జై కిసాన్ జై జగన్

ఏపీలో వ్య‌వ‌సాయానికి మంచి రోజులు

మొట్ట‌మొద‌టి కేబినెట్ మీటింగ్‌లోనే రైతు భ‌రోసాపై నిర్ణ‌యం

సీఎం అధ్య‌క్ష‌త‌న వ్య‌వ‌సాయ మిష‌న్ ఏర్పాటు

కౌలు రైతుల‌కు కొత్త ప్ర‌భుత్వం అండ‌

లండన్ లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన యువకుడు. ఎన్నో వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహించిన పారిశ్రామికవేత్త. రైతుల గురించి ఎంతో సూక్ష్మంగా ఆలోచిస్తాడని ఎవ్వరైనా కలలో కూడా ఊహించి ఉండరు. టెక్నాలజీ గురించి కాక మట్టి, మనుషులు, కష్టాల గురించి మాట్లాడే యువ నాయకుడిని చూసి ఉండరు. భూమి ఉన్న రైతులకే కాదు కౌలు రైతులకూ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించారు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి. ఇది వ్యవసాయ రంగానికి సువర్ణఅధ్యాయం. అన్నదాతల మేలుకు మేలుకొలుపు. ఉచిత విద్యుత్ మొదలు రైతులకు ఇచ్చిన ప్రతి హామీకీ జవాబుదారు నేను అంటున్నారు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్. 
చెప్పినవే కాదు చెప్పనివి కూడా అన్నదాతకు పెట్టుబడిసాయం అందిస్తామన్న హామీని నిజానికి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత అమలు చేస్తామని అన్నారు వైఎస్ జగన్. కానీ తొలి ఏడాదిలోనే ఆ హామీని నెరవేర్చారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాదు చెప్పనివీ చేసి చూపిస్తాం అని ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డి అన్నమాటలకు తార్కాణం ఈ కార్యాచరణ. 

వ్య‌వ‌సాయానికి బ‌డ్జెట్‌లో పెద్ద‌పీట‌
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలి ఏకాదశి రోజున తొలిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై అన్న‌దాత‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్  రైతుల‌ దిశ, దశను మార్చేస్తుందని, అన్ని వర్గాలకూ మేలు చేసేదిగా, జనరంజకంగా, సంక్షేమానికి పెద్ద పీట వేసేదిగా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ప్రతిబింబించేలా ఈ బడ్జెట్‌ ఉండటాన్ని పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ ఆధారమైన మన రాష్ట్రానికి ఈ బడ్జెట్‌ వరాల జల్లు . ఇక పంటల బీమా కోసం ప్రీమియం సొమ్ములు చెల్లించే భారం ఇక రైతులకు ఉండదు. నూటికి నూరు శాతం రైతులకు ఇక బీమా ధీమా కానుంది. ముఖ్యమంత్రి జగన్‌ మాది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నట్టే వారికి పంటల బీమాపై పూర్తి భరోసా ఇచ్చారు. వైఎస్సార్‌ పీఎం ఫసల్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ప్రభుత్వమే చెల్లించేలా చేశారు.   బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ ఎన్నో రాయితీలు, ఉచితాలు ఇచ్చారు. ఉచిత పంటల బీమా పథకానికి ఏకంగా రూ.1,166 కోట్లు కేటాయించారు. గ‌త ప్ర‌భుత్వంలో చెల్లించ‌ని ఇన్‌ఫుట్ స‌బ్సిడీలు కూడా ఈ ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంద‌ని భ‌రోసా క‌ల్పించింది. గ‌త ప్ర‌భుత్వం నిర్ణ‌క్షం కార‌ణంగా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతుల కుటుంబాల‌కు వైయ‌స్ జ‌గ‌న్ స‌ర్కార్ అండ‌గా నిలిచింది. బాధిత కుటుంబాలను ప‌రామ‌ర్శించి వెంట‌నే రూ.7.50 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాల‌ని సీఎం క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. రైతుల‌కు పెట్టుబ‌డి సాయం కింద ప్ర‌తి ఏటా రూ.12,500 ఇస్తామ‌ని, ఈ మొత్తం కౌలు రైతుల‌కు కూడా చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ కోసం రూ.3 వేల కోట్ల‌తో ప్ర‌త్యేక నిధి, రూ.2 వేల కోట్ల‌తో ప్ర‌కృతి వైఫ‌రీత్యాల నిధి ఏర్పాటు చేశారు. ఇన్ని ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టిన వైఎస్ జ‌గ‌న్ రైతుల ప‌క్ష‌పాతి అని రుజువైంది.

వైయ‌స్ఆర్  లాగే 
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఓ నవతరం నేత. రాష్ట్రం నలుమూలలా పాదయాత్ర చేయడమే కాదు... కళ్లతో చూసి, మనసుతో విని అర్థం చేసుకున్న అసలైన జననేత. తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి లాగా ప్రజలపట్ల ప్రేమ. పలకరింపు, ఆదరణ, ఆదుకునే గుణం నేర్చుకున్న వ్యక్తి. అధికారం చేపట్టక ముందు ఏమి చేస్తానని హామీ ఇచ్చాడో అధికారం అందుకున్నాక అంతకు రెట్టింపు చేసి చూపిస్తున్నాడు.  అందుకే ముఖ్యమంత్రి అయ్యాక కూడా రాష్ట్రం అంతా ఇంకా జగనన్నా అనే ఆత్మీయంగా పిలుచుకుంటోంది. 
 
 

Back to Top