ఉత్సాహంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం

ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్న గ్రామ‌స్తులు

అమ‌రావ‌తి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. ఇందులో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధుల‌కు గ్రామాల్లో ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమంటూ ఎమ్మెల్యేలు ప్ర‌తి గ‌డ‌ప‌కు వెళ్లి వారికి అందిన సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తున్నారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా తమకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల వద్ద పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇళ్లకు వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులకు ప్రజలు వాడవాడనా ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు. సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్న వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వానికి తమ మ‌ద్ద‌తు అంటున్నారు.  గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్న ఎమ్మెల్యేలు తమ దృష్టికి వచ్చిన స‌మ‌స్య‌ల‌ను వెంటనే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు . ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజలు దీవిస్తున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top