జగన్ దారి రహదారి

మాటలతో కోటలు కాదు

అనుకుంటే వెనకడుగు వేసేది లేదు

పోరాటం పేరు జగన్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసి ఓహో అనిపించాడు.అంతులేని జనాభిమానం సంపాదించుకుని జయహో అనిపించుకున్నాడు. అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను దాటుకుంటూ పోతున్నాడు. గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏడాదికాలంగా ప్రకటిస్తున్న హామీలను అచ్చుగుద్దినట్టు కాపీ కొట్టేస్తున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. అయినా అతడు తొణకలేదు. ఏడాది కాలంగా టీడీపీ వ్యతిరేక ఓట్లను మాయం చేసి, అనుకూల ఓట్లను రెండేసి సార్లు చేర్చుకుంటూ తొండాట ఆడుతున్నాడు బాబు. అయినా అతడు బాబులా శోకాలు పెట్టలేదు. ఓ సమస్య వచ్చినప్పుడు ఎలా దాన్ని అధిగమించాలో జగన్ ఆ పంథాలోనే సాగుతాడు. అందుకు దొడ్డి దారులు తొక్కడు. సాకులు చెప్పడు. కాలయాపన పనులు చేయడు.

ఓట్ల గల్లంతుపై

సర్వేల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జరగుతున్న ఓట్ల గల్లంతుపై వైఎస్ జగన్ ఎన్నోసార్లు బహిరంగంగా నిరసన తెలియచేసారు. ఇప్పుడు ఆధారాలతో నేరుగా ఎన్నికల కమీషన్ ముందుకెళ్లి నిలబడ్డారు. న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు అందించారు. గెలవడం ఇక అసాధ్యం అని అర్థమయ్యాకే చంద్రబాబు ఇలా దొడ్డిదారిన ఓట్ల గల్లంతుకు తెగబడ్డాడు. ఈవీఎమ్ లతో దొంగ ఓట్లు వేయడం సాధ్యం కాదు కనుక, బ్యాలెట్ కావాలంటూ కుంటిసాకులు చెబుతున్నాడు. వీటన్పిటిపై జగన్ మోహన్ రెడ్డి తనదైన స్టైల్లో జవాబిచ్చారు. కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో గెలిచింది ఈవీఎమ్ ల టాంపరింగ్ వల్లేనా అని లాజిక్ లేకుండా మాట్లాడే ముఖ్యమంత్రి ని సూటిగా ప్రశ్నించారు.

హత్యాయత్నంపై

ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నంపై కూడా జగన్ ఎంతో హుందాగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా అల్లర్లు జరక్కుండా సంయమనం పాటించాలంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. ఆందోళనలకు తావివ్వకుండా, ఘటనా స్థలంనుంచి దూరంగా హైదరాబాద్ వెళ్లిపోయారు. ప్రభుత్వం హత్యాయత్నం కేసును నీరుగారుస్తుందని అర్థం కాగానే నేరుగా కేంద్రాన్ని సంప్రదించారు. తనపై జరగుతున్న కుట్రలో సూత్రధారులెవ్వరో కనిపెట్టాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. ఈ కేసును వీలైనంత తేలిక చేసి మూసేయాలని, సూత్రధారులు, పాత్రధారులను సునాయాసంగా తప్పించాలనుకున్న రాష్ట్ర సర్కార్ పాచిక పారలేదు. జగన్ పై ఆరోపణలు చేస్తూ, హత్యాయత్నం చేసింది అభిమానే అంటూ కేసును తప్పుదోవ పట్టిస్తూ, హత్యాయత్నం జగన్ కుటుంబ సభ్యులే చేసారని ప్రచారం చేస్తూ వచ్చిన చంద్రబాబుకు, జగన్ చర్య పెద్ద ఎదురుదెబ్బలా తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఎ రంగంలోకి దిగడంతో  చెమటలు పట్టిన టిడిపి ప్రభుత్వం విచారణకు వీల్లేదంటూ కోర్టుకు పరుగెత్తింది. జగన్ పై హత్యాప్రయత్నం వెనుక అసలు దోషులు అనుక్షణం భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు నిజాలు బైటపడతాయో అని అదిరిపడుతున్నారు.

కేసులు, ఆరోపణలపై,

అన్యాయంగా  పెట్టిన కేసులపై ఇన్నేళ్లుగా వైఎస్ జగన్ తన నిజాయితీని న్యాయస్థానం ద్వారానే నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్నారు. తనపై వచ్చిన ప్రతి ఆరోపణనూ న్యాయపరంగానే ఎదుర్కుంటున్నారు. అంతేతప్ప తనను మరెవరో కాపాడాలని కోరుకోలేదు. దర్యాప్తు సంస్థలు దగ్గరకే రాకూడదని బాబులాగా వీరంగం వేయలేదు. స్టేలు తెచ్చుకుని కేసులనుంచి పారిపోలేదు. తనపై వచ్చిన ప్రతి ఆరోపణనూ ధైర్యంగా ఎదుర్కుంటున్నారు.. న్యాయపరంగా గెలిచి తానేంటో నిరూపించుకోవాలనే కోవలోనే వెళుతున్నారు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

షర్మిళమ్మ మీద అనుచిత వాఖ్యలపై

చివరికి కుటుంబ సభ్యులపై అనుచిత వాఖ్యలు చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలకే పూనుకున్నారు వైఎస్ జగన్. సోదరి షర్మిళపై అసభ్యకరమైన పోస్టులు చేస్తున్న తెలుగేదేశం కార్యకర్తలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, అరెస్టు చేయించారు.

ఎప్పుడూ సక్రమమైన మార్గంలో వెళ్లడం ఆ యువనాయకుడి అలవాటు. అడ్డదారులు అతడికి తెలియదు. తన పార్టీని వీడిన వారిని రాజీనామా చేయమన్నాడు. తనపార్టీలోకి వచ్చిన వారిని రాజీనామా ఇచ్చాకే చేర్చుకున్నాడు. అందుకే వైఎస్ జగన్ దారి రహదారి అని గర్వంగా చెప్పుకుంటారు అభిమానులు.

చట్టం అంటే గౌరవం...

న్యాయస్థానంపై నమ్మకం..

ధర్మం తప్పని నడత...

ఆశయం వీడని సంకల్పం...

 పోరాటం వీడని వ్యక్తిత్వం...

 ప్రజలే అన్నీ అనే ధైర్యం..

తండ్రి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం...

ఇవన్నీ కలబోస్తే వైఎస్ జగన్. అతడి తీరే ఓ విజన్.

Back to Top