మనసున్న మారాజు ..వైయ‌స్ జగన్‌

తెనాలిలో అనారోగ్య బాధితుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా

వైద్యానికి అయ్యే ఖర్చు మంజూరు చేయాలని కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డికి ఆదేశం

గుంటూరు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌న‌సున్న మారాజు అని మ‌రోసారి రుజువైంది. తెనాలి పర్యటనలో అనారోగ్య బాధితులను కలిసి నేరుగా వారి సమస్యలను తెలుసుకుని అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులతో మాట్లాడి అవసరమైన సాయం చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి

 థ‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్న బుల్లా కార్తీక్‌

గుంటూరు జిల్లా కంచర్లపాలెంకు చెందిన బుల్లా కార్తీక్‌ (13 సంవత్సరాలు) థలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స నిమిత్తం రూ. 26 లక్షలు అవసరమని డాక్టర్లు సూచించారు. సీఎంఆర్‌ఎఫ్‌ క్రింద తన కుమారుడికి సాయం చేయాలని ముఖ్యమంత్రిని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. దీంతో కార్తీక్‌కు అవసరమైన పూర్తిసాయాన్ని సీఎంఆర్‌ఎఫ్‌ కింద చేయాలని సీఎం ఆదేశించారు.  

 దామర్ల చంద్రశేఖర్ పుట్టుక‌తోనే మూగ‌, చెవిటి

గుంటూరు జిల్లా ముత్తంశెట్టి పాలెంకు చెందిన దామర్ల చంద్రశేఖర్‌ పుట్టుకతోనే మూగ, చెవిటి, 10 వ తరగతి వరకు చదువుకున్నాడని, తన అర్హతల మేరకు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని అతని తల్లి సీఎంని కోరారు. దీంతో సీఎం ఆమెకు రూ. 2 లక్షల ఆర్ధిక సాయంతో ఏదైనా చిరు వ్యాపారం చేసుకునేలా ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు.

 కందుల అహల్య, కందుల అమూల్య..ఇరువురూ విక‌లాంగులు

తెనాలి ఐతానగర్‌కు చెందిన అహల్య, అమూల్య ఇరువురూ వికలాంగులని, వారి చికిత్స నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్‌ కింద ఆర్ధిక సాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. వారికి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం, స్పెషలిస్ట్‌ డాక్టర్లతో అవసరమైన వైద్యచికిత్సలు చేయించాలని సీఎం సూచించారు. 

 పోలియో బాధితురాలు కొల్లూరు ఝాన్సి

బాపట్ల జిల్లా అమర్తలూరుకు చెందిన ఝాన్సి పోలియో బాధితురాలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. గత 10 సంవత్సరాలుగా చికిత్స పొందుతూ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సీఎంఆర్‌ఎఫ్‌ కింద తనకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు తనకు పెన్షన్‌ కూడా పెంచాలని కోరడంతో ఝాన్సికి రూ. లక్ష బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని, పెన్షన్‌ కూడా పెంచాలని సీఎం ఆదేశించారు.

 అగ్రి ప్ర‌మాదంలో రెండు కాళ్లు పోగొట్టుకున్న పమిడిపాడు హదస్సా

బాపట్ల జిల్లా చంపాడుకు చెందిన హదస్సా (8 సంవత్సరాలు) ఆగ్ని ప్రమాదంలో రెండు కాళ్ళు తీవ్రంగా కాలిపోయినట్లు, తమ కుమార్తె ఇబ్బందిని ఆమె తల్లిదండ్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.  ఇప్పటివరకు రూ. 3 లక్షలు ఖర్చుపెట్టామని, తమకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వారు చికిత్సకు ఖర్చుపెట్టిన సాయాన్ని రీఇంబర్స్‌ చేయడంతో పాటు మిగిలిన చికిత్సకు అయ్యే ఖర్చులను కూడా సీఎంఆర్‌ఎఫ్‌ కింద సాయం చేయనున్నట్లు సీఎం చెప్పారు. 

 గడిబోయిన శివలక్ష్మి బ్ల‌డ్ క్యాన్స‌ర్ చికిత్స‌కు..

పల్నాడు జిల్లా గుండ్లపల్లి గ్రామానికి చెందిన శివలక్ష్మి బ్లడ్‌ కాన్సర్‌ చికిత్సకు రూ. 16 లక్షలు ఖర్చుపెట్టగా సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ. 11 లక్షలు మంజూరు చేశారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక ఇతర అనారోగ్య సమస్యలకు అవసరమైన సాయం చేయాలని కోరగా స్పందించిన సీఎం మిగిలిన రూ. 5 లక్షలు మంజూరు చేయడంతో పాటు అవసరమైన పూర్తి ఆర్ధిక సాయం చేయాలని అదేశించారు

 మెట‌బాలిక్ బేరియాట్రిక‌త్‌తో బాధ‌ప‌డుతున్న గోవాడ సురేష్‌కుమార్‌

కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కొత్తపూడికి చెందిన సురేష్‌కుమార్‌ మెటబాలిక్‌ బేరియాట్రిక్, గాల్‌బ్లాడర్‌లోని రాళ్ళకి సంబందించిన శస్త్రచికిత్స నిమిత్తం రూ. 15 లక్షలు ఖర్చు అవుతాయని, సీఎంఆర్‌ఎఫ్‌ కింద తనకు సాయం చేయాలని కోరారు. సురేష్‌కుమార్‌ వైద్యానికి అవసరమైన స్పెషలిస్ట్‌ డాక్టర్లతో చెకప్‌ చేయించి అవసరమైన వైద్యసహాయానికి అయ్యే ఖర్చును సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

 కర్నాటి వెంకట నాగమణి రెండు కిడ్నీలు..

ఏలూరు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన నాగమణి తన కుమార్తె రెండు కిడ్నీలు పాడయ్యాయని, చికిత్స నిమిత్తం రూ. 25 లక్షలు ఖర్చు అయినట్లు, ఇంకనూ రూ. 10 లక్షలు అవసరమని, సీఎంఆర్‌ఎఫ్‌ కింద తనకు సాయం చేయాలని కోరడంతో ఆమె కుమార్తెకు అవసరమైన రూ. 10 లక్షలు సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరు చేయాలని, ఇప్పటివరకు అయిన ఖర్చులు కూడా రీఇంబర్స్‌చేయాలని సీఎం ఆదేశించారు

 బిక్కి కమలకుమారి కుటుంబ సమస్య

తెనాలి మండలం పెదరావూరుకు చెందిన కమలకుమారి తన భర్త నుంచి విడిపోయి తన తల్లితో కలిసి ఉంటున్నట్లు తన కుటుంబ సమస్యను సీఎంకి వివరించింది. ఆమెకు రూ. 2 లక్షలు బ్యాంకులో డిపాజిట్‌ చేయడంతో పాటు ఒంటరి మహిళ పెన్షన్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 

సీఎం స్పందనతో బాధిత కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. తమ సమస్యపై ఇంత త్వరగా ముఖ్యమంత్రి గారు స్పందించడం జీవితాంతం మరువలేమన్నారు. 

Back to Top