కిరికిరిబాబు హామీల కథ 3

అనుభవం రెండంకెల్లో

నైతిక విలువ, మాటమీద నిలబడే తత్వం, నిజాయితీల్లాంటివి సున్నాకంటే తక్కువ

ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ భృతి ఇస్తా అని ఆశ పెట్టాడు

 

మాటల్లో మాయాజాలం, ప్రచారంలో ఆర్భాటం, నయవంచనను కూడా నైస్ గా నమ్మించే గారడీ వీటితోనే బాబు ఇన్నేళ్లుగా రాజకీయాను చేస్తున్నాడు. ప్రజలను ఏమారుస్తున్నాడు. అనుభవం రెండంకెల్లో ఉన్నా, నైతిక విలువ, మాటమీద నిలబడే తత్వం, నిజాయితీల్లాంటివి సున్నాకంటే తక్కువ. రాజకీయ దిగజారుడుతనంలో ఎవ్వరిలోనూ చూడనంత ఎక్కువ. ఇలాంటి బాబు నిరుద్యోగులను ఆదుకుంటా, ఉద్యోగాలు కుప్పలు పోస్తా, నిరుద్యోగభృతి ఇస్తా అని చెప్పాడు. చెప్పి ఏం చేసాడో చూడండి. 
నాలుగేళ్లుగా నానబెట్టి
లక్షలాదిగా ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తా అన్నాడు చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో. అంతేనా 15ఏళ్లు ప్రత్యేక హోదా నా పాకెట్ లో ఉంది. ఎందుకంటే బీజీపీ నా పక్కనే ఉంది. వెంయ్యనాయుడు చెప్పాడంటే మనకిక తిరుగేముందీ అని ప్రగల్బాలు పలికాడు. ఇక పరిశ్రమలు తేవడంలో, ఐటీని రాకెట్ లా దూసుకుపోయేలా చేయడంలో, లక్షల ఉద్యోగాలు కల్పించడంలో నాకు లేరు సాటి అని కూడా చెప్పుకున్నాడు. జాబు రావాలంటే బాబు రావాలి అని చెవులో ఇల్లు కట్టి పోరాడు. ఉద్యోగం వచ్చేదాకా కుటుంబం మీద ఆధారపడుకుండా నిరుద్యోగ భృతి ఇస్తా అని కూడా ఆశపెట్టాడు. నమ్మిన నిరుద్యోగులు, యువత ఓట్లేసారు. అధికారంలోకి వచ్చిన బాబు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. హోదా సంజీవనా, హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని మాట మార్చాడు. అయిపోయాయి ఎంఓయూలు, అవిగో కంపెనీలు, ఇవిగో ప్రారంభోత్సవాలు, ఇక్కడే ఉన్నాయి లక్షల ఉద్యోగాలు అని నమ్మబలికాడు. చూడబోతే నిరుద్యోగం అలాగే ఉంది. రాష్ట్రం అలాగే ఉంది. ప్రభుత్వోద్యోగాల్లో భర్తీ లేదు. ఉన్న ఉద్యోగాలకు కోత. ఉద్యోగులకు ఊస్టింగులు. ఇక ఇంటికో ఉద్యోగమిస్తానని రాజధాని రైతులనూ నమ్మించి 30,000 ఎకరాలను చుట్టబెట్టి, విదేశీ కంపెనీలకు, రియలెస్టేటుకూ కట్టబెట్టేస్తున్నాడు. అప్పులు పుట్టకపోతే తాకట్టులు పెట్టేస్తున్నాడు. ఇక నిరుద్యోగంలోనే మగ్గుతున్న యువత కనీసం రెండు వేల భృతి అన్నా ఇమ్మంటే ఇదుగో లోకేష్ ఇస్తాడని ఆరునెల్ల కింద అన్నాడు. ఆరున్నొక్క కొర్రీలు పెట్టి భృతిలో సగం అడ్డంగా కోసేసాడు. 
బూజు పట్టిన భృతి
