టీడీపీ ఆగడాలకు లోకేష్‌ శ్రీకారం 

అమ‌రావ‌తి: అసెంబ్లీ ఎన్నికలే తెలుగుదేశం అధినేతకు, ఆయన కుమారుడికి పగలూ రాత్రీ కనిపిస్తున్నాయట. శాసససభ ఎన్నికలకు 20 నెలల సమయం ఉండడంతో తండ్రీకొడుకులిద్దరూ ఏదో ఒక సాకుతో ఆందోళనకు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. సాధారణ పరిపాలనకు సంబంధించిన చిన్న విషయాలను సైతం  సమస్యలుగా చూపించి టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ తన పార్టీ సహచరులతో కలిసి రాజకీయ వీధి యుద్ధాలకు సిద్ధమౌతున్నారు. రాష్ట్రంలో గత మూడేళ్లకు పైగా ప్రశాంతంగా ప్రగతిపథంలో నడుస్తున్న వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సరైన కారణం లేకుండా రాళ్లేయడానికి లోకేష్‌ అండ్‌ కంపెనీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనికి చక్కని ఉదాహరణ శ్రీకాకుళం జిల్లా పలాసలో అలజడి సృష్టించడానికి వారు చేస్తున్న హడావుడి. పలాస మునిసిపాలిటీ పరిధిలోని ఒక కాలనీలో అక్రమ నిర్మాణాలను కోర్టు ఆదేశాల ప్రకారం తొలగించడానికి ప్రభుత్వాధికారులు చేసిన ప్రయత్నాన్ని ‘బ్రహ్మాస్త్రం’గా మార్చుకోవాలని తెలుగుదేశం పథకం రచించింది. దాన్ని అమలు చేసే బాధ్యతను లోకేష్‌ కు అప్పగించింది. టీడీపీ సృష్టిస్తున్న అరాచకాలను ప్రభుత్వ యంత్రాంగం అనుమతించకపోవడంతో ‘ఆందోళన బాట’లో చినబాబు విశాఖపట్నం వరకు వచ్చేశారు. అంతటితో ఆగక టీడీపీ అనుకూల మీడియా తోడ్పాడుతో ఓ గొప్ప ప్రజాందోళన నిర్వహించినట్టు స్థానిక ప్రజలకు ఓ చిన్న సినిమా చూపించారు.
పలాస పేరుతో జగన్‌ ప్రభుత్వంపై లోకేష్‌ విసిరే బురద సొంత పార్టీపైనే పడుతోంది!
పలాస పురపాలకసంఘం పరిధిలో ‘అర్ధరాత్రి కూల్చివేతలు, అక్రమ అరెస్టులు’ అంటూ– ఉత్తరాంధ్రలో కొడుకు లోకేష్, ఆయన భజనబృందం, అమరావతిలో తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారూ కొన్ని రోజులుగా వేస్తున్న వీరంగాలు కేవలం నాటకాలే. వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రలో చట్ట విరుద్ధంగా తీసుకుంటున్న అక్రమ చర్యలు ఏవీ లేవు. ‘జనం తరఫున పోరాడుతున్న’ ప్రధాన ప్రతిపక్షం నేతలను అప్రజాస్వామికంగా ఎక్కడా అణచివేయలేదు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రలో నిప్పురాజేసి దాన్ని రాష్ట్రమంతటా అంటించడానికి తెలుగుదేశం చేసిన ప్రయత్నం పారలేదనేది మాత్రమే ఇక్కడ వాస్తవం. విశాఖపట్నాన్ని రాష్ట్ర పాలనా రాజధానిగా చేయడాన్ని తెలుగుదేశం సర్వశక్తులూ ఒడ్డి అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు ప్రజలకు తెలియనివి కావు. అందుకే, చిన్న అంశాన్ని పట్టుకుని చంద్రబాబూ, ఆయన సుపుత్రుడూ –రాష్ట్ర ప్రభుత్వం, పాలకపక్షానికి వ్యతిరేకంగా ‘మహా ఉద్యమం’ నిర్మించడానికి ఎక్కడ లేని ఎత్తుగడలతో రంగంలోకి దిగుతున్నారు. వారి ఆటలు సాగడం లేదనే దుగ్ధతో తండ్రీకొడుకులు అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజానీకం తెలుగుదేశం ఆగడాలకు తమ నేలను ప్రయోగశాలగా మార్చడానికి అనుమతించరని ఈ పార్టీ నేతలు ఇకనైనా గ్రహించాలి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top