వేతనాల్లో కోత ఎందుకు వేయాల్సి వచ్చిందంటే..

నారా లోకేష్‌ ఆరోపణలకు మంత్రి బుగ్గన సమాధానం
 

తాడేపల్లి: 2018–19తో పోలిస్తే రాష్ట్రానికి రూ.30 వేల కోట్లు ఆదాయం ఎక్కువ వచ్చింది.  కానీ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాల్లో కోత ఎందుకు వేయాల్సి వచ్చిందని టీడీపీ నేత నారా లోకేష్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమాధానం చెప్పారు.

2018–19లో రూ.1.65 లక్షల కోట్ల ఆదాయం వస్తే.. 2019–20లో రూ.1.70 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా పూర్తి లెక్కలు రావాల్సింది. అంటే రూ.5వేల కోట్లు మాత్రమే ఎక్కువ వచ్చింది.

ప్రభుత్వం చెల్లించిన రూ.6400 కోట్ల లెక్కలు ఇవీ..

1. పేదల ఇళ్ల పట్టాలకు రూ.1505 కోట్లు

2. వృద్ధాప్య పెన్షన్లు : రూ.1380 కోట్లు

3. వర్కింగ్‌ బిల్స్ : రూ.784 కోట్లు
‌( పోలవరం, వెలిగొండలాంటి ప్రాజెక్టుల కోసం) 

4. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ (యూనివర్సిటీలకు):రూ.591 కోట్లు

5. ఏపీ జెన్‌కో : రూ.578 కోట్లు

6. విద్యా దీవెన : రూ.510

7. ఆరోగ్యశ్రీ : 324 కోట్లు

8. నాబార్డు రుణం చెల్లింపుల కోసం : రూ.271 కోట్లు

9. విద్యార్థుల మెస్‌ చార్జీలు : రూ.132 కోట్లు

10. 104,108 మరియు పోలీసు వాహనాల కోసం : రూ.126 కోట్లు

11. ఐటీ డిడక్షన్స్‌ : రూ.107 కోట్లు

12. పారిశుద్ధ్య కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పెండింగ్‌ జీతాలు : రూ.50 కోట్లు

13. టీఏ డీఏ ఫర్‌ స్టాఫ్‌ (పోలీసు, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌): రూ.27 కోట్లు

14. అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం: రూ.26 కోట్లు

మొత్తం రూ.6,414 కోట్లు

 తెలుగు డ్రామా  పార్టీ వాళ్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇలా అబద్ధాలు చెప్పే 23 సీట్లకు దిగజారిపోయారు. ఇంకా అవే అబద్ధాలు చెబితే భవిషత్తులో మూడు సీట్లు కూడా రావడం కష్టమే.  

తాజా వీడియోలు

Back to Top