మెగా పీపుల్ సర్వేలో వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు వెల్లువ‌

రాష్ట్ర‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న  "జగనన్నే మా భవిష్యత్తుష కార్య‌క్ర‌మం 

73 లక్షల కుటుంబాల సర్వే పూర్తి 

అమ‌రావ‌తి:   ప్రజలే ప్రభుత్వంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ప్రజల గడప వద్దకు చేర్చిన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ప్రజలు అపూర్వ రీతిలో మద్దతు పలుకుతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా మెగా పీపుల్స్‌ సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది. 
ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్లలో మేళ­తాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మ­రథం పడుతున్నారు.గ్రామాలు మొదలు పట్టణాల వరకు ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ నినాదం మార్మోగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా 55 లక్షలకు పైగా మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయి.

పార్వతీపురం పట్టణంలో 11వ రోజున "జగనన్నే మా భవిష్యత్తు" కార్యక్రమం  ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎంపీ గొడ్డేటి మాధ‌వి చేప‌ట్టారు.  ఈ కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్లు, గృహసారథలు, వైసీపీ నాయకులతో కలిసి 12వ వార్డులో ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకొని వారికి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వైయస్ జగన్ గారి 4 ఏళ్ల పాలనలో చేకూరిన లబ్ధి, ప్రజలు పొందిన ప్రయోజనాలతో పాటు గత ప్రభుత్వంలో ప్రజలు మోసపోయిన వైనాన్ని, మోసగించిన విధానాన్ని అర్థం అయ్యేలా రెండు ప్రభుత్వాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి అన్నది వివరించడంతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన గొప్పతనాన్ని వివ‌రించారు. మెగా పీపుల్ సర్వేలో బాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో పొందుపరిచిన ఐదు ప్రశ్నలను ఎంపీ, ఎమ్మెల్యే ఇరువురూ నేరుగా ప్రజలను అడిగి అవును అని సమాధానం చెప్పినట్లయితే బుక్ లో టిక్ మార్క్ పెట్టీ వారికి రసీదులు అందించారు. ప్రజలు మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్కు వైయ‌స్‌ జగన్ అన్నతోనే సాధ్యం అని, మా నమ్మకం నువ్వే జగన్ అని నిన‌దించారు.  స్థానికుల అంగీకారంతో ఇంటి డోరుపై, గోడపై జగనన్నే మా భవిష్యత్తు అనే స్టికర్ ను, ఫోన్ పై స్టిక్కర్ను అతికించి వారితో కలిసి ఫోటో దిగారు.

 సీఎం వైయ‌స్ జ‌గన్ గారి పాలనపై నమ్మకం ఉంచి భవిష్యత్తులో కూడా మళ్లీ ఆయన పాలనే కావాలని, రావాలని ప్రజలు అంతా విశ్వసించడంతో పాటుగా ప్రభుత్వానికి మద్దతుగా వారి ఫోన్ల ద్వారా మిస్డ్ కాల్స్ ఇచ్చి కుటుంబాలు అన్నే పూర్తి స్థాయి మద్దతు తెలపడం జరిగినది.  కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎంపీ  ప్రజలతో మాట్లాడుతూ ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తున్న మన ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని, ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రతిపక్షాలు, పగటివేషగాళ్లు లేనిపోని కల్లబొల్లి మాటలు, అబద్ధాలు, మాయ మాటలు చెపుతారని వాటిని ఏవీ నమ్మకుండా గొప్ప ప్రజాసంక్షేమ పాలనను కొనసాగిస్తున్న మన గౌ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి మద్దతు ప్రకటించి బాసటగా నిలిచి మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఆయనను సీఎంగా గెలిపించుకోవాలని కోరారు.  

Back to Top