మాట‌ల్లో మ‌ర్మం మాకూ తెలుసు!!

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ప‌రువు ద‌క్కించుకోలేక పోయిన నారా లోకేష్ ట్విట్ట‌ర్ లో త‌న అతి తెలివిని ట్వీట్లుగా వ‌దులుతున్నాడు. రాజ్య‌స‌భ‌లో వైసీపీకి చుక్కెదురైంద‌టూ చంక‌లు గుద్దుకుంటున్నాడు. అవినీతి మీకు దొర‌క‌దు అంటూ జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్నాడు. వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రించ‌డంలో టీడీపీ ట్రైనింగ్ కు నారా లోకేష్ ఓ ఉదాహ‌ర‌ణ అనుకోవాలి. రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజ‌య‌సాయి రెడ్డిగారు అడినిదేమిటో, అక్క‌డ కేంద్ర‌మంత్రి ఇచ్చిన స‌మాధానం ఏమిటో ఒక‌సారి గ‌మ‌నిస్తే లోకేష్ వ‌క్రీక‌ర‌ణ ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. రామునితోక పివ‌రుండిట్ల‌నియే అన్న సామెత‌లాగా అక్క‌డ అన్న‌ది ఒక‌టైతే ఇక్క‌డ నారాలోకేష్ వ్య‌క్తీక‌ర‌ణ మ‌రోలా ఉంది. 

త‌మ జ‌మానాలో పోల‌వ‌రంలో అక్ర‌మ‌మే జ‌ర‌గ‌లేద‌ని నారా లోకేష్ ట్వీట్ల‌తోనే న‌మ్మించాల‌నుకుంటున్నారు. రాజ్య‌స‌భ‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డిగారు పోల‌వ‌రంలో జ‌రిగిన అవినీతి గురించి ప్ర‌శ్నించారు. దానికి కేంద్ర మంత్రి స‌మాధానం ఇస్తూ పోల‌వ‌రం ప్రాజెక్టు అవినీతి గురించి మా వ‌ద్ద‌కు ఎలాంటి నివేదిక‌లూ రాలేద‌న్నారు. అంటే దీని అర్థం పోల‌వ‌రంలో అవినీతి జ‌ర‌గ‌లేద‌నా? ఖ‌చ్చితంగా కాదు. మాకు అలాంటి నివేదిక ఏదీ అంద‌లేద‌ని అర్థం. నిన్న‌టిదాకా ఉన్న‌ది ఆ అవినీతిని కోట‌లా క‌ట్టుకున్న ప్ర‌భుత్వ‌మే క‌నుక అలాంటి నివేదిక కేంద్రానికి వెళ్లే అవ‌కాశ‌మే లేదు. ఎన్నిక‌ల‌కు ఆర్నెల్ల ముందు వ‌ర‌కూ టీడీపీ, బీజేపీ మిత్ర‌ప‌క్షాలే. రాష్ట్రంలో బీజేపీ మంత్రులు టీడీపీతో క‌లిసే ప‌నిచేసారు. కేంద్రంలో వెంక‌య్య‌నాయుడుతో స‌హా అంతా చంద్ర‌బాబుకు అనుకూలంగా ప‌నిచేసిన‌వారే. క‌నుకే పోల‌వ‌రం క‌మీష‌న్ల క‌థ‌లు కంచికెళ్లాయి. పోల‌వ‌రం ద‌ర్శ‌నం పేరుతో కోట్ల రూపాయిలు ఖ‌ర్చుల‌య్యాయి. జ‌య‌ము జ‌య‌ము చంద్ర‌న్న పాట‌లు త‌ప్ప పోల‌వ‌రంలో ప‌నులు పావు వంతు కూడా సాగ‌లేదు. ప‌ట్టిసీమ లో అవినీతిని కాగ్ ఎత్తి చూపింది. ఇప్పుడు ప్ర‌భుత్వం మారింది. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతిపై విచార‌ణ జ‌రుపుతున్నారు. పోల‌వ‌రాన్ని ఏటీఎమ్ మిష‌న్ లా వాడుకుని వేల‌కోట్లు దోచుకున్న లెక్క‌ల లోగుట్టు విప్పేందుకు మంత్రివ‌ర్గ ఉప‌సంఘం త‌యారుగా ఉంది. త్వ‌ర‌లో పోల‌వ‌రంలో చంద్ర‌బాబు చేతివాటం లెక్క‌ల‌ను నివేదిక‌గా చేసి కేంద్రానికి పంప‌డం జ‌రుగుతంది. 

అయినా పోల‌వ‌రం నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులు గుట‌కాయ‌స్వాహా అయ్యాయ‌ని, యుటిలైజేష‌న్ ప‌త్రాలు ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే పోల‌వ‌రానికి త‌ర్వాతి నిధులు నిలిపేస్తున్నామ‌ని స్వ‌యంగా ప్ర‌ధానే త‌న నోటితో నిజం చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీసైతం పోల‌వ‌రం ప‌నుల్లో జాప్యం గురించి స్వ‌యంగా వ‌చ్చి ఆరా తీస్తాన‌ని చెప్పారు. నివేదిక రూపంలో కేంద్రానికి చేర‌క‌పోయినా, చంద్ర‌బాబు చేతిలో పోల‌వ‌రం మూల‌న‌ప‌డింద‌న్న సంగ‌తి కేంద్ర‌ప్ర‌భుత్వానికి తెలియ‌క కాదు. ఆ అవినీతిని బ‌య‌ట‌పెట్టే నివేదిక కోస‌మే కేంద్రం సైతం ఎదురుచూస్తోంద‌న‌న్న‌దే కేంద్ర‌మంత్రి మాట‌ల్లోని గూఢార్థం కావ‌చ్చు.

క‌నుక టీడీపీ నాయ‌కులు, ముఖ్యంగా నారా లోకేష్  వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రించి  ట్వీట్లు చేసేముందు ఈ విష‌యాన్ని గుర్తుంచుకుంటే మంచిది. మాట‌ల్లోని ఆంత‌ర్యాలు, మ‌ర్మాలూ ప్ర‌జ‌ల‌కు కూడా తెలుసు అని. 

Back to Top