మాయదారి పచ్చమాయ

నాలిక మడతల బాబు

అవకాశవాదంలో నారావారికి లేదు జవాబు

స్వయంగా తొండిఆటలాడుతూ విమర్శలు

తోడల్లుడిపై అక్కసు

అమ‌రావ‌తి:  చంద్రబాబు టెలీ కాన్ఫరెన్సులు ఎందుకు జరుగుతాయి? అధికారులపై నెపం నెట్టేయడానికి, తెలుగు తమ్ముళ్లకు అవినీతి దిశానిర్దేశం చేయడానికి అంతేనా ఇప్పుడు కొత్తగా ఆయన తన అక్కసు వెళ్లగక్కడానికి కూడా ఇదే టెలీకాన్ఫరెన్సును వేదికగా చేసుకుంటున్నారు. తాజాగా ఇవాళ జరిగిన టెలీకాన్ఫరెన్సులో బాబు తన ఉక్రోషాన్నంతా వెళ్లగక్కాడు. తన తోడల్లుడు, ఎన్టీరామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై చిర్రుబుర్రులాడుతున్నాడు.  వైయ‌స్ జగన్ మోదీ కలయిక వెనుక ప్రధాని నరేంద్రమోదీ ఉన్నాడంటూ వగలు పోతున్నాడు. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైయ‌స్ఆర్‌సీపీలో చేరిందన్న చంద్రబాబు స్వయంగా తననోటితో తానే వైయ‌స్ జగన్ గెలుపు తథ్యమన్న వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. మడతేసే నాలుకతో, మాయదారి మాటలతో మోసకారి బాబు చేసే పచ్చమాయలో ఒకటి దుష్ప్రచారం. నేడు సొంత తోడల్లుడిపైనా అదే తరహాలో అక్కసు వెళ్లగ‌క్కుతున్నాడు చంద్రబాబు. 
నీ గతమేమిటి చంద్రబాబూ??
పార్టీలు మారడం అనే విషయం గురించి ప్రస్తావించేటప్పుడైనా చంద్రబాబుకు తాను పుట్టిన పార్టీ కాంగ్రెస్సే అన్న విషయం గుర్తుకు రాలేదో లేక రానట్టు నటించారో తెలియదు. కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేస్తున్నప్పుడే దానికి బద్ధ శత్రువులా ఉన్న టీడీపీ అధినేత కూతురును పెళ్లి చేసుకున్నాడు చంద్రబాబు. ముందు పార్టీ మారనంటూ ప్రగల్బాలు పలికి, చివరకు ఓడిపోగానే వెళ్లి మామ‌ ఎన్టీఆర్ కాళ్లమీద పడ్డాడు. వెన్నంటి వినయంగా నటిస్తూ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఉసిగొల్పి మామపైనే తిరుగుబాటు చేసాడు. సమయం చూసుకుని సాయం చేసిన మామ‌కే వెన్నుపోటు పొడిచాడు. అవకాశం ఇచ్చిన పార్టీనే హస్తగతం చేసుకున్నాడు. ఇలాంటి నీచమైన చరిత్రను వెనుక పెట్టుకుని ఇతరులను వేలెత్తి చూపడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. ఇక నిన్నగాక మొన్న అదే కాంగ్రెస్ తో చెట్టాపట్టాలేసుకుని తెలంగాణాలో తిరిగి బొక్కబోర్లా పడ్డ సంగతి కూడా మూన్నాళ్ల ముచ్చటేం కాదు. ఏపీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో కలిసే టీడీపీ ఉంటుందని బాబు వైఖరి వల్ల స్పష్టంగా తెలుస్తోంది. 
ఇన్నాళ్లూ లేని విమర్శ 
దగ్గుబాటి కుటుంబం బిజేపీ, కాంగ్రెస్‌లో ఉండటం నిన్నటి దాకా చంద్రబాబుకు తప్పు అనిపించ లేదు. నేడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారు కాగానే వారి కుటుంబం మొత్తంపై విమర్శలు గుప్పిస్తున్నాడు బాబు. బీజేపీతో నాలుగేళ్లు అంటకాగినప్పుడు, కాంగ్రెస్ తో పొత్తులకు చేరినప్పుడు దగ్గుబాటి కుటుంబాన్ని పల్లెత్తు మాట అనని నారా నాయుడు నేడు వారిపై ఆరోపణలతో విరుచుకుపడుతున్నాడు. తనకు ఉపయోగం అనుకుంటేనే స్వంత కుటుంబాన్నైనా వెనకేసుకు వస్తాడు కానీ వ్యతిరేకం అయితే ఎవ్వరిపైనైనా బురద జల్లడానికి బాబు వెనుకాడడు అంటూ ఆయ‌న‌ తీరును స్వంత పార్టీ నేతలే ఛీదరించుకుంటున్నారు.  
బాబు అవసరాలన్నీ చారిత్రకమే
కాపులకు రిజర్వేషన్ చారిత్రక అవసరం అంటాడు చంద్రబాబు. అందుకేనేమో పార్లమెంటుకు బిల్లు పంపానని ప్రజలముందు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పాడు. చంద్రబాబు తానాడే అబద్ధాలను కూడా చారిత్రక అవసరం అనే చెప్పగలడు. అంతా లోకకళ్యాణం కోసమే అన్నట్టు తన స్వార్థం అంతా ఇతరుల సంతోషం కోసమే అని అనగలడు. కాపు రిజర్వేషన్ల విషయంలో ఆ సామాజిక వర్గాన్ని దారుణంగా మోసం చేసిన తర్వాత కూడా మళ్లీ అదే కల్లబొల్లి మాటలను వల్లెవేస్తున్నాడు. పదే పదే అదే అబద్ధం చెబితే ప్రజలు నమ్ముతారనుకోవడం బాబు భ్రమే. కాపుల విషయంలో తన వైఖరిని స్పష్టంగా చెప్పిన ప్రతిపక్ష నేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని కాపు రిజర్వేషన్ వ్యతిరేకిగా చిత్రించాలని చంద్రబాబు నానా పాట్లూ పడుతున్నాడు. కానీ కాపుల అడ్డాలోనే వైయ‌స్ జగన్ నిజాయితీగా వారికి చేసేవేమిటో, సాధ్యం కానివేమిటో విడమరచి చెప్పి వారి మనసులు గెలుచుకున్నారు.

అబద్ధపు హామీలు ఇవ్వనని, రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోనివి కనుక వాటిపై హామీ ఇవ్వలేనని స్పష్టంగా చెప్పారు యువనేత. కానీ కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని మాటిచ్చారు. పారదర్శకమైన విధానాలు అనుసరించి కార్పొరేషన్ ద్వారా అర్హులకు, పార్టీలకు అతీతంగా అందరికీ చేయూత ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరానికో అబద్ధం ఆడి, ఆనక దాన్ని ఆచరణలో చేయని చంద్రబాబు కంటే వాస్తవాన్ని నిక్కచ్చిగా చెప్పినందుకు వైఎస్ జగన్ వెంటే ఉంటామంటూ చెప్పారు కాపు సామాజిక వర్గ ప్రజలు. భారీగా తరలి వచ్చి తమ మద్దతును తెలిపారు. 

 

Back to Top