’కుల’ కురుక్షేత్రానికి కారకుడు చంద్రబాబే

కాపు ఓట్లను చీల్చేందుకు పవన్ ను వాడుకున్న చంద్రబాబు, ఇప్పుడు క్రైస్తవుల ఓట్లు చీల్చేందుకు పాల్ ను తెరపైకి తెచ్చాడు. ఎస్సీ, ఎస్టీ ఉపకులాల్లోనూ, బీసీలకు, కాపులకు మధ్యన చిచ్చులు రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటాడు.

జగన్ కుల చిచ్చు పెడుతున్నాడని చంద్రబాబు, ఆయన ఏడుపును పంచుకుని కన్నీళ్లు పెడుతున్న కుల గజ్జి పత్రికలు 1983 నుంచీ జరుగుతున్న కుల’పచ్చ’పాతం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే బాబుకు తాన తందానా వాయిస్తున్న భజన మీడియా అంతా చౌదరనాయుడ వర్గమే కనుక. కులానికో హామీ, ఉపకులానికి చెందిన నాయకుడికి ఒక కానుక, కులాని రిజర్వేషన్, కార్పొరేషన్ పేర్లతో కుల చిచ్చులు పెట్టిందే చంద్రబాబు. ఇదిప్పుడు జాఢ్యమై కూర్చుంది. ఏ కులానికెంత ఇస్తున్నారు? ఏం ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న ప్రశ్నలు మొదలైపోయాయి.

ఏ పార్టీ అయినా ఆ ప్రాధాన్యతా క్రమం చెప్పకుండా ఓట్లు అడగలేని పరిస్థితి దాపురించింది అంటే అందుకు కారణం ఖచ్చితంగా చంద్రబాబే. 
గత ఎన్నికల్లో బిజేపీ పొత్తుకోసం వెంపర్లాడి, వెంటపడి మోదీ కలిసి, పవన్ ను కౌగిలించుకుని వచ్చాడు చంద్రబాబు. అందుకే అప్పుడు ముస్లిం వర్గాలను పక్కన పెట్టాడు. కాపు రిజర్వేషన్ అంశం పెట్టి బీసీలకు, కాపులకు మధ్య వైరం పెట్టాడు. నంద్యాల ఉప ఎన్నిక రాగానే నౌమాన్ ని ఉర్దూ అకాడమీ ఛైర్మన్ గా, నాలుగేళ్లుగా మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కన పెట్టిన ఫరూక్ శాసన మండలి ఛైర్మన్ ఇచ్చాడు. ఇక సాధారణ ఎన్నికలు సమీపంలోకి వచ్చాక ఫరూక్ ను మంత్రిమండల్లోకి తీసుకున్నాడు. ఎమ్మెల్సీ షరీఫ్ కు శాసన మండలి ఛైర్మన్ ఇచ్చాడు. అంటే ఎన్నికలు వస్తే తప్ప బాబుకు ముస్లింలు గుర్తురారు.

కాపు ఓట్లను చీల్చేందుకు పవన్ ను వాడుకున్న చంద్రబాబు, ఇప్పుడు క్రైస్తవుల ఓట్లు చీల్చేందుకు పాల్ ను తెరపైకి తెచ్చాడు. ఎస్సీ, ఎస్టీ ఉపకులాల్లోనూ, బీసీలకు, కాపులకు మధ్యన చిచ్చులు రగిల్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటాడు. తాజాగా కేంద్రం ఇచ్చిన అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లలో 5శాతం కాపులకిస్తానని చెబుతూ మరో నాటకంతో కుల సమరం రేపుతున్నాడు. 
అంబేద్కర్ గారు చెప్పినట్టు రెండు వర్గాల మధ్య పోరాటం జరిగితే జయాపజయాలు నిర్ణయం అవుతాయి. అదే ఒకే వర్గం మధ్య పోరాటం జరిగితే అది ఆ వర్గం నాశనానికి దారి తీస్తుంది అని. అలాంటి నాశనాలతో తన రాజకీయ క్రీడను ఆడుతున్న చంద్రబాబుకు చేటుకాలం దగ్గరలో ఉంది. కులాలతో కురుక్షేత్రం చేస్తున్న చంద్రబాబు ఆటలకు అడ్డుకట్ట వేసేందుకు 2019 ఎన్నికల్లో ప్రజలంతా సిద్ధంగా ఉండాలి. 

 

Back to Top