసా దొరుకుతుందని ఎదురు చూస్తున్నాను. పాదయాత్రగా మా ఊరు వచ్చిన వైఎస్‌ జగన్‌ను కలిసి నా కష్టాలు చెప్పుకున్నాను. అప్పుడు రాజన్న బిడ్డ నాకు ధైర్యం చెప్పారు.. భరోసా ఇచ్చారు. ఆ బిడ్డ చూపిన ఆప్యాయత ఎప్పటికీ మరువలేను. ఆశలన్నీ రాజన్న బిడ్డమీదే పెట్టుకుని బతుకుతున్నాను. 
 – బైనపాలెం పుష్ప, తాటిపాకమఠం,రాజోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా

జగన్‌ రాక కోసం ఎదురుచూస్తున్నా..
నాకు 70 ఏళ్లు.. 30 ఏళ్ల కిందట నా భార్య మృతి చెందింది. నాకు ముగ్గురు కుమార్తెలు.. ఓ కుమారుడు. కుమార్తెలకు వివాహం చేశాను. తీవ్ర అనారోగ్యంతో నా పనులు కూడా నేను చేసుకోలేకపోతున్నాను.నా కుమారుడు బాధ్యత మరవడంతో వాడిని కూడా నేనే సాకాల్సిన పరిస్థితి. రోజు రోజుకూ ఒంట్లో సత్తువ కోల్పోతున్నాను. వృద్ధాప్య పింఛన్‌ రూ.1,000 ఎటూ చాలడం లేదు. భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న దశలో రాజన్న బిడ్డ ప్రకటించిన నవరత్నాలతో నాలో ఆశలు చిగురిస్తున్నాయి. ఆ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక నాకు పింఛన్‌ నగదు పెరుగుతుందని ఆశిస్తున్నాను.  
– కోటి శేషారావు, తాతపూడి,కపిలేశ్వరపురం, తూర్పుగోదావరి జిల్లా

వైఎస్‌ జగన్‌ నవరత్నాల హామీ..
►ప్రస్తుతం ఉన్న వృద్ధాప్య పింఛన్ల అర్హత  వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. 
►వృద్ధాప్య, వితంతువులకు రూ.2000 చొప్పున పింఛన్‌  
►వికలాంగులకు పింఛన్‌ రూ.3,000కు పెంచుతాం. 
►అర్హత ఉన్న కుటుంబానికి
►ఈ పథకంలో ఏడాదికి రూ.24 వేల  నుంచి రూ.48 వేల దాకా లబ్ధి

బాబు ప్రభుత్వ తీరును తప్పుబట్టిన కోర్టు
చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా రాజకీయ కారణాలతో పింఛన్ల తొలగింపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు మూకుమ్మడిగా కోర్టులను ఆశ్రయించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో కోర్టు గడప తొక్కారు. హైకోర్టు సైతం ఒకానొక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టు తీర్పు ద్వారా చాలా మంది పింఛన్లు పొందుతున్న పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది.

చంద్రబాబు సర్కార్‌లో పింఛన్‌లపై ఆంక్షలు 
►వృద్ధాప్య పింఛన్‌కు 60 ఏళ్లు దాటిన వారు అర్హులని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం 65 ఏళ్లు దాటితేగానీ పింఛన్‌కు అర్హులు కాదని నిబంధనపెట్టింది.  
►తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గ్రామ, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు సూచించిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారు. 
► అసలైన అర్హత టీడీపీ
► మద్దతుదారులుగా ఉండటమే. 

Back to Top