ఐదేళ్ల కిందట ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని ఇన్నేళ్లూ మురగబెట్టి ఎన్నికలకు దగ్గరపడ్డాక ఇప్పుడు ఇస్తానని ప్రకటించాడు బాబు. అర్హతల వడపోతలో సగం మందికి కొర్రి పెట్టాడు. భృతిలోనూ సగం కోసేసి 1000 మాత్రమే అన్నాడు. పసుపు జెండా మోసే అభ్యర్థులకే తొలి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇవన్నీ దాటుకుని ఎవరైనా నిరుద్యోగభృతి అందుకోవాలన్నా ఇవిగో సవాలక్ష నిబంధనలు, భృతిని ఎగరగొట్టేందుకు బోలెడు లొసుగులు పెట్టాడు. భృతి కావాలంటే ముందు రిజిస్టర్ చేసుకోవాలి. నానా తంటాలు పడి రిజిస్ట్రేషన్ చేసుకున్నా డబ్బులు ఎక్కౌంట్ లో పడుతున్నాయో లేదో తెలియని పరిస్థితి. దానిగురించి యుఐడిఎఐ (ఐఈఅఐ) పోర్టల్ లో చెక్ చేసుకోవాలి. యుఐడిఎఐ పోర్టల్ లో ఏ బ్యాంక్ అక్కౌంట్ తో లింక్ ఉంటే దానికే 1000 డిపాజిట్ అవుతుంది. ఒకవేళ అది వాడుకలో లేకపోతే పడిన భృతి కాస్తా పెనాల్టీగా కట్ అయిపోతుంది. పోర్టల్ లో డిగ్రీ, పీజీ ఉన్నా సరే లేదని చూపడం మరో సమస్య. దాని గురించి గ్రీవెన్స్ లో అర్జీ పెట్టుకుంటే అప్రూవ్ అవ్వడానికి తాతలు దిగిరావాలి. ఓపెన్ యూనివర్సిటీ, పక్క రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో చదివిని వారికి ఇతర అర్హతలున్నా భృతి రాదు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం చేసిన ప్రజాసాధికార సర్వే ప్రకారం అర్హతలు నిర్ణయిస్తున్నారు. అప్పట్లోనే అవి తప్పుల తడకలని బయటపడ్డాయి. ఆ సర్వేలో తప్పులను సరిదిద్దుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కూడాలేదు. వాటిని ఉపయోగించే పథకాలు, స్కీముల్లో కోతలు విధించేసారని గొల్లుమన్నారు ప్రజానీకం. ఇప్పుడు దాని ఆధారంగానే నిరుద్యోగభృతికి అర్హతను నిర్ణయిస్తున్నారు. యువనేస్తం పోర్టల్ లో ఓపీటీ అవుట్ (్ౖకఖీ ్ౖఖఖీ) అనే ఆప్షన్ పెట్టారు. పొరపాటున ఇది నొక్కితే ఇక భృతి రానేరాదు. ఎంతో అవసరంలో ఉన్నవారే కదా రూ.1000 కోసం ఎంతో కష్టపడి అప్లై చేసుకుంటారు. మరి అందులో అవి కట్ట అయిపోయే ఆప్షన్ పెట్టాల్సిన అవసరం ఏమిటి? నిరుద్యోగ భృతి అని చెప్పినప్పుడు ఇన్ని దరిద్రపుగొట్టు ఆంక్షలు ఉంటాయని చెప్పలేదు. 12 లక్షల మందికి భృతి ఇస్తానని చెప్పాడు. తర్వాత 3.5 లక్షల మంది అర్హులు అన్నాడు. అందులోనూ ఇలాంటి దిక్కుమాలిన లొసుగులు పెట్టి లబ్దిదారుల్లో కోత పెట్టారు. ఇస్తానన్న దాంట్లోనూ కొర్రిపెట్టి, ఇచ్చేవాళ్ల సంఖ్యనూ కోత పెట్టి గొప్పగా చెప్పుకుంటున్న నిరుద్యోగభృతి నిప్పునాయుడు, పప్పునాయుళ్లకు మేమే ఇస్తాం...కాస్త ఎదురుచూడండి...ఎన్నో ఏళ్లు కాదు మూడు నెలల్లోనే అంటున్నారు ఆగ్రహంతో నిరుద్యోగులు. 
 

Back to Top