కిరికిరిబాబు హామీల కథ 2

మంత్రదండం తిప్పి రాయలసీమలో కరువు పోయిందీ

శ్రీకాకుళంలో తుఫాను ఆగింది

హిందూ మహాసముద్రం కంట్రోల్ అయ్యింది

ఈ మూడు నెలలూ  మూడు దఫాలుగా 10,000 ఇస్తా అన్నాడు

చంద్రబాబు అరచేయి చాచి అందులో స్వర్గం కనిపిస్తోంది చూడండి అంటాడు. మంత్రదండం తిప్పి రాయలసీమలో కరువు పోయిందీ, శ్రీకాకుళంలో తుఫాను ఆగింది, హిందూ మహాసముద్రం కంట్రోల్ అయ్యింది అంటాడు. ఇన్ని చేయగల నేను ఇంకెన్నైనా చేస్తా చూడండి అంటాడు. బాబు చెప్పే అలాంటి డాబు మాటలు, షరాబు కోతలు ఏమిటో తెలుసుకోండి. 
డ్వాక్రాలకు మరో మోసం
పసుపు కుంకుమ కింద 10,000 డ్వాక్రా మహిళలకు అన్నాడు చంద్రబాబు. నిజమే అనుకున్నారు పాపం అక్కచెల్లెమ్మలు. తీరా 5 ఏళ్లు ఆ ఊసే ఎత్తలేదు. ఎన్నిలకలు ముచ్చటగా మూడు నెలల్లో ఉన్నాయి. ఇక ఆడవాళ్ల నోళ్లలో తన పేరే నానాలి. తన గురించే ఊరూరా మాట్లాడుకోవాలి. ఇదీ చంద్రబాబు టార్గెట్. అందుకే డ్వాక్రా మహిళలందరినీ పిలిచాడు. పదివేలూ అందుకుందామని ఆశగా వచ్చిన మహిళలకు తన కంత్రీ ప్లాన్ వివరించాడు. ఈ మూడు నెలలూ మీకు మూడు దఫాలుగా 10,000 ఇస్తా అన్నాడు. ఫిబ్రవరి మొదటి వారంలో 2500, మార్చి రెండో వారంలో 3500, ఏప్రిల్ మొదటి వారంలో 4000 ఇస్తానని కావాలంటే నమ్మకం కలిగేందుకు పోస్టు డేటెడ్ చెక్కులు పంచుతానని చెప్పుకొచ్చాడు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నా బాబు చెప్పిన మాటలు ఎవ్వరూ నమ్మరని బాబుకు కూడా తెలుసు. తాజాగా తెలిసిన సమాచారం ఏమిటంటే బాబు ఇస్తున్న ఈ పసుపు కుంకాల 10,000 ఉచితం కాదు, అది కూడా అప్పే. డ్వాక్రా సంఘాలకు ఇచ్చే అప్పుగానే ఇది పరిగణిస్తామని జీవోలో వివరంగా రాసుంది. అంటే బాబు చెప్పిన పసుపు కుంకుమ హామీ కూడా పచ్చి అబద్ధం. పరమ దగా అన్నమాట. తాను చేసిన సంక్షేమ కార్యక్రమాలో, నెరవేర్చిన హామీలో చెప్పి ఓట్లు అడిగే అవకాశం చంద్రబాబుకు ఏమాత్రం లేదు. కనుకే రకరకాల తయిలాలిచ్చి, మళ్లీ ఓటేస్తే ఇంకేదో చేస్తాఅని చెప్పి, జగన్ హామీలను కాపీలు కొట్టి ప్రజల్లోకి వెళుతున్నాడు. కానీ ఇవేవీ బాబును 2019లో కాపాడలేవన్నది నగ్నసత్యం. 
గత హామీల గతి ఏమిటి?
మహిళలకు 2014లో బాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ నెరవేరలేదు. బేషరతుగా డ్వాక్రా సంఘాల రుణమాఫీ అన్నాడు. కానీ డ్వాక్రా రుణమాఫీ జరగలేదు. ఈవిషయాన్ని టీడీపీ మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో కన్ఫం చేసింది. కొందరికైనా మాఫీ అయ్యింది అని కప్పిపుచ్చుకునే అవకాశమే లేకుండా, డ్వాక్రా రుణమాఫీకి ప్రభుత్వం ఎలాంటి నిధులూ కేటాయించలేదని స్పష్టంగా ఆమె శాసన సమావేశాల్లో చెప్పడం విశేషం. ప్రతి మహిళా సంఘానికీ వడ్డీలేకుండా లక్ష రూపాయిల ఆర్థిక సాయం అన్నాడు. ఎవ్వరికీ చేయలేదు. కుటీర లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు శిక్షన, ఆర్థిక సహాయం, పారిశ్రామిక వాడల ఏర్పాటు హామీ ఏమైందో తెలియదు. మహాలక్ష్మి పథకం ద్వారా పుట్టిన ఆడబిడ్డకు రూ. 30,000 అకౌంట్లో వేసి, పెళ్లి నాటికి రూ.2లక్షలు అందచేస్తానన్నాడు. పండంటిబిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీలకు పౌష్టిక ఆహారం, డెలివరీ సమయానికి 10,000 అందజేస్తా అన్నాడు. వీటిలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. పేరు గొప్ప ఊరుదిబ్బ అన్న చందంగా బాబు ఇచ్చే హామీలు బ్రహ్మాండంగా అమలు అధ్వాన్నంగా ఉంటుందని మహిళలు అర్థం చేసుకుంటున్నారు. 
 

Back to Top