గ‌డ‌ప గ‌డ‌ప‌లో ఘ‌న స్వాగ‌తం

ఆత్మ‌కూరులో శ్రీ‌శైలం ఎమ్మెల్యేకు గ‌జ‌మాల‌తో స్వాగ‌తం

శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తికి హార‌తి ప‌ట్టిన మ‌హిళ‌లు

మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిప్పేస్వామికి ఆత్మీక స్వాగ‌తం

అమ‌రావ‌తి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొన‌సాగుతోంది.  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఈ మూడున్న‌రేళ్ల‌లో అందించిన సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరును తెలుసుకునేందుకు గ్రామాల‌కు వెళ్తున్న నాయ‌కులు, అధికారుల‌కు స్థానికులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అడుగడుగునా ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఎదురెళ్లి మ‌హిళ‌లు హార‌తులు ప‌ట్టి ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నారు. త‌మ నేత వ‌చ్చాడ‌ని గ్రామ‌స్తులు గ‌జ‌మాల‌లు, బాణాసంచా పేల్చి అపూర్వ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఏ ఊరికి  వెళ్లినా, ఏ వీధికి వెళ్లినా ఇవే కనిపిస్తున్నాయి. ప్ర‌తి గ‌డ‌ప వద్ద త‌మ ఆత్మీయ నేత‌లు వ‌చ్చార‌ని సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకునేందుకు ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ తిరిగేవాళ్ల‌మ‌ని, ఇవాళ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నేత‌ల‌ను, అధికారుల‌ను  మా ఇంటికే పంపిస్తున్నార‌ని హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా తమకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల వద్ద పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

గ‌జ‌మాల‌తో స్వాగ‌తం
శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఇవాళ ఆత్మకూరు మున్సిపాలిటీ ప‌రిధిలోని 16 వార్డులో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఎమ్మెల్యే చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మం గురువారం 50 వ రోజుకు చేరుకోవ‌డంతో స్థానిక  మున్సిప‌ల్ చైర్మ‌న్‌, కౌన్సిల‌ర్లు, వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు గ‌జ‌మాల‌తో ఎమ్మెల్యేకు ఆహ్వానం ప‌లికారు. 50 కేజీల కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు.  సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్న వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి తమ ఆశీస్సులు ఎప్పుడూ  ఉండేలా దీవించాల‌ని ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కోరారు.  

  జ‌గ‌న‌న్న మంచి పనులే గెలిపిస్తాయి: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
 సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేద ప్రజలకు చేసిన  మంచి ప‌నులే మ‌మ్మ‌ల్ని గెలిపిస్తాయ‌ని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శింగనమలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతీ వీధికి వెళ్లి ప్రజలను కలిశారు. ఆమెకు మ‌హిళ‌లు హార‌తి ప‌ట్టి ఆప్యాయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు ఇలా ప్రజల మధ్యలో ఉండటం తెలుగుదేశం పరిపాలనలో చూశారా? అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు రావడం, హడావుడి చేయడం, ఓట్లు అడగడం, ఫొటోలకు ఫోజులివ్వడం అంతే మళ్లీ ఐదేళ్ల వరకు ప్రజలకు ముఖం కూడా చూపించేవారు కాదని అన్నారు. కానీ జగనన్న పరిపాలనలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ నిత్యం ప్రజల మధ్యలోనే ఉండటం గొప్ప విషయమని అన్నారు. గ్రామంలో లబ్ధిదారురాలు మర్తాడు పర్వీన్ కు జగనన్న రాసిన లేఖను ఎమ్మెల్యే చూపించారు. ఈ మూడున్నరేళ్లలో జగనన్న సంక్షేమ పథకాలు అందిన వివరాలను తెలిపారు. ప్రజలందరినీ వారి గడప వద్దనే కలుసుకుని, యోగక్షేమాలు తెలుసుకుని వారికి అండగా నిలిచే మహోత్తర కార్యక్రమం గడపగడపకు మన ప్రభుత్వం అని ఎమ్మెల్యే ప‌ద్మావ‌తి తెలిపారు.  

వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించండి: ఎమ్మెల్యే తిప్పేస్వామి
సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ఆశీర్వదించాల‌ని ఎమ్మెల్యే తిప్పేస్వామి కోరారు. సత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, కొంకల్లు గ్రామసచివాలయము పరిధిలోని ఎస్ ఎస్ గుండ్లు గ్రామంలో ఎమ్మెల్యే  డాక్ట‌ర్ తిప్పేస్వామి  గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. ఎమ్మెల్యే ప్రజలను నేరుగా వారి గడపవద్దనే కలుసుకుని వారు పొందిన సంక్షేమ పథకాలను మరొకసారి గుర్తుచేస్తూ ప్రజలందరి వద్ద నుంచి పెద్ద యెత్తున ఆశీర్వాదములు తీసుకుంటున్నారు.  గ్రామంలో నెలకొన్న సమస్యలను వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది తెలుసుకొని వాటిని ప‌రిష్క‌రించారు.  అర్హత ఉండి కూడా ఎవరికైనా సంక్షేమ పథకాలు అంద‌క‌పోతే త‌మ దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు.  కార్యక్రమంలో  జడ్పీటీసీ, ఎంపీపీ సర్పంచులు, ఎంపీటీసీలు . వైస్ ఎంపీపీలు వక్కలిగ కార్పొరేషన్ డైరెక్టర్స్, సొసైటీ చైర్పర్సన్, వైయ‌స్ఆర్ సీపీ  సీనియర్ నాయకులు మహిళలు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top